Infectious Laryngotracheitis in Chickens: ఈ వ్యాధి పెద్ద కోళ్ళలో తీవ్రమైన స్థాయి నుండి సాధారణమైన స్థాయిలో కలుగుతుంటుంది. ఈ వ్యాధిలో ప్రధానంగా శ్వాసకోశ వ్యవస్థకు సంబంధించిన రీల్స్, గార్ల్ లింగ్, రాట్టింగ్ మరియు ఓపెన్ మౌత్ బ్రీతింగ్ వంటి ఇబ్బందులుంటాయి. ఈ వ్యాధిలో కోళ్ళు దగ్గినప్పుడు రక్తంతో కూడిన మ్యూకోజా నోటి నుండి బయటకు పడుతుంటుంది. ఈ వ్యాధి హెర్పిస్ విరిడే కుటుంబానికి చెందిన హెర్పిస్ వైరస్ వలన కలుగుతుంటుంది. ఇది ఒక DNA డబుల్ స్టాండర్డ్ వైరస్. ఇది సుమారు 80-100nm పరిమాణం కలిగి ఉంటుంది.ఈ వ్యాధి అన్ని రకాల కోళ్ళ జాతులలో, అన్ని వయస్సుల లో కలుగుతుంటుంది. 3-9 నెలలలోపు వయస్సు గల పక్షులలో వ్యాధి లక్షణాలు ఎక్కువగా కన్పిస్తుంటాయి. ఐ.బి, పాక్స్, ఆర్.డి, హిమోఫిలస్, మైకోప్లాస్మా, విటమిన్ – ఏ లోపం లేదా కోళ్ళ ఫారం లో అమోనియా శాతం పెరిగినప్పుడు ఈ వ్యాధి ఎక్కువగా ప్రబలుతుంటుంది.
వ్యాధి వచ్చు మార్గం: గాలి ద్వారా, కంటి పై పొరల ద్వారా, కలుషితమైన ఆహారం, కలుషితమైన పరికరాల ద్వారా, కలుషితమైన లిట్టర్ ద్వారా ఆరోగ్యంగా ఉండు కోళ్ళకు ఈ వ్యాధి వ్యాపిస్తుంటుంది. ఎలుకలు, కాకులు, గ్రద్దలు, ఫారమ్ వాహకాల ద్వారా ఈ వ్యాధి ఒక ఫారం నుండి మరోక ఫారమ్కు వ్యాపిస్తుంటుంది. తక్కువ స్థలంలో ఎక్కువ కోళ్ళను ఉంచుట లేదా సరిగ్గా గాలి ఆడని ఫారమ్లో ఈ వ్యాధి వచ్చుటకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యాధిలో ఇంక్యుబేషన్ పీరియడ్ సుమారు 6-7 రోజుల వరకు ఉంటుంది.
వ్యాధి లక్షణాలు: ఈ వ్యాధిలో లక్షణాలను 3 రకాలుగా విభజించవచ్చు. అతి తీవ్రమైన ఈ దశలో కోళ్ళు ఎటువంటి లక్షణాలు చూపించకుండానే మరణిస్తుంటాయి. కొన్ని కోళ్ళలో డిస్స్నియా, దగ్గు, రక్తంతో కూడిన కళ్ళే, రక్తము మరియు మ్యూకస్ తో కూడిన స్రావాలు ముక్కు నుండి కారుతుంటాయి.ఈ దశలో కోళ్ళలో తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులుంటాయి.
Also Read: Infectious Bursal Disease in Chickens: కోళ్ళలో గంబోరో వ్యాధి ని ఎలా నివారించాలి.!
స్నీజింగ్, కాఫింగ్, రాటిలింగ్ శబ్ధములుంటాయి. దగ్గు వచ్చిపోతు ఉంటుంది. కోళ్ళు తల మరియు మెడ భాగాలను పైకి లేపి, నోటితో గాలిని: పీలుస్తుంటాయి. కూంబ్ మరియు వాటిల్స్ సైనోటిక్ గా ఉంటాయి. కంటి నుండి ద్రవాలు కారుతుంటాయి. గ్రుడ్లు పెట్టె కోళ్ళలో ఉత్పాదన చాలా తక్కువగా ఉంటుంది. ఈ దశ సుమారు 2-4 వారాల వరకు ఉంటుంది. ఈ దశలో కోళ్ళు చివరకు శ్వాస ఆడక చనిపోతుంటాయి.తక్కువ తీవ్రత గల దశలో మాయిస్ట్ రేల్స్, కొద్ది పాటి దగ్గు, తల విదిలిస్తుండడం, నాసల్ డిస్చార్జెస్, కంజెక్టివైటిస్ మరియు గ్రుడ్ల ఉత్పత్తిలో తగ్గుదల ప్రధానంగా ఉంటుంది.
రైతు తెలిపే వ్యాధి చరిత్ర ఆధారంగా, పైన వివరించిన వ్యాధి లక్షణాలు ఆధారంగా ఈ వ్యాధిని కొంత వరకు ఊహించవచ్చు. ప్రయోగశాలలో సిరోలాజికల్ పరీక్షలు ద్వారా మరియు ఎంబ్రియేనేటెడ్ ఎర్గ్ ఇనాక్యూలేషన్ ద్వారా ఈ వ్యాధిని ఖచ్చితంగా గుర్తించవచ్చు. ఈ వ్యాధిని రానికేట్ వ్యాధి, ఇన్ఫెక్ష్యూయస్ బ్రాంకైటిస్ వ్యాధితో సరిపోల్చుకొని చూసుకొనవలసి ఉంటుంది.
చికిత్స: ఇది ఒక వైరల్ వ్యాధి కనుక దీనికి ఖచ్చితమైన చికిత్స లేదు. సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఏదైనా ఒక ఆంటీబయోటిక్ ఔషధాలను నీటి ద్వారా అందించవలసి ఉంటుంది.ఫారమ్ చుట్టూ పరిశుభ్రంగా ఉంచాలి. పర్యాటకులను ఫారమ్లోనికి అనుమతించరాదు. ఫారమ్ ఉపయోగించు పరికరాలను శుభ్రంగా ఉంచాలి. చనిపోయిన పక్షులను ఫారం దూరంగా పూడ్చిపెట్టాలి లేదా కాల్చాలి. లేయర్స్కు మరియు బ్రాయిలర్స్కు ఉపయోగించు కేజ్లను పరిశుభ్రంగా ఉంచాలి. లిటర్ను మారుస్తూ ఉండాలి. రవాణా చేయు వాహనాలు మరియు ఖాళీ అయిన ఫీడర్స్, గ్రుడ్లు బ్రేస్లను డిస్ఇన్ ఫెక్టింట్ చేయాలి. ఫారమ్ లోకి ప్రవేశించుటకు ముందు ఫుట్బాలను ఉపయోగించాలి.
Also Read: Infectious Bronchitis in Chickens: కోళ్ళలో ఇన్ ఫెక్ష్యూయస్ బ్రాంకైటిస్ వ్యాధి ఎలా వస్తుంది.!