Infectious Canine Hepatitis in Dogs: ఈ వ్యాధిని మొట్ట మొదట రుబార్త్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. ఫలితంగా ఈ వ్యాధిని రుఖార్త్ వ్యాధి అని అంటారు. ఈ వ్యాధిలో ప్రధానంగా తీవ్రమైన జ్వరం, వాంతులు, విరోచనాలు మరియు నరముల ఉద్రిక్తత ఉంటుంది.ఇది ఎడినో వైరస్ మూలంగా వస్తుంది. ఈ వైరస్ డబుల్ స్టాండర్డ్ DNA మరియు Non Enveloped వైరస్. ఇది ఐకసో హైడ్రల్ ఆకారంలో ఉండి, సుమారు 70-90 nm పరిమాణం కలిగి ఉంటుంది. ఈ వ్యాధి తీవ్రత కాలేయంలో ఎక్కువగా వుంటుంది. కాబట్టి దీనిని హెపటైటిస్ కంటే జియోజ కానిస్ అని కూడా అంటారు.
కుక్కల వయస్సు:- ఈ వ్యాధి అన్ని జాతుల కుక్కలలోను మరియు అన్ని వయస్సుల కుక్కలలో కలుగుతున్నప్పటికిని, 2 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు కలిగిన యుక్త వయస్సు గల కుక్కలలో ఈ వ్యాధి తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యాధి ఎక్కువగా వర్షాకాలంలో వస్తుంది.
Also Read: Rabies Disease in Dogs: పెంపుడు కుక్కలలో రేబిస్ వ్యాధి ఎలా వస్తుంది.!
వ్యాధి వచ్చు మార్గం:- వ్యాధి నుండి కోలుకున్న కుక్క శరీరంలో ఈ వైరస్ కొన్ని నెలల వరకు ఉండి వాటి మలము, మూత్రం మరియు లాలాజలం ద్వారా బయటకు విసర్జించబడుతుంటుంది. ఫలితంగా వీటితో కలుషితం అయిన ఆహారం మరియు నీరును ఆరోగ్యవంతమైన కుక్కలు తీసుకోవడం ద్వారా వాటికి ఈ వ్యాధి సోకుతుంది. కుక్క యొక్క విసర్జక పదార్థాలతో కలుషితమైన పరికరాలను తాకడం వలన కూడా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. వైరస్ కలుషితమైన గాలిని పీల్చడం ద్వారా కూడా ఈ వ్యాధి ఆరోగ్యంగా ఉన్న కుక్కలకు వ్యాపిస్తుంటుంది. వ్యాధి నుండి కోలుకొన్న కుక్కలు 6 నెలల వరకు ఈ వైరసు వాటి మూత్రం ద్వారా బయటకు విసర్జించు తుంటాయి.
వ్యాధి వ్యాప్తి:- వ్యాధి సోకిన కుక్క విసర్జక పదార్థాలయిన లాలాజలము, మలము మరియు మూత్రంతో కలుషితమైన ఆహారము, నీరును నోటి ద్వారా తీసుకోవడం వలన వైరస్లు పొట్టలో చేరి అక్కడి నుండి ప్రేగుల ద్వారా రక్తంలో కలుస్తాయి. అదే విధంగా గాలి ద్వారా పీల్చుకో బడిన వైరస్లు లింఫ్ గ్రంథులలో పెరిగి తద్వారా రక్తంలో చేరి వైరిమియాను కలుగజేస్తుంది. తరువాత రక్తం ద్వారా ఈ వైరస్ కాలేయంలో చేరి దీర్ఘకాలిక హెపటైటిస్ కలుగ జేయుట ద్వారా జాండిస్, మూత్రపిండంలో చేరి దీర్ఘకాలిక నెప్రెటీసు, ఊపిరితిత్తులలో చేరి న్యూమోనియా కలుగజేస్తుంది. అదే విధంగా కంటిలోని’ కార్నియాను నాశనం చేయుట వలన బ్లూ ఐస్, కేంద్రియ నాడీ వ్యవస్థలో చేరి నాడీ కణాలను నాశనం చేయుట వలన నాడీ కణ సంబంధ ఇబ్బందులను కలుగ చేయుట వలన కుక్కలు చనిపోతుంటాయి.
Also Read: Canine Distemper in Dogs: పెంపుడు కుక్కలలో వచ్చే కెనైన్ డిస్టెంబర్ వ్యాధికి చికిత్స