American pork : గత కొద్దీ రోజులుగా భారత్. అమెరికా మధ్య ఒప్పందాల పరంపర కొనసాగుతుంది. ఇప్పటికే భారత్ పై నిషేధం విధించిన మామిడి, దానిమ్మ పండ్ల ఎగుమతులపై రాజీ కుదిరింది. ఇకపై భారత్ నుంచి అమెరికాకు మామిడి, దానిమ్మ పండ్లను ఎగుమతి చేయనుంది. కాగా తాజాగా మరో ఆసక్తికర ఒప్పందానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ పత్రిక ప్రకటన ప్రకారం… మొదటిసారిగా భారతదేశంలోకి అమెరికా పంది ఉత్పత్తి దిగుమతులను ఢిల్లీ అనుమతించింది. ఈ విషయాన్ని అమెరికా వాణిజ్య ప్రతినిధి కేథరీన్ తాయ్ , యునైటెడ్ స్టేట్స్ వ్యవసాయ కార్యదర్శి టామ్ విల్సాక్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
గత ఏడాది నవంబర్‌లో జరిగిన యుఎస్-ఇండియా ట్రేడ్ పాలసీ ఫోరమ్ సమావేశంలో వాణిజ్య మంత్రి పియూష్ గోయల్‌తో రాయబారి తాయ్ యుఎస్ పోర్క్ యాక్సెస్ పలు అంశాలపై చర్చించారు. అందులో భాగంగా మొదటిసారి అమెరికా పంది మాంసం దిగుమతులను అనుమతించడానికి భారతదేశం ఒప్పందం కుదుర్చుకుంది. కాగా..యునైటెడ్ స్టేట్స్ వ్యవసాయ కార్యదర్శి విల్సాక్ మాట్లాడుతూ.. అమెరికా ఫోర్క్ ప్రోడక్ట్ భారత్ తో ఒప్పందం కుదుర్చుకునేందుకు దాదాపు రెండు దశాబ్దాలుగా ప్రయత్నం జరుగుతుందని చెప్పారు. యుఎస్ పంది మాంసం పరిశ్రమ తన అధిక-నాణ్యత ఉత్పత్తులను వినియోగదారులకు వీలైనంత త్వరగా రవాణా చేయడం ప్రారంభించగలదని అన్నారాయన.
2020లో అమెరికా ప్రపంచంలోని మూడవ అతిపెద్ద పంది మాంసం ఉత్పత్తిదారు మరియు రెండవ అతిపెద్ద ఎగుమతిదారుగా ఉంది. పంది మాంసం ఉత్పత్తుల ప్రపంచ విక్రయాల విషయంలో అమెరికా USD 7.7 బిలియన్లుగా ఉన్నాయి. 2021 ఆర్థిక సంవత్సరంలో అమెరికా 1.6 బిలియన్ డాలర్ల వ్యవసాయ ఉత్పత్తులను భారతదేశానికి ఎగుమతి చేసింది.
India – US, American pork, Agriculture News, Eruvaaka