Silage Grass: రైతులు పండించే పంట గిట్టు బాటు అయినప్పుడే సాగు లాభసా టిగా ఉంటుంది. అందులో భాగంగా కొంతమంది రైతులు స్థానికంగా ఉన్న మార్కెట్ అవసరాలను గుర్తించి తదనుగుణంగా పంటలు సాగుచేసి మంచి ఆదాయాన్ని పొందుతారు. ఇదే పద్ధతిలో గడిచిన రెండేళ్లుగా ప్రకాశం జిల్లా ఇంకొల్లు కేంద్రంగా మొక్కజొన్న పంట నుంచి సైలేజ్ గ్రాసం తయారుచేసి రైతులు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. ఇక్కడ సైలేజ్ గడ్డి, దాణా తయారు చేసే మొబైల్కేంద్రం ఏర్పాటు కావడం వారికి ఎంతో లాభసాటిగా మారింది. మొక్కజొన్న పంటకాలం పూర్తవడానికి నెలరోజుల ముందే కోత కోస్తున్నందున వారికి అదనపు ఖర్చు తగ్గడంతోపాటు మరో కొత్త పంటను సకాలంలో వేసుకునే వెసు లుబాటు కలుగుతోంది.
ఎకరాకు 15 టన్నుల దిగుబడి: కొనుగోలు కేంద్రం నిర్వాహకులు మొక్కజొన్న పంటను రైతుల నుంచి సైలేజ్ మాగుడుగడ్డి కోసం ఎకరాల వంతున తీసుకుని, తూకం వేసుకుని స్థానిక మార్కెట్ యార్డులకు తరలి స్తున్నారు. టన్ను పచ్చిచొప్పకు రూ. 1800 వంతున చెల్లిస్తున్నారు. ఎక రాకు 14 నుంచి 17 టన్నుల వరకు పచ్చిచొప్ప దిగుబడి వస్తోంది. దీనికి తోడు కోత కోయడం, రవాణాకయ్యే ఖర్చులు కూడా రైతులు చెల్లించా ల్సిన అవసరం లేదు. రైతులు ముందుగానే ఒప్పందం చేసుకొని మొక్కజొన్న సాగు చేస్తు న్నారు.
పంటకోత మొక్కజొన్న పంటకాలం 100 నుంచి 110 రోజులు. అయితే 60 నుంచి 70 రోజుల్లోనే పాలకండె దశలోనే పంటను ప్రత్యేక యంత్రాల ద్వారా కోత కోయటం వల్ల పొలంలో మరో పైరు వేసుకునే అవ కాశం ఏర్పడుతోంది. ఈ విధానం లాభసాటిగా ఉండటం వల్ల చాలా మంది రైతులు లేతగా ఉన్నమొక్కజొన్న పంటను సైలేజిగడ్డి తయారీకోసం విక్రయిస్తున్నారు. ఈ విధంగా చేయడం వల్ల ఎకరాకు రూ.20 నుంచి రూ.25 వేల వరకు ఆదాయం పొందుతున్నారు.
తయారీ: మొక్కజొన్న పచ్చిచొప్పను అంగుళం ముక్కలుగా కత్తిరించి అందులో కెమిన్ ద్రావణం కలుపు తారు. దాణాగడ్డి 40 నుంచి 50 శాతం నెమ్ము ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రత్యేక యంత్రం ద్వారా గడ్డిని ఒత్తిడికి గురిచేసి గుండ్రని ఆకారంలోకి మార్చి గాలిచొ రబడని విధంగా మైక్రోప్లాష్టర్తో చుట్టేస్తారు. ఇలా తయారైన ఒక్కో కిలోల బరువు బండిల్ 400 కిలోల తూగుతుంది. ఏడాది పాటు నిల్వ ఉంటుంది.
Also Read: Silage: పాడి పశువులకు పచ్చడి తయారీ- సైలేజ్
Also Watch: