పశుపోషణ

కరోనా వేళ కడక్ నాథ్ కోళ్లకు మాంచి డిమాండ్..

0
Kadaknath chicken

Huge Demand For Kadaknath Chicken కరోనా అందరిలోనూ ఆరోగ్యంపై శ్రద్ద వహించేలా చేసింది. ఆరోగ్యానికి మేలు చేసే పదార్ధాలని ఆహారంలో తీసుకుంటున్నారు. పుష్కలంగా పోషకాలు ఉన్న పదార్ధాల కోసం వెతికి వెతికి తింటున్నారు. ఇక మాంసం ప్రియుల కోసం కోళ్లు, మేకలు, చేపలు ఉన్నాయి. కానీ మేలుజాతి వజ్రం కడక్ నాథ్ Kadaknath Chicken కోళ్ల గురించి చాలా మందికి తెలియదు . పుష్కలంగా పోషకాలు, ఔషధ గుణాలు కలిగిన ఈ కోడి మాంసాన్ని న్యూట్రిషనిస్టులు ప్రధానంగా సూచిస్తున్నారు. పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటే కోవిడ్‌ను నిరోధించవచ్చని వైద్యులు సూచిస్తుండటంతో ఈ కోళ్లకు మరొకసారి డిమాండ్ అమాంతంగా పెరిగింది. ఫలితంగా చికెన్, మటన్ కంటే కడక్‌నాథ్ చికెన్ ధర కొండెక్కి కూర్చుంది.

Kadaknath chicken

ఆ జాతి కోట్లలో చర్మం ,మాంసం ,ముక్కు, గోళ్లు, ఎముకలు.. ఆఖరకు నాలుక కూడా నలుపే. కడక్‌నాథ్‌ కోళ్లలో ప్రోటీన్లు సమృద్ధిగా లభిస్తాయి. కొవ్వు, కొలె్రస్టాల్‌ శాతం తక్కువగా ఉంటాయి. దీని మాంసం తింటే ఊబకాయం రాదు. ఇది రక్తంలో హిమోగ్లోబిన్‌ శాతం పెంచడమే కాకుండా శ్వాస సంబంధమైన ఆస్తమా వంటి రోగాలను కూడా నియంత్రిస్తుందని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు. మరో విశేషం ఏంటంటే ఈ రకం కోళ్లు పురిటి నొప్పులు తగ్గించడంలోనూ మగవారిలో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతుందట. ఈ ప్రయోజనాలతోపాటు మంచి రుచిగా ఉండడంతోపాటు కడక్‌నాథ్‌ చికెన్‌ ధర రూ. 800లు వరకు పలుకుతోంది. కొన్ని ప్రాంతాల్లో దీని ధర 1000 కి పైగానే ఉందంటే నమ్మగలరా?. ప్రస్తుతం హైదరాబాదులో మార్కెట్ లో కడక్ నాథ్ చికెన్‌ కిలో 1000 నుంచి రూ 1200 వరకు పలుకుతోంది. Poultry Farming

Kadaknath chicken

సాధారణంగా కడక్‌నాథ్ బ్రీడ్ మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, రాజస్థాన్‌లలోని గిరిజన ప్రాంతాల్లో దొరుకుతుంది.ఈ కోడి మొత్తం నలుపురంగులోనే ఉంటుంది.దీని గుడ్లు కాస్త ముదురు కాఫీ రంగుతో పాటు కొంత పింక్ కలర్‌లో ఉంటాయి. కడక్‌నాథ్ కోళ్లను మాంసం కోసం గుడ్లు కోసమే పెంచుతారు. ఈ కడక్ నాథ్ కోళ్లు తెలుగు రాష్ట్రాల్లో కూడా బాగా ఫేమస్ అయ్యాయి కూడా.. Despite high nutritional value in Kadaknath chicken

Kadaknath chicken

ఇక కడకు కోళ్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో రైతులు కూడా ఈ రకం కోళ్లపై దృష్టి పెడుతున్నారు. అటు వ్యవసాయంతో పాటు ఇటు కడక్ నాథ్ కోళ్ల పెంపకాలను చేపడుతున్నారు. వ్యవసాయానికి అనుబంధంగా అదనపు ఆదాయ వనరుగా ఈ కడక్ నాథ్ కోళ్ల పెంపకం మంచి లాభసాటిగా ఉందంటున్నారు .ప్రస్థుతం తెలుగు రాష్ట్రాల్లో నాటు కోడిని తలదన్నేలా కడక్ నాథ్ కోళ్లు మార్కెట్లో మాంసం ప్రియుల్ని దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది. Kadaknath Chicken

Leave Your Comments

తెలంగాణాలో ఆగని రైతుల ఆత్మహత్యలు…

Previous article

ఉస్మానాబాద్ మేక పాలతో సబ్బుల తయారీ

Next article

You may also like