పశుపోషణమన వ్యవసాయం

Reproductive System Of Dairy Cattle: పాడి పశుపులలో పునరుత్పత్తి ఎలా జరుగుతుంది.!

0
Reproductive System in Dairy Cattle
Reproductive System inDairy Cattle

Reproductive System Of Dairy Cattle: వ్యవసాయ అనుబంధ రంగమైన పశువులకు మనదేశంలో ఒక ప్రత్యేక స్థానం కలదు. (ఆవులు, గేదెలు, (గొర్రెలు, మేకలు, కోళ్ళు) మనకు పాలు, మాంసం, గ్రుడ్లు, చర్మం, ఉన్ని వంటి ఉత్పత్తులనే గాక, వ్యవసాయ పనులకు పొలం దున్నుట, బండి లాగుటకు మరియు వాటి ఎరువులతో వ్యవసాయ పొలాలను సుపోషకం చేయుట, గోబర్ గ్యాస్ ఉత్పత్తి ద్వారా వంట గది అవసరాలను తీర్చుటకు దోహదపడుతున్నాయి. అందుకే మన పూర్వీకులు పాడి – పంట అన్నారు. పాడికి మొదటి స్థానం ఇచ్చి, పంటకు రెండొవ స్థానం ఇస్తారు. భారత ప్రభుత్వం నేటి వరకు వ్యవసాయానికే అధిక ప్రాధాన్యత ఇచ్చి పశు సంపదను నిర్లక్ష్యం చేయుట వలన పాడి పరిశ్రమ అనుకున్న స్థాయిలో అభివృద్ధి జరగలేదనే చెప్పవలసి ఉంటుంది.

పాడి పోషణలో గల సమస్యలు తక్కువ నాణ్యత గల దేశవాళీ పాడి పశువులను సంకరం చెయ్యక పోవుట, పాడి పశువుల, ఇతర పశువుల యాజమాన్యంలో శాస్త్రీయ పద్ధతులు పాటించక

పోవుట, రైతుల సామాజిక, ఆర్థిక పరిస్థితులు మరియు అశ్రద్ధ, అనాశక్తి, ఋతువుల ప్రభావం ప్రభుత్వం నుండి సకాలంలో చేయూత అందక పోవుట లాంటి కారణాలు పాడి పరిశ్రమకు ప్రతికూలంగా మారాయని చెప్పవచ్చు. ఫలితంగా ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న పాలు, మాంసం, ఇతర పశు ఉత్పత్తులు మన దేశ జనాభా అవసరాలను తీర్చలేక పోతున్నది.

Also Read: Poultry Farm Shed: కొత్తగా కోళ్ల ఫారమ్ షెడ్డు నిర్మింపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.!

నేడు వ్యవసాయం ఆశించినంత దిగుబడులను ఇవ్వక పోవుట, ఆర్థిక పరమైన లాభాలు సరిగ్గా లేక ఉండుట వంటి అంశాలు రైతులను పాడి పరిశ్రమ వైపుకు నడిపిస్తున్నాయి. ఫలితంగా భారత ప్రభుత్వం కూడా గడచిన కొన్ని సంవత్సరాలు గా పశు సంపద అభివృద్ధికి తీవ్రంగా క్రుషి చేస్తున్నది.

Reproductive System Of Dairy Cattle

Reproductive System Of Dairy Cattle

పాడి పశుపులలో పునరుత్పత్తి

ఈ రోజులలో పాడి పశువులలో పునరుత్పత్తి రెండు పద్ధతుల ద్వారా చేస్తుంటాము

1. సహజ సంపర్కం ద్వారా ఆంబోతు చేత దాటించడం

2. కృత్రిమ గర్భధారణ పద్ధతి

సహజ సంపర్కం అంటే సహజంగా ఒక ఆవు గాని, గేదె గాని ఎదకు వచ్చినపుడు ఆంబోతు చేత దాటించి సంతానోత్పత్తి చేయడమన్నమాట.

కృత్రిమ గర్భధారణ అంటే ఒక మేలు జాతి వీర్యాన్ని శాస్త్రీయ పద్ధతులలో, పరికరాల ద్వారా సేకరించి ఎదకు వచ్చిన పశువుకు, పరికరాల ద్వారా వీర్యాన్ని యోనిలో ప్రవేశింపజేసి, చూడికట్టించి సంతానోత్పత్తి చేయడం.

మన పశువులను త్వరగా అభివృద్ధి పరిచి అధిక పాల ఉత్పత్తి చేయడానికి కృత్రిమ గర్భధారణ పద్ధతి ఒక్కటే మార్గము. మన దేశవాళి పశువులను అధిక పాల ఉత్పత్తి చేసే విధంగా సంకరం పరచడానికి పెద్ద యెత్తున కృత్రిమ గర్భధారణ పద్ధతి ద్వారా పద్దతి ద్వారా పశుగణాభివృద్ధి చేయడం.. జరుగుతుంది.

కృత్రిమ గర్భాధారణ విజయవంతం కావాలంటే పశువులలో ఎద లక్షణాలను గుర్తించి, సకాలంలో కృత్రిమ గర్భాధారణ చేయించవలసి ఉంటుంది. రైతు తన అజాగ్రత వల్ల ఎదను గుర్తించక, ఒక ఎద తప్పినట్లైతే ఆ పశువు, విలువైన పునరుత్పత్తి జీవితకాలంలో ఒక నెల రోజులు నష్టపోయినట్లే అంటే ఈ నష్టం సుమారు వెయ్యి రూపాయలుగా అంచనా వేయబడినది. పశువులు ఎదకు వచ్చినపుడు, వాటి లక్షణాలు జాగ్రత్తగా గమనించి గర్భాధారణ చేయించడానికి ఆడ పశువు యుక్త వయస్సుకు వచ్చిన తర్వాత దాని అండాశయంలో ఉత్పత్తి అయిన హార్మోనుల ప్రభావం వల్ల ఎద లక్షణాలు వ్యక్తం చేస్తుంది.

ఆవులు సంవత్సరం పొడువునా ఎదకు వస్తాయి. గేదెలు ఆగష్టు నుండి మార్చి వరకు ఎక్కువగా ఎదకు వస్తాయి. గేదెలు ప్రతి 20-25 రోజుల కొకసారి ఎదకు వస్తాయి.

Also Read: Rinderpest Disease in Buffaloes: గేదెలలో ముసర వ్యాధిని ఇలా నయం చెయ్యండి.!

Leave Your Comments

Turkey Bird Farming: టర్కీ కోళ్ళ పెంపకంలో మెళుకువలు.!

Previous article

Cassia Angustifolia Cultivation: నేలతంగేడు సాగులో మెళుకువలు.!

Next article

You may also like