Livestock Management: వేసవి కాలం అయిపోయి వర్షాకాలం వచ్చేసింది , వర్షాకాలం అంటే వ్యాధుల కాలం. చెప్పాలంటే పాడి పశువులు కలిగిన రైతులకు ఈ వర్షాకాలం అనేది గడ్డు కాలం అనే చెప్పవచ్చు. కురిసే వాన జల్లులు, వీచే చలి గాలులు పశువుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతూ ఉంటాయి. వానాకాలంలో ఉండే చిత్తడి వాన, చిరుజల్లులు, క్రొత్త పచ్చిక,క్రొత్త నీరు, అపరిశుభ్ర వాతావరణం , ముసిరే ఈగలు, దోమలు పాడి పశువులలో రోగాలు ప్రబలెలా చేస్తాయి . వ్యాధుల తీవ్రత పెరిగే కొలది పాడి పశువులలో పాల దిగుబడి సామర్ధ్యం తగ్గడం, ఆరోగ్యం క్షీణంచడంతో పాటు పశువులలో మరణాలు సంభవించే ప్రమాదం కూడా కలదు. అందువలన చికిత్స కన్నా నివారణ మేలు అని పాడి పశువుల రైతులు గ్రహించి, వ్యాధి ఆశించాక చికిత్స కోసం వెలు ధారపోసి కంటే నివారణగా ముందుగానే టీకాలు వేయించడం,పశువుల పాకలు పరిశుభ్రంగా, పొడిగా వుంచడం మంచిది.
ఆవులకు, గేదెలకు ముఖ్యంగా తొలకరి వర్షాలు పడిన వెంటనే వచ్చే జబ్బులలో జబ్బ వాపు, గొంతు వాపు, పొదుగు వాపు, గాలికుంటు వ్యాధి, ఎఫిమెరల్ ఫీవర్స్ ఎక్కువగా రావటం జరుగుతుంది.
జబ్బ వాపు, గొంతు వాపు:
తొలకరి వర్షాలు పడిన వెంటనే లేత పశుగ్రాసం ను పశువులు తిన్నప్పుడు జబ్బ వాపు, గొంతు వాపు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి .
ముఖ్యంగా ఈ జబ్బ వాపు అనేది ఆవు జాతి పశువులలో యుక్త వయస్సులో ఉన్న వాటిలో ఎక్కువగా వచ్చే అవకాశం కలదు కాబట్టి జబ్బ వాపు రాకుండా ముందు జాగ్రత్తగా టీకాలు వేయించడం మంచిది. ఈ గొంతు వాపు అనేది ఎక్కువగా గేదె జాతి పశువులలో వచ్చే అవకాశం కలదు కాబట్టి ఈ గొంతు వాపు రాకుండా ముందు జాగ్రత్తగా HS టీకాలు వేయించడం మంచిది. ఈ టీకాలు వేయించడం అనేది వర్షా కాలం ప్రారంభంలోనే చేయాలి అనగా may నెల చివరి వారంలో గానీ,June నెల మొదటి, రెండు వారాలలో గానీ వేయించాలి . ప్రభుత్వం వారు పాడి పశువులలో ఈ వ్యాధులు రాకుండా టీకాలు ఉచితంగా సరఫరా చేస్తున్నారు కాబట్టి పశువులకు ఈ టీకాలు వేయించడం మంచిది.
పొదుగు వాపు:
పాడి పశువులలో వచ్చే మరో అతిముఖ్యమైన సమస్య పొదుగు వాపు. ఈ పొదుగు వాపు అనేది వాతావరణంలో వున్న తేమ, పాకలు ఎప్పటికప్పుడు అరకపోవడం వల్ల అనగా పాకలోని నేలపైన వున్న మురుగు నీరు , పేడలను ఎప్పటికప్పుడు తీసివేయకపోడం వల్ల వచ్చే ఈ అపరిశుభ్రమైన మురుగు నీటి మీద పశువులు పాలు పితికిన వెంటనే పడుకోవడం వలన, పొదుగు లోకి క్రిములు చేరి ఎక్కువగా ఈ వర్షా కాలం లో సోకుతుంది. ఒక్కసారి ఈ పొదుగు వాపు సొకితే పాడి పశువుల్లో పాల దిగుబడి గణనీయంగా తగ్గుతందని రైతులు గమనించి ఈ పాకలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
పాలు తీయక ముందే పాకల్లో వున్న పేడ ను తీసివేసి పరిశుభ్రంగా నీటితో కడిగిన తర్వాత పాలను తీసినట్లయితే , పాలు తీసిన వెంటనే పశువుల కి వచ్చిన నీరసం వలన ఒకేసారి క్రింద పడుకున్నప్పుడు పొదుగు లోకి క్రిములు చేరకుండా ఆపడానికి అవకాశం కలదు, తద్వారా ఈ పొదుగు వాపు ను నివారించవచ్చు. ఈ పొదుగు వాపు రాకుండా పాలు తీయక ముందు అదేవిధంగా పాలు తీసిన తర్వాత డిసిన్ఫెక్ట్స్ కలిపిన నీటితో ఈ పొదుగుని పరిశుభ్రం చేసినట్లైతే పొదుగు వాపు ను నివారించవచ్చు. అలాగే పొడి సున్నం మరియు బ్లీచింగ్ పౌడర్ మిక్స్ చేసి పాకలలో చల్లుకోవాలి.
గాలికుంటు వ్యాధి:
గాలికుంటు వ్యాధి ఎక్కువగా సంకరజాతి పాడి పశువులలో అదేవిధంగా గ్రేడెడ్ ముర్రా గేదెలలో వస్తుంది. దేశవాళి పాడి పశువులకు కూడా ఈ వ్యాధి సోకుతుంది కాకపోతే దేశవాళి పాడి పశువులలో ఈ వ్యాధి కి నిరోధక శక్తి వుండటం వలన వ్యాధి సోకే అవకాశాలు తక్కవగా ఉంటాయి. గాలికుంటు వ్యాధికి ప్రభుత్వం వారు టీకాలు ఉచితంగా సరఫరా చేస్తున్నారు కాబట్టి పశువులకు ఈ టీకాలు వేయించడం మంచిది. గాలికుంటు వ్యాధికి టీకాలు ప్రతి 6 నెలల కు ఒకసారి వేయించాలి.
ఒకవేళ గాలి కుంటు వ్యాధికి టీకాలు వేయించకపోతె ఏం జరుగుతుంది ?
పాడి పశువులకు ఈ వ్యాధి సోకినప్పుడు పాల దిగుబడి గణనీయంగా తగ్గుతుంది, చూడు కట్టకపోవడం , ఒకవేళ చూడు కట్టినా గర్భస్రావం జరుగును. ఈ వ్యాధి సోకినప్పుడు పాడి పశువుల ను మేతకు తీసుకు వెళ్తే ఎండ తీవ్రతకు అవి మేయకుండ నీడ ప్రదేశంలోకి వస్తాయి. అదేవిధంగా దుక్కి పశువులకు ఈ వ్యాధి సోకినప్పుడు అవి పనిచేసే సామర్ధ్యాన్ని కోల్పోతాయి.
Also Read: Tulsi Cultivation: తులసి సాగుతో వ్యాపారం.. రైతులకు మంచి ఆదాయం.!
ఎఫిమెరల్ ఫీవర్స్:
ఎఫిమెరల్ ఫీవర్స్ అంటే 3 రోజుల సిక్నెస్ అని అర్థం. వర్షా కాలంలో వైరస్ వలన పాడి పశువులలో ఈ ఎఫిమెరల్ ఫీవర్స్ వస్తాయి. ఈ ఎఫిమెరల్ ఫీవర్స్ చాలా వేగంగా ఒక పశువు నుండి ఇంకొక పశువుకు సోకును. ఈ వ్యాధి సోకినప్పుడు పాడి పశువులలో మరణాల సంఖ్య ఏమి ఉండదు కానీ జ్వరము 104-105 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. అలాగే నోటి నుండి కొద్ది కొద్దిగా సెలైవా వస్తుంది.
• వర్షాకాలంలో పాకల్లో అపరిశుభ్రమైన వాతావరణ పరిస్థితులు అదేవిధంగా ఈ పాకల చుట్టూ మురుగు నీరు చేరటం లాంటి పరిస్థితులు ఉన్నట్లైతే బాహ్య పరాన్నాజీవుల వలన పశువులు అనేక వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంది కాబట్టి మురుగు నీరు నిల్వ లేకుండా పాకల చుట్టూ పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలి. పశువుల షేడ్ లో డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా ఉండేటట్లు చూసుకున్నట్లు అయితే ఈ పశువుల పేడ, మూత్రం, పశువులను మరియు షేడ్ లను శుభ్రం చేసిన నీళ్ళు షేడ్ లోపల నిల్వ వుండకుండా చూసుకోవచ్చు.
బాహ్య పరాన్నాజీవుల నివారణకు బ్యుటాక్స్ 3-4 ml / 1 లీటర్ నీటికి కలిపి షేడ్ లోపల పిచికారి చేయాలి. నిర్దేశించిన సంఖ్య కంటే ఎక్కువగా పశువులను పాకలో కట్టకుండా ఉండాలి.
• వర్షా కాలంలో గాలిలో తేమ శాతం అధికంగా ఉన్నట్లు అయితే ఊపిరితిత్తుల సంబందమైన వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం కలదు. ముఖ్యంగా దూడలలో ఎక్కువగా వస్తుంది. పాడి పశువుల రైతులు వర్షా కాలంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే అధిక పాల ఉత్పత్తి తో పాటు వర్షాకాలంలో వచ్చే వ్యాధులకు పశువులు గురి కాకుండా చూసుకోవచ్చు .
•ముడి పదార్థాల నిల్వ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా ఎండుగడ్డి అనేది బయట వుంచుతారు. వర్షాకాలంలో నీరు ఆ ఎండుగడ్డిలోకి పోయినప్పుడు , ఎండుగడ్డి ఒకవైపు నుండి కుళ్ళుతూ వస్తది, ఆ కుళ్లిన ఎండుగడ్డి ని పశువులు మేసినప్పుడు తీవ్రమైన అజీర్తి సమస్యలు వచ్చే అవకాశం కలదు కాబట్టి ఎండుగడ్డి ని జాగ్రత్తగా తడిసిపోకండ నిల్వ చేసుకోవాలి.పరిశుభ్రమైన త్రాగనీరు అందించాలి.
Also Read: Fisheries in Telangana: తెలంగాణలో చేపలపెంపకానికి అనువైన జాతులు, వాటి యొక్క ప్రాముఖ్యత