Haryana Animal Husbandry: రాష్ట్రంలో వ్యవసాయం, పశుపోషణ, కోళ్ల వ్యాపారం, మత్స్య పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా రైతులు ఆర్థికంగా బలోపేతం కావచ్చని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్థక శాఖ మంత్రి జేపీ దలాల్‌తో జరిగిన సంభాషణలో ఆయన ఈ విషయం చెప్పారు. భివానీలో జరగనున్న రాష్ట్ర స్థాయి పశువుల సంతను ప్రారంభించేందుకు గవర్నర్ దత్తాత్రేయను ఆహ్వానించేందుకు దలాల్ రాజ్‌భవన్‌కు వెళ్లారు. ఈ భేటీలో భాగంగా దత్తాత్రేయ మాట్లాడుతూ.. వ్యవసాయం, పశుపోషణలో దేశంలోనే హర్యానా అగ్రగామిగా నిలవడం సంతోషకరమని దత్తాత్రేయ అన్నారు. వ్యవసాయం మరియు పశుపోషణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంక్షేమ కార్యక్రమాలను పెంచేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.

Bandaru Dattatreya interacting with Agriculture Minister JP Dalal
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ఫిషరీస్ మరియు పౌల్ట్రీ వ్యాపారం కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని మంత్రి దలాల్ అన్నారు. హర్యానా నుంచి ఇతర రాష్ట్రాలకు రూ.2500 కోట్ల విలువైన చేపలు తరలిస్తున్నట్టు అయన తెలిపారు. అదేవిధంగా పౌల్ట్రీ వ్యాపారంలో హర్యానా కేంద్రంగా అభివృద్ధి చెందిందన్నారు, పశుసంపదకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర పథకాలను మరింత మెరుగ్గా అమలు చేస్తున్నందుకు వ్యవసాయ మంత్రిని అభినందించిన దత్తాత్రేయ .. వ్యవసాయ రంగంలో హైబ్రిడ్ విత్తనాల తయారీ, పశు జాతులను మెరుగుపరచడంలో సంబంధిత విశ్వవిద్యాలయాల సహకారం తీసుకోవాలని సూచించారు. విశ్వవిద్యాలయాలు.. రైతులకు మరియు పశువుల పెంపకందారులకు సాంకేతికతలను గురించి సమాచారాన్ని అందించడం మరియు శిక్షణ ఇవ్వడం చేయాలనీ సంబంధిత విశ్వవిద్యాలయాలను కోరారు.
ఈ సందర్భంగా వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్యశాఖల కార్యకలాపాలను జేపీ దలాల్ గవర్నర్‌కు వివరించారు. రాష్ట్రం దేశంలోనే రెండవ అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా అవతరించిందన్నారు. పశు కిసాన్ క్రెడిట్ కార్డు, ప్రధానమంత్రి కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ చేశామన్నారు.దీంతో పాటు ఒక్కో జంతువుకు రూ.100 బీమా కల్పిస్తున్నారు. దేశంలో ఈ విధంగా పశు బీమాను అందించిన తొలి రాష్ట్రం హర్యానా అని చెప్పారాయన. కాగా దలాల్ భివానీలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పశువుల సంత గురించి సమాచారం అందించారు మరియు ఈ జాతరలో, రాష్ట్రంతో పాటు, ఇతర రాష్ట్రాల నుండి పశువుల యజమానులను కూడా ఆహ్వానిస్తున్నామని, తద్వారా వారు జంతు జాతుల అభివృద్ధి మరియు పశువులకు సంబంధించిన పథకాలు మరియు కార్యక్రమాలను తిలకించవచ్చని అన్నారు.
పశు సంరక్షణ రంగంలో ముఖ్యమైన పథకం పశు కిసాన్ క్రెడిట్ కార్డ్. ఇందులోభాగంగా ఇప్పటి వరకు 60 వేల మందికి పైగా రైతులకు కార్డులు అందించారు. దీనిపై దాదాపు రూ.800 కోట్ల రుణం ఇచ్చారు. దీని కింద రూ.3 లక్షల వరకు రుణాలు కేవలం 4 శాతం వడ్డీకే ఇస్తారు. హర్యానాలో దాదాపు 16 లక్షల కుటుంబాలలో 36 లక్షల పాల జంతువులు ఉన్నాయి.ఇందులో ఎనిమిది లక్షల మంది పశువుల రైతులకు ఈ కార్డు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. అయితే 5 లక్షలకు పైగా పాడి రైతులు దరఖాస్తు చేసుకోగా, అందులో మూడు లక్షలకు పైగా దరఖాస్తులను తిరస్కరించింది ప్రభుత్వం.