పశుపోషణ

GPS Ear Tags for Cattle: ఇంట్లో ఉండి వేలాది పశువులను కాయవచ్చు.!

2
GPS Ear Tags for Cattle
GPS Ear Tags for Cattle

GPS Ear Tags for Cattle: పశువుల కాయడం చాలా కష్టం. పది పశువులు పొలానికి తీసుకెళ్లాలంటే ఒక మనిషి తప్పనిసరిగా వాటి వెంట ఉండాల్సిందే. అయితే అందుబాటులోకి వచ్చిన నూతన సాంకేతికతతో వేలాది పశువులను ఒకరే అది కూడా ఇంటి వద్ద నుంచే మేపవచ్చు. నేటి కాలంలో పశువులు కాయాలంటే మనుషులు కూడా దొరకడం లేదు. పశువులు కాయడం చిన్నతనంగా తయారైంది. పశువులను మేపే వారంటే సమాజంలో గౌరవం లేకపోవడంతో ఈ రంగంలోకి ఎవరూ రావడం లేదు. దీంతో దేశంలో పాల దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. దీనివల్ల పాలలో కల్తీలు పెరిగి ప్రజలు తీవ్ర అనారోగ్యం బారిన పడుతున్నారు. వీటన్నింటికీ ఈ కొత్త విధానం పరిష్కారం చూపుతుంది. పశువులను ఇంటి వద్ద నుంచే ఎలా నియంత్రిస్తారనేగా మీ అనుమానం? అదే ఇప్పుడు చూద్దాం.

ఇలా చేయాలి

ముందుగా పశువులను మేపే పొలాన్ని జియో ట్యాంగింగ్ చేసి జీపీఎస్‌కు అనుసంధానం చేసుకోవాలి. జీపీఎస్‌తో పనిచేసే స్పీకర్లను పశువుల మెడలో వేయడం ద్వారా వాటిని నియంత్రిస్తారు. పశువు ఏదైనా పొలం సరిహద్దు దాటుతుందని జీపీఎస్ ద్వారా హెచ్చరికలు రాగానే స్పీకర్ నుంచి శబ్దాలు వస్తాయి. వైబ్రేషన్స్ పశువులను అలర్ట్ చేస్తాయి. దీంతో అది వెనక్కు మళ్లుతాయంటున్నారు శాస్త్రవేత్తలు. సరిహద్దు దాటే సమయంలో జీపీఎస్
సిస్టమ్ ఇంట్లో ఉన్న వ్యక్తిని అలర్ట్ చేస్తుంది. ఎవరైతే జీపీఎస్ యాప్‌ను ఫోన్లో ఉంచుకుంటారో వారికి పశువుల వివరాలు ఎప్పటికప్పుడు అందుతూనే ఉంటాయి.

Also Read: Amaranthus Leaf Cultivation: తోటకూర.. అన్ని రుచుల కలిపిన ఆకు కూరని ఎలా సాగు చేయాలి?

GPS Ear Tags for Cattle

GPS Ear Tags for Cattle

పశువులు తప్పిపోయినా జీపీఎస్ పట్టిస్తుంది

పశువుల మేతకు వెళ్లి తప్పిపోతూ ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో రైతులు వేసవిలో పశువులను పొలాలకు వదిలేస్తూ ఉంటారు. అలా వెళ్లిన పశువులు దారి తప్పి పోవడం, లేదా దొంగలు వాటిని తరలించడం చేస్తుంటారు. దీంతో రైతులకు భారీగా నష్టం వస్తుంటుంది. అదే జీపీఎస్ అమర్చిన బాక్సులకు పశువుల మెడలో ఉంచితే అవి ఎక్కడున్నాయో యజమాని ఫోన్‌కు సమాచారం అందిస్తున్నారు. దీని ద్వారా తమ పశువులను సులభంగా గుర్తించవచ్చు.

ఇంకా అందుబాటులో లేదు

ప్రస్తుతం ఇలాంటి జీపీఎస్ విధానం మన దేశంలో అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతానికి ప్రయోగ దశలోనే ఉంది. ఈ విధానంలో కొన్ని లోపాలున్నా, వాటిని సరిదిద్దుకుని త్వరలో అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ జీపీఎస్ విధానం అతి తక్కువ ఖర్చుతోనే ప్రతి పశువుకు ఏర్పాటు చేసుకోవచ్చు. భారీగా బంజరు భూములు ఉన్నవారికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆస్ట్రేలియా,అమెరికా లాంటి దేశాల్లో ఇలాంటి విధానాలు విజయవంతంగా అమలు చేస్తున్నారు. ఒకటి రెండు పశువులు అయితే పొలాలకు పెంచిగ్ వేసుకోవడం ఉత్తమ మార్గంగా నిపుణులు చెబుతున్నారు.

Also Read: Finger Millet Cultivation: రాగి పంట సాగుకు సరిపోయే ఆలోచనలు, సలహాలు.!

Leave Your Comments

Finger Millet Cultivation: రాగి పంట సాగుకు సరిపోయే ఆలోచనలు, సలహాలు.!

Previous article

Gulkhaira Farming: 10 వేల పెట్టుబడితో మంచి దిగుబడులను ఇస్తున్న గుల్ఖేరా.!

Next article

You may also like