Fowl Pox Disease: వ్యాధి కోళ్ళలోను మరియు ఇతర పక్షులలో వచ్చు ఒక అంటువ్యాధి. చర్మం పైన బొబ్బలు ఏర్పడుట, గ్రుడ్ల ఉత్పత్తిలో తగ్గుదల మరియు కొన్ని సందర్భములలో డిప్తీరిటిక్ ఫామ్ కలిగి కోళ్ళు చనిపోవుట జరుగుతుంటుంది. ఈ వ్యాధి పాక్స్ విరిడే కుటుంబానికి చెందిన ఎవి పాక్స్ వైరస్ వలన కలుగుతుంటుంది. ఈ వైరస్ కోళ్ళతో పాటు, టర్కీ, పావురాలలో కూడా పెరిగి వాటిలో కూడా ఫౌల్ పాక్స్ వ్యాధిని కల్గిస్థాయి.
వ్యాధి వ్యాప్తి చెందు విధానం :
. వ్యాధి బారిన పడిన పక్షులను నేరుగా తాకుట ద్వారా ఇతర కోళ్ళకు ఈ వ్యాధి కలుగుతుంటుంది.
. వైరస్‌తో కలుషితమైన ఫోమైట్స్ ద్వారా అప్పుడప్పుడు ఇతర కోళ్ళకు వ్యాపిస్తుంటుంది.
. చర్మ గాయాల ద్వారా కూడా ఇది వ్యాపిస్తుంటుంది.
. దోమల ద్వారా ఈ వ్యాధి ఒక కోడి నుండి మరోక కోడికి రవాణా జరుగుతుంటుంది.
. ఈ వ్యాధిలో ఇంక్యుబేషన్ పీరియడ్ 5-10 రోజుల వరకు ఉంటుంది. అన్ని వయస్సుల కోళ్ళల్లోను ఈ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి తీవ్రత ఎండాకాలం మరియు వానకాలంలో ఎక్కువగా ఉంటుంది. ఒకే షెడ్లో ఎక్కువ కోడిపిల్లలను ఉంచడం ద్వారా ఈ వ్యాధి ఇతర కోళ్ళకు సులువుగా వ్యాపిస్తుంటుంది.
. వ్యాధి కారక వైరస్ శరీరంలో ప్రవేశించిన తరువాత, చర్మము, కళ్ళు లేదా శ్వాసకోశ వ్యవస్థలోని ఏపిథీలియం కణాలలో పెరిగి, అక్కడ బొబ్బలను ఏర్పరుచుట ద్వారా వ్యాధి లక్షణాలు కలుగుతుంటాయి.
Also Read: Home Remedies Uses: మన ఇంటి పెరటి వైద్యం – ఆరోగ్య చిట్కాలు.!
లక్షణాలు :
. ఈ వ్యాధి కారక క్రిమి, శరీరంలో ప్రవేశించిన 5-10 రోజుల తరువాత వ్యాధి లక్షణాలు బయటపడుతాయి.
. ఈ వ్యాధిలో మోర్బిడిటీ ఎక్కువగా ఉన్నప్పటికీ, మోర్టలిటీ తక్కువగా ఉంటుంది. చర్మంపైన మరియు నోటి లోపలి భాగములలో, శ్వాసనాళములో బొబ్బలను, లేదా బొబ్బలు అన్ని కలిసిపోయి ఏర్పడిన విజ్ లాంటి మెటీరియల్ను గుర్తించవచ్చు.
. రైతు తెలిపే వ్యాధి చరిత్ర ఆధారంగా, పైన వివరించిన వ్యాధి లక్షణాల ఆధారంగా మరియు వ్యాధి యొక్క చిహ్నముల ఆధారంగా ఈ వ్యాధిని ఊహించవచ్చు.
. ఈ వ్యాధిని ఖచ్చితంగా నిర్ధారించు కొనుటకు వైరస్ న్యూట్రలైజేషన్ టెస్ట్, అగార్ జెల్ ప్రిస్పిటేషన్ టెస్ట్, పాసివ్ హిమాగ్లూటినేషన్ టెస్ట్ వంటివి చేయవలసి ఉంటుంది. ఈ వ్యాధిని పిజియన్ పాక్స్ వ్యాధితో సరిపోల్చుకొనవలసి ఉంటుంది.
చికిత్స :
. ఇది ఒక వైరల్ వ్యాధి కనుక, దీనికి ఖచ్చితమైన చికిత్స లేదు. సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండుటకు నియోడాక్స్ లేదా టెట్రా సైక్లిన్ బ్రాడ్ స్పెక్ట్రమ్ ఆంటిబయోటిక్ పౌడర్ నీళ్లలో కలిపి ఐదు నుంచి ఏడు రోజులు త్రాగించాలి.
. కోళ్లలో వ్యాధి నిరోధక శక్తి పెంచడానికి బి కాంప్లెక్స్ మందులను ఇవ్వాలి.
. చర్మం పైన ఏర్పడిన బొబ్బలను పొవిడిన్ అయోడిన్ ఆంటిసెప్టిక్ ద్రావణంతో శుభ్రం చేయాలి .
. వ్యాధి బారిన పడిన కోళ్ళను మంద నుండి వేరు చేసి, కల్లింగ్ చేయవలసి ఉంటుంది. తరువాత షెడ్ మొత్తాన్ని క్లీన్ చేయాలి.
టీకాలు :
. ఈ వ్యాధికి రెండు రకాల వ్యాక్సిన్లు అందుబాటులో కలవు. ఒకటి పిజియన్ పాక్స్ వ్యాక్సిన్ దీనిని లేయర్ (గ్రుడ్లు పెట్టె కోళ్ళు) కోళ్ళలో ఉపయోగిస్తుంటారు.
. మరోకటి ఫౌల్ పాక్స్ వ్యాక్సిన్ దీనిని బ్రాయిలర్ కోళ్ళలో ఉపయోగిస్తుంటారు. ఫెదర్ ప్లక్ ద్వారా ఈ టీకాలను కోళ్ళలో ఇస్తుంటారు.
Also Read: Treatment of Chicken Lice: కోళ్ళలో పేనుల నివారణ మరియు చికిత్సకు తీసుకోవాల్సిన చర్యలు.!