Rainy Season Fodder Cultivation: పాడికి ఆధారం పచ్చి మేతలని, మేపు కొద్ది చేపు అని రైతులు గ్రహించాలి. వ్యవసాయ అనుబంధ రంగాలైన పాడి పరిశ్రమ, జీవాల పోషణలో కీలక పాత్ర పోషించేవి వాటికి అందించే మేతలు. పచ్చి మేతలను కొదవ లేకుండా మెపినప్పుడే రైతులకు పోషణ వ్యయం తగ్గి పరిశ్రమ గిట్టుబాటు అవుతుంది.పచ్చి మేతలను ఎంత సమృద్దిగా మేపగలిగితె పాడి పరిశ్రమ అంతగా లాభాల బాటలో నడుస్తుంది. పాడి పశువుల మేతలో సమతుల్యత పాటించినప్పుడే పాల దిగుబడి, వెన్న శాతం పెరుగుతుంది.
సాధారణంగా ప్రతి పశువుకు రోజుకి 30 కిలోల వరకు పచ్చి మేత అవసరం ఉంటుంది. కాని లభ్యత లేదనో, పెంచేందుకు స్థలం చాలదనో, పలు కారణాల వలన పచ్చి మేత కొరత ఏర్పడుతుంది. అదె ప్రతి పాడి రైతు తమకున్న కొద్ది పాటి స్థలంలో లేదా పొలంలో కొద్ది పాటి స్థలంలో పచ్చి మేతలను వేసుకోవాలి. ఇలా చేస్తే పాడి పరిశ్రమ లాభసాటిగా ఉంటుంది. గ్రాసాలు మేపే క్రమంలో అసలు ఏలాంటి గ్రాసాలు మేపాలి, తోలకరిలో వేసుకోవడానికి ఏ గ్రాసాలు అనుకూలం, సంవత్సరం పొడవునా పచ్చి మేత లభ్యం అవ్వాలి అంటే ఏ గ్రాసాలు వేసుకోవాలో తెలుసుకుందాం.
ప్రతి రైతు తనకున్నటువంటి భూమిలో ఒక 10% అనగా ఒక ఎకరం భూమి ఉన్న రైతులు 10 సెంట్లు భూమిలో ఈ పశుగ్రాసాలు సాగు చేసుకోవాలి. ఒక ఆవు గాని, ఒక గేదె గాని పెంచే రైతు 25-30 సెంట్లు భూమిలో ఈ పశుగ్రాసాలు సాగు చేసుకోవాలి. రైతులు ఈ పశుగ్రాసాలు సాగుచేసుకుంటే పచ్చి మేతకి గట్ల కోసమో, మరెక్కడో వెతకాల్సిన అవసరం ఉండదు.పశువులున్నటువంటి ప్రతి రైతు ఈ పశుగ్రాసాలు సాగు చేసుకోవాలి.
రోజుకు ఒక పశువుకు ఇవ్వవలసిన మేతలు:
• ఒక్కొక్క పాడి పశువుకు రోజుకి ,30 కిలోల పచ్చి గడ్డి,6 కిలోల ఎండు గడ్డి ,3 కిలోల దాణా ఇవ్వాలి.
• ఈ 30 కిలోల పచ్చి గడ్డిలో 20 కిలోలు ధాన్యపు జాతి గడ్డి, 10 కిలోలు లెగ్యుమ్ జాతి గడ్డి ఇవ్వాలి.
Also Read: Jamun Fruit Health Secrets: కింగ్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అయిన నేరేడు ఆరోగ్య రహస్యాలు.!
ఈ వర్షా కాలానికి అనువైన పశుగ్రాసాలు:
• సారవంతమైన, నీరు పుష్కలంగా ఉండే నేలల్లో హైబ్రీడ్ నేపియర్ గడ్డిని పెంచుకోవచ్చు. ఈ హైబ్రీడ్ నేపియర్ లో ప్రస్తుతం మంచి రకం సూపర్ నేపియర్ అలాగే ఎ. పి. బి. ఎన్ -1 గాని, co-3,4,5 గాని సాగు చేసుకోవచ్చు. సూపర్ బాజ్రా నేపియర్ వేసుకోవడానికి ఒక ఎకరాకు 12000 కాండపు ముక్కలు కావాలి.వీటిని పొలములో బొదేకు ఒక పక్కగా ఏటవాలుగా నాటుకోవాలి.45 డిగ్రీల కోణంతో నాటుకోవాలి. బొదేకు,బొదేకు 60 cm ఉండేలా చూసుకోవాలి. నాటుకున్న 70 రోజుల నుండి కోతకు సిద్ధంగా ఉంటుంది. మొదటి కోత తరువాత ప్రతి 40-45 రోజులకు ఒకసారి కోత తీసుకోవచ్చు. సూపర్ బాజ్రా నేపియర్ సాగుకు తప్పనిసరిగా కొద్ది పాటి నీటి వసతి ఉండాలి.
• మెట్ట ప్రాంతాలైన రైతులు ఈ గిని గడ్డిని మెట్ట భూముల్లో గాని, తోట భూముల్లో గాని గిని గడ్డి రకాలైన గిని మౌన గాని, గిని బ్రౌన గాని, గిని మంబాసా గాని, గిని జూరి గాని సాగు చేసుకోవచ్చు.
•వర్షాలు బాగా పడే ముంపుడు ప్రాంతాలలో పారా గడ్డిని సాగు చేసుకోవచ్చు.
• పశు గ్రాస మొక్కలైన అవిశ గింజల మొక్కలు గాని, సుబాబుల్ మొక్కలు గాని రైతులు వారి పెరటి యందు వేసుకొని వాటి రెమ్మలను పశువులకు ఒక 2 కేజీల వరకు సూర్యరశ్మిలో ఆరబెట్టి ఆ తరువాత 3-4 కేజీల ఎండు మేతతో కలిపి ఇచ్చినట్లైతే చక్కటి మేతను పశువులకు అందించిన వాళ్ళం అవుతాం.
ధాన్యపు జాతి పశుగ్రాసాలు
• కొన్ని సందర్భాల్లో, కొన్ని ప్రాంతాలలో వరి పండించడానికి గాని, ఇతర పంటలు పండించడానికి గాని ఈ ఆరుతడి సరిపోదు. ఈ ఆరుతడి ప్రాంతాల్లో ముఖ్యంగా జొన్న రకాలైన CSH 24- MF తెల్ల జొన్నలు, పచ్చ జొన్నలు, కాకీ జొన్నలు , మొక్కజొన్న రకాలైన ఆఫ్రికన్ టాల్ మైజ్, గంగా సఫెద్-2 అనే రకాన్ని సాగు చేసుకుని పశుగ్రాసాన్ని పొందవచ్చు.
లేగ్యు మ్ జాతి పశుగ్రాసాలు
• ఆరుతడిలో పిల్లి పెసర గాని, అలసంద(విజయ రకం) గాని,కట్టే జనుము గాని అంటే వర్షాలు పడతాయి కాని ఆ వర్షాలు పంటలు పండించడానికి సరిపోని పరిస్థితులలో ఇవి సాగు చేసుకుని పశుగ్రాసాన్ని పొందొచ్చు.
ఇలా చేస్తే పాడి అభివృద్ధి తగ్గకుండా, పాల దిగుబడి తగ్గకుండా రైతుకు ఆదాయాన్ని తెచ్చి పెడుతుంది.