Fodder Cultivation: ప్రస్తుతం పాడి రైతులు అనేక సమస్యల కారణంగా పాడిపశువులకు అవసరమైన, పుష్టివంతమైన పచ్చి మేతను సాగు చేయలేక పోతూ ఉన్నారు. అత్యధికంగా మన పాడి పశువుల సరైన పోషణ అందక వాటి సహజ ఉత్పాదక శక్తి లో సగం మేరకు కూడ పాలను ఇవ్వలేక యజమానులకు ఆశించిన లాభాలను అందించలేకపోతు ఉన్నాయి. తోటలలో పశుగ్రాసాల పచ్చిగ్రాసాలసాగు, హైడ్రోపోనిక్ గ్రాసాలు, అజోల్లా వంటి గ్రాసాల సాగు సైతం ఆశించిన స్థాయిలో క్షేత్ర స్థాయిలో ఆచరణకు నోచుకోలేదు.
అయితే జాతీయ హైవేలు, రాష్ట్ర, జిల్లా స్థాయి రోడ్లు విశాలంగా ఉన్న చోట్ల ఏర్పాటు చేసిన డివైడర్లు వెడల్పుగా అంటే 8 నుండి 15 అడుగుల వరకు, కొన్ని చోట్టల హైవేలకు, సర్విసు రోడ్ల మధ్య కూడా నిర్మించిన డివైడర్లు కూడా 6 నుండి 10 అడుగుల వరకు వందలు, వేలు కిలో మీటర్ల దూరానికి విస్తరించి ఉన్నాయి. ఒక కిలో మీటరు పొడవైన డివైడర్ పైన సేద్య యోగ్యమైన నేల అర ఎకరం నుండి ఒక ఎకరం వరకు ఉండే అవకాశం ఉంది.
ఈ నేలలో పచ్చదనం నిర్వహణ కొరకు ప్రభుత్వం గానీ, స్థానిక సంస్థలు కానీ కోట్లాది రూపాయలను, ఎరువులకు , విత్తనాలకు, కార్మికుల వేతనాలకు , వెచ్చిస్తూ ఎంతో నీటిని కూడా వాడుతూ ఉన్నాయి. ఇదే వనరులు, శ్రమతో ప్రతికిలో మీటరు పొడవు డీవైడరు మీద కనీసం 5-6 మేలుజాతి పాడిగేదెల కడుపు నింపగల శ్రేష్టమైన పశుగ్రాసాలను ఉత్పత్తి చేసి, పాల ఉత్పత్తి ఖర్చులను గణనియంగా తగ్గించి, పాడి రైతులను ప్రోత్సహించవచ్చును.
Also Read: Fodder Benefits: పశుగ్రాసాలు – ప్రయోజనాలు.!
ఇప్పుడు హైవేల మీద గ్రీనరీ నిర్వహణకు పశుగ్రసాం ఉత్పత్తి పట్ల ఆసక్తి కలిగిన వారికి వేలం ద్వారా కవులుకు ఇస్తే, ఈ లాన్స్ నిర్వహణకు వెచ్చిస్తున్న ఖర్చుకు సుమారు రెట్టింపు ఆదాయం ప్రభుత్వలకు అంద వచ్చును. గరిష్ట, కనిష్ఠ , ఎత్తులలో గ్రాసాల పంటలు నిర్వాహంచే విధంగా వేలం నిబంధనలను రూపొందించవచ్చును.
వేల్వెట్ బిన్స్,ల్యూసార్న్, బెర్సీమ్, దీనానాథ్ వంటి గ్రాసాలు పచ్చదనంతో పాటు రంగు రంగుల పూలతో ఆకర్షణియంగా కూడా ఉంటాయి. లెగ్యూమ్ జాతిగ్రాసాల వల్ల నెలసారం కూడా వృధి చెందుతుంది. గుబురుగా పెరిగే మల్బరి, సుబాబుల్ చెట్లను కూడా 10-15 మీటర్ల దూరంలో ఈ డివైడర్ల మీద పెంచవచ్చును.
అయితే హైవే మధ్యలో గ్రాసాల సేద్యం వల్ల నిర్వాహకులు రోడ్లు ప్రమాదాలకు గురికారా అనే అనుమానం, భయం కొందరిలో కలుగవచ్చు. కానీ ప్రస్తుతం ఈ డివైడర్ల నిర్వహణకు చూసే తోటమలులు , కార్మకులకు లేని భయలు వీరికి మాత్రం ఎందుకు ఉంటాయి? రేడియం దుస్తుల ధారణ , ట్రాఫిక్ ఎక్కువ ఉండని సమయాలలో పని వేళకు నిర్ణయించడం , డివైడర్ల మీదకు మేకలు, ఇతర జీవాలు ప్రవేశించాకుండా రియిలింగ్స్ను ఏర్పాటు చేయటం వంటి ముందు జాగ్రత్త చర్యలతో ప్రమాద భయాలను నివృత్తి చేయవచ్చును.
ప్రయోగాత్మకంగా హైదరాబాదు ఔటర్రింగురోడ్డు, ఇన్నర్ రింగురోడ్డు మీది రోడ్ డివైడర్ల మీద అందమైన ఆకులతో , పూలతో ఉండే లెగ్యూమ్ గ్రాసాలను పెంచి, ఆ అనుభవంతో ఈ పథకాన్ని ఇతర ప్రాంతాలకు విస్తరించవచ్చును.
ఈ రింగు రోడ్ల మీద ఉత్పత్తి చేసే పచ్చి మేతలు జన్యూపరంగా అత్యదికంగా పాలనివ్వగలిగిన హైదరాబాద్ పరిసరాలలో వేలాది మూర్రా జాతి గేదలు , వాటి పూర్తి సామర్థ్యం మేరకు రోజుకు 8- నుండి 10 లీటర్ల వరకు పాలను ఇవ్వగలవు. ఇంతేకాక మేత కొరత వల్ల కబేళాల దారిపడ్తూన్న విలువైన పాడి గేదలు వాటి పూర్తి ఉత్పాదక జీవిత కాలం పాల ఉత్పత్తితో లాభదయాకంగా కొనసాగవచ్చు.
వినూత్నమైన హైవేల మీద పచ్చిమేత సేద్య విధానాన్ని ప్రోత్సహిస్తే త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో పాలకొరత చాలా వరకు తిరగలదు . ఇంతేకాక ఈ విధానం దేశవిదేశాల నుండి వచ్చే సందర్సకుల ప్రశంసలను కూడా పొందగలదు.
Also Read: Fodder Crops: పశుగ్రాసాల ఎంపిక లో మెళుకువలు