Fodder Benefits: పాడికి ఆధారం పచ్చిమేత. లాభసాటి పాడి పరిశ్రమకు పశు గ్రాసాలు సాగు చేసి పశువులకు అందిచడం చాలా అవసరం. పశుగ్రాసాల ప్రయోజనాల గురించి పరిశీలిస్తే సాధారణం గా పశు పోషణలో అయ్యే మేపు ఖర్చు 70% తగ్గి పాడి పరిశ్రమ లాభదాయకంగా ఉండాలి అంటే పశు గ్రాసాల సాగు, మేపు తప్పనిసరి. పశుగ్రాసాలను తక్కువ సమయంలో తక్కువ పెట్టుబడితో, తక్కువ శ్రద్ధతో అతి చౌకగా సాగు చేయవచ్చు.
Also Read: Ongole Cattle: పాడికి మరియు పనికి ఉపయోగపడు దేశవాళీ ఆవులు.!
అధిక దిగుబడినిచ్చే పశుగ్రాసాల రకాలు మార్కెట్ లో లభిస్తున్నందున తక్కువ సమయంలోనే అధిక పశుగ్రాస దిగుబడి పొందే వీలు ఉన్నది. పశుగ్రాసాలలో కాల్షియo, భాస్వరం, వంటి ఖనిజ లవణాలు విటమిన్ ఏ, డి, ఇ పుష్కలంగా లభిస్తాయి. అలాగే మాంసకృత్తులు, పిండి పదార్ధాలు, కొవ్వు పదార్ధాలు అధికంగా లభ్యం అవుతాయి. పశుగ్రాసాలు రుచికరంగా ఉండడం వల్ల పశువులు ఇష్టంగా తింటాయి. ఇవి సులభం గా జీర్ణం అవుతాయి. వీటిని పాడి పశువులకు అందిస్తే పాల దిగుబడులు 25%వరకు పెరుగుతాయి.
వ్యాధి నిరోధక శక్తీ పెరుగుతుంది. పునరుత్పత్తి బాగుంటుంది. పశుగ్రాసాలను మేపడం ద్వారా 5-6 లీటర్ల పాల దిగుబడి పొందవచ్చు. సమీకృత దాణా తగ్గించుకోవచ్చు. పశుగ్రాసాలను నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో, నీటి సౌకర్యం ఉన్న ప్రాంతాలలో సాగు చేయవచ్చు. పశుగ్రాసాలను ఒకసారి శ్రద్ధ తీసుకొని నాటితే 4-5 సం.లు వరకు నిరంతరంగా పశుగ్రాసాన్నిచ్చే బహు వార్షికాలున్నాయి. వీటిని అన్ని రకాల భూముల్లో సాగు చేయవచ్చు.
పశుగ్రాసాల సాగును ఆహార ధాన్యాలు, వాణిజ్య పంటలకు అంతరాయం కలుగకుండా చేపట్టవచ్చు.
పశు గ్రాసాల సాగుకు ప్రత్యేకంగా స్థలం కేటాయించలేని వారు, తోటలున్నవారు, కూరగాయల సాగు చేసే వారు, బీడు భూములు ఉన్నవారు కూడా సాగు చేయడానికి అనువైన పశుగ్రాసాలు అందుబాటులో ఉన్నాయి. పశుగ్రాసాలను పెద్ద ఎత్తున సాగు చేసుకొని , సైలేజ్ లేదా ఎండు మేత రూపంలో నిలువ చేసుకొని వాడుకోవడానికి పశు గ్రాసాలు అనుకూలంగా ఉంటాయి.
Also Read: Colibacillosis in Cattle Symptoms: ఆవులలో వచ్చే కోలిబాసిల్లో సిస్ వ్యాధి నివారణ చర్యలు.!