Female Calf Rearing: బాగా పెరిగిన పెయ్య దూడలు పాడి పరిశ్రమ అభివృద్ధికి మూలస్థంబాలు వంటివి. కావున వీటిని సరైన పద్ధతిలో శాస్త్రీయంగా యాజమాన్యం చేసినట్లైతే అవి త్వరగా యుక్త వయస్సు కు వచ్చి కట్టి, మంచి దూడలను పెట్టుట ద్వారా రైతులకు పాల రూపంలో మంచి లాభాలను తీసుకురావడమే కాకుండా, ఈనిన ప్రతి సారి ఒక దూడను కూడా బహుమతిగా రైతుకు ఇస్తుంది. దీనిక గాను పెయ్య దూడలలో ఈ క్రింది యాజమాన్యం పాటించవలసి ఉంటుంది.
మగ దూడల నుండి వేరు చేయుట: పెయ్య దూడలను 6 నెలల వయస్సులో మగ దూడల నుండి వేరు చేయాలి. ఇలా చేయుట వలన అవి తక్కువ వయస్సులో యుక్త వయస్సుకు వచ్చి, కట్టి, ఈని అధిక పాలను ఇవ్వగలుగుతాయి. ఫలితంగా రైతులకు వాటి పోషణా వ్యయం కూడా బాగా తగ్గుతుంది.
Also Read: Fowl Pox in Poultry: కోళ్ళలో ఫౌల్ పాక్స్ వ్యాధి వుందా అయితే ఇలా చెయ్యండి.!
గృహవసతి: పెయ్య దూడలకు తగినంత స్థలంలో బాగా గాలి, వెలుతురు ఉండునట్లు షెడ్లు నిర్మించాలి. పెయ్య దూడలను పర్మినెంట్ గా షెడ్లలోనే పెంచవచ్చు లేదా సెమీ పాక్షిక సాంద్ర పద్ధతిలో పగటి పూట పచ్చిక బయళ్ళలో మేత మేపి, రాత్రి పూట షెడ్లలో ఉం చవచ్చు.
పెయ్య దూడల పోషణ: 100 కిలోల శరీర బరువు గల పెయ్య దూడలకు 8-15 కిలోల దాణా, 200 గ్రాముల ప్రోటీన్లు, 9 గ్రాముల కాల్షియం అవసరముంటుంది. పేయ్య దూడల వయస్సును బట్టి పచ్చి గడ్డి మరియు ఎండు గడ్డి మరియు సమీకృత దాణాను ఇవ్వాలి. పెయ్య దూడలకు మంచి నాణ్యత కలిగిన లెగ్యూమ్ జాతి రకపు పచ్చి గడ్డి మేపినట్లైతే వాటి శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, విటమిన్లు మరియు ఖనిజలవణాలు లభిస్తాయి. పెయ్య దూడల దాణాలో 15 శాతం డి.సి.పి, 60-70 శాతం టి.డి.ఎన్ ఉండాలి. పెయ్య దూడలకు పెరుగుదల మనం వాటికి ఇచ్చే గడ్డి, దాణా క్వాంటిటీ మీద ఆధారపడి ఉంటుంది.
కృత్రిమ గర్భాధారణ ( ప్రత్యుత్పత్తి):- పెయ్య దూడలు యుక్త వయస్సుకు రావడం అనేది పెయ్య దూడలు పోషణ, జాతి, రకం, వ్యక్తిగత సామర్ధ్యం మీద ఆధారపడి ఉంటుంది. సహజంగా 250 కిలోల శరీర బరువు ఉన్నప్పుడు పెయ్య దూడలు మొదటి సారి ఎదకు వస్తాయి.
Also Read: Sheep Pox Disease: గొర్రెలలో అమ్మోరు వ్యాధి.!