Emu Chicks Management: ఈ పిల్లలకు 100 చదరపు అడుగుల స్థలం వుండేటట్లు చూడాలి. వీటిని నేల మీద వుంచవచ్చు. నేల పొడిగా నీరు నిల్వ వుండకుండా వుండేలా చూడాలి. ఎదిగే పిల్లల్లో కాళ్ళకు సంబంధించిన లోపాలు ఎప్పటికప్పుడు గుర్తించాలి.ఆ పిల్ల పక్షులను పెద్ద పక్షులతో కలవరాదు. వయస్సును బట్టి గుంపులుగా చేయాలి. ఈ పక్షులు దొరికినవి అన్నింటినీ తినుటకు ప్రయత్నిస్తుంది. సూదులు, ప్లాస్టిక్ కవర్లు, రబ్బరులు మొదలగు ముక్కలు అందుబాటులో లేకుండా చేయాలి.
ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కోళ్ళను పట్టుకోవడం గానీ, టీకాలు వేయడం గానీ చేయరాదు. వీటికి ఎల్లవేళలా నీరు ఉండేటట్లు చూడాలి.వీటికి 42 వారాల వరకు నాణ్యత గల తాజా దాణా ఇవ్వాలి.
Also Read: Emu Bird Farming: ఈము పక్షుల పెంపకంలో మెళుకువలు.!
లేత ఆకులు, స్టైలో గడ్డి, క్యారెట్, ఇతర కాయగూరలు లేదా పండ్లు కూడా ఇచ్చి కొంత వరకు దాణాను ఆదా చేయవచ్చు. సంవత్సరం వయస్సు నందు 30-35 కేజీల బరువు కాగలవు.. ఈ కోళ్ళు 18-24 నెలల వయస్సుకు లైంగిక అభివృద్ధి చెంది గ్రుడ్లు పెట్టడం మొదలు పెడతాయి.
ప్రతి యొక్క కొడి 20-25 గ్రుడ్లు శీతాకాలంలో పెడతాయి.ఒక నెల ముందు నుండి ఆడ, మగ జంటలుగా ఏర్పడుతాయి.ఆ సమయంలో వీటికి సుమారు 2,500 చ. అడుగుల స్థలం ఒక్కొక్క జంటకు అవసరం ఉంటుంది.పుష్టికరమైన ఆహారం ఇస్తే ఇవి ఆరోగ్యంగా ఉండి ఎక్కువ గ్రుడ్లు పెట్టుటకు అవకాశం ఉండును. వీటి ఆహరంలో షెల్ గ్రిట్ కలపాలి.ఈము పక్షి రోజుకు 1 కే.జి. దాణా తినగలదు.గ్రుడ్ల ఉత్పత్తి అక్టోబర్ – ఫిబ్రవరి వరకు ఉంటుంది.
గ్రుడ్లను వారం లోపలే ఇంక్యుబేషన్లో వుంచాలి.హ్యచరీని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి.ఇంక్యూబేటర్ ఉష్ణోగ్రత 96-97 డి.సె. తేమ 42 శాతం వద్ద గ్రుడ్లను ప్రతి రోజు కనీసము 10 సార్లు రన్నీంగ్త్రిప్పడం చేస్తూ వుండాలి.గ్రుడ్లు 52 రోజులకు పిల్లలు అవుతాయి.సాధారణంగా 70 శాతం గ్రుడ్లు పొదిగి పిల్లలు అవుతాయి.
దాణా: ఈము పక్షుల దాణాలో జీర్ణం కాగల మాంసకృత్తులు, అమైనో ఆమ్లాలు (లైసిన్, మిథియోనైన్) పిండి పదార్థాలు వుండాలి.లవణ మిశ్రమము, విటమిన్లు తగిన పాళ్ళలో దాణాలో కలపాలి.దాణా దినుసుల్లో తేమ శాతం 12 కంటే ఎక్కువ వుండకుండా తాజాగా తయారు చేసుకోవాలి.ఈ పక్షులు గుళికల రూపంలో గల దాణాను ఇష్టపడతాయి.
Also Read: Catching Equipments for Hens: కోళ్ళను పట్టుకోనే పరికరాలు.!