Emu Bird Farming: ఈము రాత్రిట్ వర్గానికి చెందిన ఆస్ట్రేలియా పక్షి. ఆస్ట్రిచ్, రియా, కెసోవరి మరియు కివి మొదలగునవి కూడా టైట్ గ్రూపుకు చెందిన ఇతర పక్షులు. ఇవి ఎగరలేని పక్షులు. వీటిలో ఈము, ఆస్ట్రిచ్ పక్షులు పెంపకానికి అనువైనవి. వీటి నుండి వచ్చే మాంసం, నూనె, చర్మం చాలా విలువైనవి. అమెరికా, ఆస్ట్రేలియా, చైనా దేశాలలో ఈ పక్షులు పెంపకం గత 20 సంవత్సరాలుగా చేపడుతున్నారు.వీటిని పరిమితమైన స్థలంలో గాని లేదా మైదాన ప్రాంతంలో గానీ, రేంజ్ పద్ధతిలో గాని పెంచవచ్చును. వీటి జీవిత కాలం 25-30 సంవత్సరాలు.
Also Read: Bird Flu Symptoms: బర్డ్ ఫ్లూ సోకిన పక్షులలో కనిపించే లక్షణాలు
లక్షణాలు:
- ఇవి సుమారు 6 అడుగుల ఎత్తు 45 నుండి 60 కేజీల బరువు కలిగి ఉంటాయి.
ఇది ఏడాదికి కనీసం 20 గ్రుడ్లు చొప్పున 20-25 సంవత్సరాల వరకు పెట్టగలవు. - పొడవాటి మెడ, శరీర భాగం పై దట్టంగా ఈకలు కలిగి వుంటాయి.
ఈకలు, ముక్కు రంధ్రాలు వాతవరణ మార్పులకు తొడ్పడే విధంగా వుంటాయి. - పొడవాటి కాళ్ళు, మూడు వ్రేళ్ళు. వాటి మొక్క గోళ్ళతో ఈ పక్షులు వేగంగా పరిగెత్తగలవు.
- లింగ బేధం (అవయవాలను చూసి) 6 నెలల వయస్సులో గుర్తించవచ్చు.
సాధారణంగా ఇవి ఆహారంగా ఆకులు, కీటకాలు, దుంపలు, తేత గడ్డి, పండ్లు, ఫలాలను తింటాయి.
యాజమాన్యం:
-
- ఈ పక్షులను గుంపులలోను జతగా కూడా పెంచవచ్చు.
- ఒక ఎకరానికి 8 నుండి 10 పక్షుల గుంపులోను 200 చదరపు అడుగులు ఒక్కొక్క జతకు ఉంటే సరిపోతుంది.
- పొలం చుట్టూ 5 నుండి 6 అడుగుల ఎత్తు కంచె వేయాలి.
- చిన్నపాటి షెడ్లు వుంటే సరిపోతుంది లేదా చెట్ల నీడలో పెంచవచ్చు.
- వీటికి దాణా నీటి తొట్టెలు అందుబాటులో వుంచాలి. ఈ పక్షుల జీర్ణవ్యవస్థలో మిగతా కోళ్ళతో పోలిస్తే క్రాప్ వుండదు. 18 శాతం దాణా, పీచును జీర్ణం చేసుకోగలవు.
- మగ పక్షులు గ్రంటింగ్ శబ్దం. ఆడ పక్షులు డ్రమింగ్ శబ్దాలు చేస్తాయి.
వ్యాధి నివారణ చర్యలు:
- కొక్కెర వ్యాధికి సంబంధించిన టీకాను మొదటి వారంలో (లసోటా) కంటిలో ఒక చుక్క వేసి తిరిగి నాల్గవ వారం మరొకసారి లసోటా టీకాను ఇవ్వాలి.
- 8వ వారం, R2B టీకా ఇవ్వాలి.
- 20వ వారం 2B మరొకసారి దశల వారిగా ఇవ్వటం మంచిది.
- క్లాస్ట్రీడియం వ్యాధులు వచ్చినప్పుడు ఆంటిబయోటిక్స్ మందులు ఇవ్వాలి.
- చిన్న పిల్లలలో కాళ్ళ లోపాలు ఎక్కువ (ప్లై లేగ్). దానిని నివారించుటకు దాణాతో పాటు కాల్షియం అదనంగా ఇవ్వవలసి ఉంటుంది.
Also Read: Bird Flu: బర్డ్ ఫ్లూ నివారణ చర్యలు
Leave Your Comments