పశుపోషణ

Diseases in Calfs: దూడలలో కలుగు వివిధ వ్యాధులు మరియు నివారణ చర్యలు.!

1
Calfs
Calfs

Diseases in Calfs: న్యూమోనియా వ్యాధి- దూడలకు చలి, ఈదరు గాలులు, పాకలు పూర్తిగా మూసి ఉంచడం, గాలి, వెలుతురు సరిగ్గా లేకపోవడం, జున్ను పాలు త్రాగించకపోవడం వంటి కారణాలు న్యూమోనియా వ్యాధి కలుగుటకు దోహదపడుతాయి. కాబట్టి దూడలకు చలి, ఈదురు గాలులు తగలకుండా జాగ్రత్త తీసుకోవాలి. రాత్రి పూట గృహవసతి కల్పించాలి. న్యూమోనియా కలిగిన దూడలకు జ్వరం వస్తుంటుంది. శ్వాస పీల్చుట కష్టమవుతుంది. వ్యాధి ముదిరితే దూడలు చనిపోతాయి. ఈ లక్షణాలు కన్పించిన వెంటనే సమీపంలోని పశు వైద్యాధికారున్ని సంప్రదించవలెను.

కాఫ్ స్కోర్స్ ( దూడలలో నీళ్ళ విరోచనాలు):- ఈ వ్యాధికి గురి అయిన దూడలు 90 శాతం వరకు మరణిస్తుంటాయి.

కారణాలు:- బలహీనమైన దూడలు పుట్టడం, సరియైన మేపు ఇవ్వకపోవడం వలన, అకస్మాత్తుగా కలిగే వాతావరణ మార్పుల వలన కలుగుతుంది. దూడల పాకలు అపరిశుభ్రంగా ఉండడం, జున్ను పాలలో విటమిన్లు తక్కువగా ఉండడం వలన మరియు జున్ను పాలను అధిక మొత్తంలో త్రాగించుట వలన వేసవి కాలం, చలి కాలంలో జరిగే ప్రభావాల వలన ఈ వ్యాధి ఎక్కువగా కలుగుతుంటుంది.

నివారణ:- సరియైన మేపు, సమతుల్యమైన ఆహారము సక్రమముగా ఇవ్వాలి. దూడ పుట్టిన గంటలోపు జున్ను పాలు త్రాగించాలి. దూడలకు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి. దూడలను ఎండ నుండి వేడి నుండి, చలి తీవ్రత నుండి కాపాడడానికి పాకలలో తగిన ఏర్పాట్లు చేయాలి. పాకలలో తగిన గాలి, వెలుతురు ధారాళంగా వచ్చునట్లు చెయ్యాలి. దూడలకు అందుబాటులో పరిశుభ్రమైన నీరు ఎల్లపుడు వుండే విధంగా చేయాలి. వ్యాధి కలిగిన దూడలను వేరు చేసి చికిత్స చేసి, వాటికి సులభంగా జీర్ణం అయ్యే ఆహార పదార్థాలను, గ్లూకోజ్, ఏలక్ట్రోరల్ పౌడర్స్ మరియు ఉప్పు వంటివి కలిపి ఇవ్వాలి.

బొడ్డువాపు వ్యాధి దూడలు పుట్టినప్పుడు సరియైన పద్ధతిలో బొడ్డును కత్తిరించి టించర్ అయోడిన్ యనట్లైతే సూక్ష్మక్రిములు ప్రవేశించి బొడ్డు వాపును కలిగిస్తుంటాయి. ఈ వ్యాధి వచ్చినట్లైతే అశ్రద్ధ చేయకుండా వెంటనే డాక్టర్ను సంప్రదించి తగిన చర్యలు చేయాలి.

Also Read: Blue Tongue Disease in Sheep: గొర్రెలలో నీలి నాలుక వ్యాధికి ఇలా చికిత్స చెయ్యండి.!

Diseases in Calfs

Diseases in Calfs

దూడలలో మలబద్దకం:- ఈ వ్యాధి దూడలలో సర్వ సాధారణంగా కనిపిస్తుంటుంది. చలికాలంలో దూడలలో ఎక్కువగా ఈ ఇబ్బందులను గుర్తిస్తుంటాము.

నివారణ దూడకు జున్ను పాలు తగినంత త్రాగిస్తే ఈ వ్యాధి కలిగే అవకాశాలు తక్కువ. దూడ త్రాగే పాలలో కోడి గ్రుడ్డు సొన, ఇంగువ, బెల్లం కలిపి రెండు రోజుల త్రాగించినట్లైతే మలబద్దకం తగ్గిపోతుంది. దూడలు ఎదిగే దశలో మలబద్దకం కలిగితే వాటికి ఉప్పునీరు త్రాగించాలి లేదా ఎనిమా ఇప్పించాలి.

దూడలలో నట్టల బెడద (డీవార్మింగ్):- దూడలకు నట్టల బెడద సర్వ సాధారణo. ఇది గేదె దూడలలో మరింత ఎక్కువగా ఉంటుంది. వీటి మూలంగా క్రింది ఇబ్బందులు కలుగుతుంటాయి.

దూడలు సరిగ్గా పెరగవు, తరుచుగా విరేచనాలు మరియు మల బద్ధకం కలుగుతుంటుంది. దూడలలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. దూడలు బలహీనంగా ఉంటాయి. చర్మం అంతా మొద్దు బారి, వెంట్రుకలు ఊడిపోతుంటాయి. రక్తహీనత ఉంటుంది.

నివారణ:- దూడలలో నట్టల నివారణ ఔషధములను మొట్ట మొదటిసారిగా 10-15 రోజుల్లోనూ, తర్వాత నెలకు ఒకసారి వరుసగా రెండు నెలలు చెయ్యాలి. తర్వాత ప్రతి 6 నెలలకు ఒక సారి నట్టల నివారణ మందులను ఇవ్వాలి. దూడలలో సహజంగా డి వార్మింగ్ చేయుటకు పైవరాజిన్ ఔషధమును కిలో శరీర బరువుకు 150-200 మి.గ్రా చొప్పున పైన సూచించిన దినములలో ఇవ్వవలసి ఉంటుంది. దూడలలో పై సాధారణ వ్యాధులే కాకుండా గొంతు వాపు, జబ్బవాపు, దొమ్మ రోగం, గాలి కుంటు మరియు రక్త పారుడు వంటి అంటు వ్యాధులు ఎక్కువ.

ఈ వ్యాధులతో పాటు బాహ్య పరాన్నజీవులైన గోమార్లు, పిడుదులు, టొములు ఇబ్బందులు కుడా ఉంటాయి. ఈ వ్యాధులన్నింటికి సకాలంలో టీకాలు వేయించి నివారించుకుంటూ ఉండాలి. బాహ్య పరాన్న జీవులు ఇబ్బందులకు బ్యూటాక్స్ లేదా టిక్ కిల్ లేదా సార్ అని వంటి ఔషదాలను ఉపయోగించ వలసి ఉంటుంది.

Also Read: TS Agri Minister Niranjan Reddy: కొల్లిపరలోని అరటిసాగును పరిశీలించిన తెలంగాణ వ్యవసాయ మంత్రి.!

Leave Your Comments

TS Agri Minister Niranjan Reddy: కొల్లిపరలోని అరటిసాగును పరిశీలించిన తెలంగాణ వ్యవసాయ మంత్రి.!

Previous article

Organic Matter Uses: సేంద్రియ పదార్ధంతో ఎన్నో ఉపయోగాలు.!

Next article

You may also like