పశుపోషణమన వ్యవసాయం

Identification of Animals: ఆవులను, గేదెలను గుర్తించు వివిధ పద్దతులు.!

1
Identification of Animals
Identification of Animals

Identification of Animals: మానవజాతి మనుగడ కొరకు, మనిషి అవసరాల కొరకు, ఆర్థిక లబ్ధి కొరకు పెంచే జంతువులను లైవ్ స్టాక్ అనిమల్స్ అని అంటారు. ఈ రకపు పశువులు వాటి ఉత్పత్తుల ద్వారా మనుషులకు కావల్సిన పోషక పదార్థాలను అందించుటతో పాటు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తాయి. ఉదా:- పాడి పశువులు పాల ఉత్పత్తులను, మాంసాన్నిచ్చు పశువులు మాంసాన్ని, కోళ్లు మాంసం మరియు గ్రుడ్లును మనుషులకు ఆహారంగా ఇస్తున్నాయి.

Identification of Animals

Identification of Animals

Also Read: Bacillary Haemoglobinurea in Cows: పశువులలో వచ్చే భాసిల్లరీ హిమోగ్లోబిన్యూరియా వ్యాధి లక్షణాలు.!

మందలో వున్న పశువులకు ఒక్కొక్క నెంబర్ ఇచ్చుట ద్వారా మందలో ఎన్ని పశువులు వున్నవో, ఆ పశువులకు ఏ నంబర్ గలదో తెలుసుకొనుట ద్వారా, దాన్ని బట్టి పశువు యొక్క బరువు, ఆరోగ్య పరిస్థితులు అనగా ఎప్పుడు టీకాలు వేసినది, నట్టల నివారణ మందులు ఇచ్చినది, ఎద సూది వేయించినది, కట్టినది, ఈనినది, అమ్మినది, చనిపోయినది మొదలగు వివరములు తెలుసుకోగలము.

పాడి పశువులను గుర్తించు వివిధ పద్ధతులు

1. హాట్ ఐరన్ బ్రాండింగ్ పద్ధతి (Hot Iron Branding Method): ఇందులో ఇనుప కడ్డీ చివర నెంబర్ గాని, అక్షరము గాని వుండును. ఈ చివరి భాగాన్ని బాగా ఎర్రగా కాల్చి పశు శరీరం పై అనగా ఎడమ తొడపై 3 సెకనులు వుంచినచో, ప్రదేశం పైనా ఆ నెంబర్ గాని లెటర్ గాని కాలుట వల్ల ముద్రపడును.

2. కోల్డ్ లేదా ఫ్రీజ్ బ్రాండింగ్ పద్ధతి (Cold (or) Freeze Branding Method): ఈ పద్ధతిలో కూడా అక్షరము లేదా నెంబర్ వున్న కడ్డీని 196 డిగ్రీలు వున్న ద్రవ రూప నత్రజనిలో వుంచి 30-60 – సెకనులు పశువు యొక్క ఎడమ తొడపై ( left Quarter) వుంచినప్పుడు మచ్చ ఏర్పడును.

3. రసాయనిక పద్ధతి (Chemical Method): ఇండియన్ ఇంక్ లేదా ఆసిడ్తో అక్షరాన్ని గాని నెంబర్ గాని వుంచి శరీరము పై గట్టిగా ఒత్తవలయును. అప్పుడు ఆ ఇంక్ ముద్ర గల నెంబర్ లేక అక్షరం శరీరం పై కొన్ని రోజుల వరకు వుండును. ఇది శాశ్వతంగా శరీరం పై చాలా రోజులు వుండదు. తాత్కాలికంగా వుంటుంది, కావున పశువులను రవాణా చేయునప్పుడు తాత్కాలిక గుర్తింపు కై ఉపయోగించవచ్చు.

4. ఇయర్ టాగింగ్ (Ear tagging): గుర్తింపు నంబర్ గల ఇయర్ టాగ్ ను, ఇయర్ టాగింగ్ (ear tagging) పట్టుకారుతో ఎడమ చెవికి, నంబర్ బయటికి కనబడునట్లు ఒత్తి వేయవలెను. ఈ పద్ధతిని పాడి పశువులలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ పద్ధతిని పాడి పశువులకు ఇన్సూరెన్స్ను చేయుటకు వాడుదురు. ఇవి ఇత్తడి లేక అల్యూమినియంతో తయారు చేయబడి వుండును.

5. ఇయర్ నారింగ్ (Ear Notching): ఇందులో చెవుల అంచుల వెంబడి అక్కడక్కడ తల క్రిందులుగా వున్న “V” ఆకారంలో కత్తిరించుదురు. కత్తిరించిన సంఖ్యను, స్థలాన్ని బట్టి నెంబర్లు గుర్తించవచ్చును. మొదట ఎడమ చెవి అంచులు కత్తిరించెదరు. దీనిని పందులలో ఎక్కువగా వాడుదురు.

6. టటూయింగ్ (Tattoing): ఇందులో టటూయింగ్ ఇంక్ను చెవి లోపలి వైపుకు పూసి టటూయింగ్ పరికరాల (tattoing Forceps) లో కావాల్సిన నంబర్ పెట్టి ఎడమ చెవి పై ఒత్తిన యెడల ఇంక్ చర్మంలోనికి దూరి పచ్చ వలె శాశ్వతంగా వుండును.

Also Read: Cow Dung Business: ఆవు పేడతో నెలకు లక్ష ఆదాయం

Leave Your Comments

Nutrient Management in Tobacco: పొగాకు పంటలో ఎరువుల యాజమాన్యం.!

Previous article

Poultry Feeding: కోళ్ళ మేతలోని పోషక పదార్థాల ఉపయోగాలు.!

Next article

You may also like