Diarrhea in Chickens: ఈ వ్యాధినే బ్యాసిల్లరీ ఫైట్ డైయేరియా అని కూడా అంటారు. ఈ వ్యాధి చిన్న కోడి పిల్లలలో ప్రాణాంతకంగా ఉండి, పెద్ద వాటిలో దీర్ఘకాలిక వ్యాధిని కలిగిస్తుంటుంది. పెద్దకోళ్ళు ఈ వ్యాధి కారకానికి వాహకంగా ఉండి, చాలా రోజుల వరకు వ్యాధిని ఫారములలో వాటి గ్రుడ్ల ద్వారా వ్యాప్తి చేస్తుంటాయి. ఈ వ్యాధిని మన దేశంలోని అన్ని రాష్ట్రాలలో గుర్తించుట జరిగిoది. ఈ వ్యాధి ముఖ్యంగా తూర్పు మరియు దక్షిణ ప్రాంతపు రాష్ట్రాలలో పెంచుతున్న కోళ్ళకు ఎక్కువగా సోకుతున్నట్టు ఆధారాలు కలవు. ఈ వ్యాధిలో కోళ్ళు తెల్లగా పారుకుంటూ ఉం టాయి. అందువలననే ఈ వ్యాధిని బ్యాసిల్లరీ వైట్ డయేరియా అంటారు.
ఈ వ్యాధి సాల్మోనెల్లా పుల్లోరం అనే Gm-ve బ్యాక్టీరియా ద్వారా కలుగుతుంది. ఇది ఎంటిరో బ్యాక్టీరియా కుటుంబానికి చెందినది. ఇవి రాడ్ ఆకారంలో ఉండి, 0.3-0.5 X1-2.8 um పరిమాణంలో ఉంటాయి. ఇవి స్పోర్స్న ఉత్పత్తి చేయలేవు. గాలి సహిత స్థితిలో పెరుగు తుంది. ఇవి వేడికి మరియు అంటిసెప్టిక్ రసాయనిక పదార్థాలను తట్టుకుంటాయి. ఇవి అనుకూల వాతావరణ పరిస్థితులలో సుమారు 2 సంవత్సరముల వరకు జీవిస్తాయి. ఇవి థర్మోస్టెబుల్ టాక్సిన్స్ను ఉత్పత్తి చేస్తాయి. ఫలితంగా కోళ్ళలో వ్యాధి కలుగుతుంటుంది.
వ్యాధి బారిన పడే కోళ్ళు:- కోడి పిల్లల్లో ఈ వ్యాధి ప్రభావం ఎక్కువ ఉంటుంది. కొన్ని సార్లు టర్కీలకు, బాతులకు కూడా ఈ వ్యాధి కలుగుతుంటుంది. గిసెఫాల్, కౌజులు, పిచ్చుకలు, యురోపియన్ బుల్ పిన్చెస్, చిలుకలు మొదలగు పక్షులకు కూడా ఈ వ్యాధి ఎక్కువగా సోకుతుంటుంది. ఇంటి వద్ద పెంచుకునే కోళ్ళు మరియు అడవి పక్షుల నుండి ఈ వ్యాధి, ఫారమ్ కోళ్ళకు వ్యాపిస్తుంటుంది.అడవి పక్షలకు మరియు పాలు ఇచ్చే జంతువులలో కూడా కొన్ని సార్లు ఈ వ్యాధి సోకుతుంటుంది. వ్యాధి వచ్చు వాటిలో కుందేళ్ళు, గిని పందులు, చించిట్లిస్, పందులు నక్కలు, కుక్కలు మరియు అడవి ఎలుకలు ఉంటాయి. 11. మనుషుల్లో కూడా ఈ వ్యాధి వ్యాపిస్తుంటుంది అందుకే ఇది ఒక జునోటిక్ వ్యాధి.
Also Read: Mediterranean Chickens: అధిక మాంసం ఇచ్చే మెడిటరేనియన్ కోళ్ళు.!
వ్యాధి వ్యాప్తి:- ఈ వ్యాధి రెండు పద్ధతులు ద్వారా ఆరోగ్యంగా ఉన్న కోళ్ళకు వ్యాపిస్తుంటుంది.
వర్టికల్ పద్ధతి:- ఈ పద్ధతిలో క్యారియర్ కోడి గ్రుడ్ల ద్వారా వాటి పిల్లలకు వ్యాపిస్తుంది. హారిజాంటల్ పద్ధతి కలుషితమయిన పాత్రలు, దాణా మరియు నీటి ద్వారా ఆరోగ్యంగా ఉన్న కోళ్ళకు వ్యాపించడాన్ని హారిజాంటల్ పద్ధతి అంటారు. వ్యాధి వచ్చిన పక్షుల ద్వారా, చనిపోయిన పిల్లల ద్వారా, కలుషితమయిన గ్రుడ్ల ద్వారా కూడా ఇది కలుగుతుంటుంది. కెన బాలిజమ్ ద్వారా, గ్రుడ్లు తినడం ద్వారా, పర్యాటకుల ద్వారా, ఈగల ద్వారా కూడా ఈ వ్యాధి వ్యాపిస్తుంటుంది. ఈ వ్యాధి సంబంధిత లక్షణాలు చూపించుటకు కోడి పిల్లల్లో 2 నుండి 3 వారాలు పట్టుతుంది. 3 వారాల పై బడిన కోళ్ళలో ఈ వ్యాధి కారకం సహజంగా ఉన్నప్పటికీ, వాటిలో ఎటువంటి లక్షణాలు కనబడవు కాని, అవి వ్యాధి కారక క్రిములను చాలా రోజుల వరకు వాటి మల, మూత్రముల ద్వారా బయటకు విసర్జిస్తూ ఉంటాయి. ఫలితంగా ఈ వ్యాధి ఫారమ్ వ్యాపించుటకు ఇవి తోడ్పడుతుంటాయి.
Also Read: Backyard Poultry Farming: పెరటికోళ్ల పెంపకం.!