Dairy Works: చిన్న చిన్న గ్రామలలోని పాల సేకరణ కేంద్రం వారు పాలను సేకరించి, రోడ్డు మార్గం ద్వారా పాలను దగ్గరలోని పాలకేంద్రమoకు ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం పంపించుట జరుగుతుంటుంది.
పాలను అన్లోడ్ చేయుట:- పాల కేంద్రమునకు వచ్చిన పాలను గ్రేడింగ్ చేసి, దించుకొని, వాటి యొక్క పరిమాణoను కొలచుకోవాలి లేదా బరువు తూచి, పాల కేంద్రంలోని పోయాలి. పాల కేంద్రంలో పాల గ్రేడింగ్ అత్యంత ప్రాముఖ్యమైన ప్రక్రియ. ఎందుకనగా పాల నుండి తయారయ్యే అన్ని రకముల ఫైనల్ ప్రాడక్ట్లు మనం ముందు సేకరించే పచ్చి పాల మీద ఆధారపడి ఉంటుంది మరియు పాల ధరను లెక్కించుట కూడా పాల గ్రేడింగ్ మీదనే ఆధారపడి ఉంటుంది. పాలను గ్రేడింగ్ చేయుటకు ప్లాట్ ఫామ్ పరీక్షల అయిన వాసన, రుచి, ఆమ్లత్వం మరియు సెడిమెంట్ వంటి లక్షణాలను పరీక్షించవలసి ఉంటుంది.
ప్లాట్ ఫారమ్ పరీక్షలు:- వాసన, రుచి, ఉష్ణోగ్రత, సెడిమెంట్, ఆమ్లత్వం, లాక్టోమీటర్ రీడింగ్ వంటి వాటిని పరీక్షించ వలసి ఉంటుంది.
(అ) పాల యొక్క వాసనను తెలుసుకొనుట – పాల కేంద్రానికి వచ్చిన పాలు ఎటువంటి చెడు వాసనను కలిగి ఉండకూడదు. పాల యొక్క వాసనను తెలుసుకొనుటకు అనుభవంతుడైన వ్యక్తి, ప్రతి పాల క్యాన్ యొక్క మూతను తెరచి, దాని వాసనను చూడాలి. క్యాను బాగా కదిలించి కూడా వాససను గమనించాలి. ఎటువంటి చెడు వాసన ఉన్న, అటువంటి పాలను స్వీకరించకూడదు.
(ఆ) పాల యొక్క స్థితి – పాల క్యాన్ మూతను తీసి, వాసనను గమనించిన తరువాత పాల యొక్క రంగు, పాలలో ఏవైన తేలియాడు పదార్ధములు ఉన్నాయేమో పరీక్షించాలి. రంగు మారిన పాలు, పాలలో ఇతర తేలియడే పదార్థములు వంటివి ఉంటే, అటువంటి పాలను సేకరించకూడదు.
(ఇ) పాల యొక్క ఉష్ణోగ్రత – పాల యొక్క ఉష్ణోగ్రత 5 డిగ్రీలు లేదా అంతకంటే తక్కువగా ఉండాలి లేని యెడల ఎటువంటి పాలను స్వీకరించరాదు. దీని కొరకు ప్రతి క్యాన్ తెరచి, వాటి యొక్క ఉష్ణోగ్రతను నమోదు చెయ్యాలి. \
(ఈ) పాల యొక్క సెడిమెంట్ గుణంను గుర్తించుట – పాలలో ఏవైన ఇతర పదార్థములు ఉంటే సెడిమెంట్ పరీక్ష ద్వారా తెలుసుకొనవచ్చు. దీనిని ప్రతి రోజు చేయవలసిన అవసరం లేదు. కాని అనుమానం ఉంటే పాల యొక్క సెడిమెంట్ను తెలుసుకొనుట ద్వారా ఆ పాలు క్లీన్ ఉన్నాయా లేదా అన్నది చెప్పవచ్చు.
(ఉ) పాల యొక్క ఆమ్లత్వం తెలుసుకొనుట – సహజమైన పాలకు కొంత వరకు నాచురల్ ఆమ్లత్వం ఉంటుంది. ఇది పాలకు ఎటువంటి పులుపు రుచిని ఇవ్వదు మరియు ఇది పాలను వేడి చేసినప్పుడు ఎటువంటి రియాక్షన్ను ఇవ్వదు. కాని పాలలో డెవలప్ ఆమ్లత్వం ఉన్నప్పుడు పాలు పుల్లగా మారును మరియు అటువంటి పాలను వేడి చేసినప్పుడు విరిగి పోతాయి. దీనిని తెలుసుకొనుటకు క్షార ద్రావణంలో టైట్రేషన్ చేయవలసి ఉంటుంది. ఆమ్ల గుణం ఎక్కువగా ఉన్న పాలను స్వీకరించకూడదు.
(ఊ) లాక్టోమీటర్ రీడింగ్ తీయుట – పాలలో నీళ్ళను కలిపినప్పుడు లాక్టోమీటర్ రీడింగ్ తగ్గిపోతుంది. ఫలితంగా ఈ పరీక్ష పాలు నీళ్ళతో ఏమైన కల్తీ అయినవి, లేనిది తెలుసుకొనుటకు ఉపయోగిస్తుంటారు. లాక్టోమీటర్ వలన ఉపయోగాలు మరియు చాలా వరకు నిరుపయోగాలు కూడా కలవు.
Also Read: Caster Diseases: ఆముదంలో వడలు తెగులు మరియు కాయకుళ్లు తెగులు ఎలా వస్తాయి.!
పాల నమునాను సేకరించుట: పాల యొక్క పదార్థాలు మరియు పాల యొక్క నాణ్యత పరీక్షలను తెలుసుకొనుటకు పాల యొక్క నమునాను సేకరించవలసి ఉంటుంది. దీనికి ఈ క్రింది పరికరాలు అవసరo.
అ) అజిబెటర్ లేదా వంజర్
(ఆ) డిప్పర్
(ఇ) ఐస్ బాక్స్ లేదా ఇగ్లూ బాక్స్
(ఈ) శాంపిల్ బాటిల్.
పాల నమునాను సేకరించు పద్దతులు –
(1) పాడి ఆవు నుండి పాల నమునాను సేకరించుట – ఆవు నుండి పాల నమునాను సేకరించడానికి, ముందుగా పొదుగును 1.1000 పొటాషియం పర్మాంగనెంట్ ద్రావణం లేదా ఇతర అంటి సెప్టిక్ ద్రావణంతో శుభ్ర పరచాలి. తరువాత చనులను పాడిబట్టతో శుభ్రంగా తుడవాలి. మెదటగా వచ్చే కొన్ని పాల ధారలను వదిలిపెట్టి, తరువాత వచ్చే పాలను నేరుగా శాంపిల్ బాటిల్లోకి తీసుకొవాలి. దీనిని వెంటనే ఐస్ బాక్స్ లో పెట్టి ప్రయోగశాలకు పంపిచాలి.
(2) పాల క్యాన్ నుండి నమునాను సేకరించుట – మొట్టమొదటి పంజర్తో పాలను బాగా కలపాలి. తరువాత డిప్పర్తో పాలను తీసుకోని శుభ్రమైన గాజు బాటిల్లోకి సేకరించి, మూత పెట్టి,ఐస్ బాక్స్లో ఉంచి, ప్రయోగశాలకు పంపిం చాలి.
(3) పాల ట్యాంకర్ నుండి పాల నమునాను సేకరించుట – ట్యాంకర్లోని పాలను కూడా ప్లంజర్తో బాగా కలపి, ట్యాంకర్ యొక్క ఆవుట్లెట్ ద్వారoను తెరిచి, ముందుగా వచ్చు పాలను ప్రక్కకు తీసి, తరువాత వచ్చు పాలను నేరుగా శాంపిల్ బాటిల్లో సేకరించి, ఐస్ బాక్స్లో ఉంచి, ప్రయోగశాలకు పంపించాలి.
పాల నమూనాలను ప్రయోగశాలకు పంపించుట ఆలశ్యం అవుతుందనుకుంటే, పాల నమునాలకు ప్రిజర్వేటివ్ అయిన మెర్కూరిక్ క్లోరైడ్ లేదా 40 శాతం ఫార్మాలిన్ లేదా పోటాషియం డై క్రోమెట్ వంటి రసాయనాలను కలిపి పంపిoచాలి.
Also Read: Watershed Facts: నీటి పరీవాహక ప్రాంతం గురించి ముఖ్య విషయాలు తెలుసుకోండి.!