పశుపోషణ

పశుగ్రాసాల సాగు చేసుకోవడం ఉపయోగదాయకం

0

పశుపోషణలో పశుగ్రాసాలు బహుప్రాముఖ్యత చెందినవి. పశుగ్రాసాలు పాడి పరిశ్రమకు పునాదులు.పశువు ఉత్పాదక సామర్థ్యం జన్యుపరంగా మేలైన జాతితోపాటు మేపుపై కూడా 60 శాతం ఆధారపడి ఉంటుంది. జన్యువేకాక, అధికపాల ఉత్పాదక శక్తి సామర్ధ్యాన్ని బహిర్గతం చేయడానికి పోషక విలువలతో కూడిన పశుగ్రాసాన్ని పుష్కలంగా అందిస్తే ఆశించిన పాల దిగుబడులు పొందవచ్చు. తక్కువ నీటిలో సాగుచేయదగిన పశుగ్రాసాల వివరాలు తొసుకోవడం రైతుకు చాలా శ్రేయస్కరం.

పిల్లిపెసర :

ఇది కాయజాతి పశుగ్రాసం. అన్ని రకాల నేలల్లో సాగుచేయవచ్చు. పిల్లిపెసర సాగు ద్వారా నాణ్యమైన గ్రాసం లభించడంతోపాటు, భూమి కూడా సారవంతమవుతుంది. ఏక పంటగా ఎకరానికి 10 – 15 కిలోల విత్తనాలు, మిశ్రమ పంటగా సాగుకు 6-8 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. మొదటికోత 50 రోజులకు, తదుపరి కోత 45 రోజులకు వస్తుంది. మొత్తం పది టన్నుల పుష్టికరమైన పచ్చిమేత ఎకరా పొలం నుండి భిస్తుంది.

జనుము :

కాయజాతి పశుగ్రాసం. అన్ని రకాల నేలల్లో, అన్ని కాలాల్లో, అతి తక్కువ నీటి వసతితో సాగుచేయవచ్చు. ముఖ్యంగా వరి కోసిన తరువాత నేలలో మిగిలిన తేమతో జనుము సాగుచేయవచ్చు. ఎకరానికి 12 -15 కిలో విత్తనాలు కావాలి. పైరును 50 శాతం పూతదశలో కోసుకోవాలి. లేదంటే పీచుపదార్థం పెరిగి గ్రాసాన్ని పశువు జీర్ణించుకోలేవు. ఎకరానికి 10-12 టన్ను మేత భిస్తుంది. జనుమును వరిగడ్డితో కలిపి పశువుకు మేపడం వల్ల వాటికి సమతుల్యా హారం లభించి ఆరోగ్యంగా ఎదుగుతాయి.

అలసంద :

కాయజాతి పశుగ్రాసం ఇందులో ఇ.సి-4216, యు.సి.సి-5286, యస్‌-3 రకాలు అధిక దిగుబడులను ఇస్తాయి. ఎకరానికి 6-8 కిలో విత్తనాలు అవసరమవుతాయి. అలసంద సాగుకు 15 రోజులకు నీటి తడినివ్వాలి. విత్తిన రెండు నెలలకు మొదటికోత తీసుకోవాలి. పైరు 50 శాతం పూత దశలో ఉండగా కోయాలి. ఎకరానికి 8-10 టన్నుల పచ్చిమేత భిస్తుంది.

తీపి జొన్న :

ధాన్యపు జాతి పశుగ్రాసం యస్ .యస్‌.జి-59, యస్‌.యస్‌.జి-898 హరసోనా రకాలు అధిక దిగుబడినిస్తాయి. తక్కువ వర్షపాతం గల ప్రాంతాల్లో అన్ని రకాల నేలల్లో సాగుచేయవచ్చు. అధిక తేమ, ఆమ్ల గుణాలున్న నేల పనికిరావు. ఎకరానికి 1 6-20 కిలోల విత్తనాలు అవసరం. మిశ్రమ పంటగా సాగుచేస్తే 10 -12 కిలోలు సరిపోతాయి. 15 రోజులకొకసారి నీటితడినివ్వాలి. మొదటికోత 60 రోజుకు, తరువాత ప్రతి 45 -60 రోజుకు ఒకసారి చొప్పున 4 కోతల్లో మొత్తం 18 టన్నుల పశుగ్రాసం లభిస్తుంది. ఈ పశుగ్రాసం సైలేజి (పాతర గడ్డికి) అనువుగా ఉంటుంది

పశుగ్రాసపు చెట్టు :

ఇంటి ఆవరణలో పశువుల పాక పరిసరాల్లో, పొలం గట్ల పైన, సేద్యపు బావుల మధ్య బీడు నేలల్లో అవిశె, సుబాబుల్‌, దిరిశన వంటి పశుగ్రాసపు చెట్లు పెంచుకోవచ్చు. ఈ చెట్ల మొక్కను అటవీశాఖ నుండి ఉచితంగా పొందే అవకాశం ఉంది. ఈ చెట్ల ఆకును పశువుకు మేపడం ద్వారా పచ్చిమేత కొరతను అధిగమించవచ్చు.
ఈ చెట్ల ఆకులు 10 -20 శాతం వరకు మాంసకృత్తులు, 50 శాతం వరకు పిండి పదార్థాలను కలిగి ఉంటాయి. పశువుకు మేపుగా మిగిలిన మేతను ఎండబెట్టి లేదా పాతరవేసి నిల్వ చేసుకోవచ్చు. వేసవిలో ధాన్యపుజాతికి, కాయజాతికి చెందిన పశుగ్రాసాలను 1:3 నిష్పత్తిలో పశువును మేపుకోవాలి. వరిగడ్డిని యూరియా గడ్డిగా తయారుచేసుకొని మేపడం మంచిది. వేసవిలో మేపు కొరతను అధిగమించేందుకు వ్యవసాయ ఉత్పత్తులైన పత్తి మొక్కను, పొద్దు తిరుగుడు మొక్కను, చింతగింజు, చెరకు ఆకు, చెరకు పిప్పి, అరటి ఆకు తదితరాను యధాతధంగా లేదా దాణా పదార్ధంగా కూడా వాడుకోవచ్చు.

Leave Your Comments

సిరులు కురిపిస్తున్న కనకాంబరం సాగు

Previous article

లవంగం పంట సాగు – ఉపయోగాలు

Next article

You may also like