Corona Viral Gastro Enteritis in Dogs: ఈ వ్యాధి అన్ని రకాల పశువులతో పాటు కుక్కలలో ప్రధానంగా కలుగుతుంటుంది. ఈ వ్యాధిలో ముఖ్యంగా గ్యాస్ట్రో ఎంటిరైటిస్ లక్షణాలుండి కుక్కలలో విరోచనాలు కలుగుతుంటాయి.ఇది కరోనా విరిడే కుటుంబానికి చెందిన కరోన వైరస్ వలన కలుగుతుంది. ఇది ఒక సింగిల్ స్టాండర్డ్, ఆర్.ఎన్.ఏ, ఎన్వాలాప్టా వైరస్.
ఈ వ్యాధి తీవ్రత పశువుల వయస్సు, స్ట్రెస్, వాతావరణం, జాతి, ఇతర వ్యాధుల మీద ఆధారపడి ఉంటుంది.ఈ వ్యాధి ప్రధానంగా కుక్కలలో వస్తుంది. దూడలలో కూడా. అప్పుడప్పుడు ఈ వ్యాధి కలుగుతుంటుంది.రోగి మలముతో కలుషితం అయిన మేత, నీరు ద్వారా ప్రధానంగా ఈ వైరస్ ఇతర పశువులకు లేదా కుక్కలకు వ్యాపిస్తుంది. వ్యాధి నుండి కోలుకున్న పశువులు 50-60 రోజుల వరకు వాటి మలములో ఈ వ్యాధి కారకాన్ని విసర్జింపజేస్తూ, ఈ వ్యాధి వ్యాప్తి విస్తరించుటకు దోహద పడుతుంటాయి. అంతే కాకుండా ఈగలు కూడా ఈ వైరస్ తమ లాలాజలం ద్వారా వ్యాపింపచేస్తాయి.
వ్యాధి వ్యాప్తి:- వ్యాధి కారక క్రిములతో కలుషితమైన ఆహారoను పై పశువులు తీసుకున్నప్పుడు వ్యాధికారక వైరస్ వాటి పొట్ట ప్రేగులలోకి చేరి, ప్రేగుల కణజాలంను నాశనం చేయుట ద్వారా తీవ్రమైన డయేరియాను కలిగిస్తుంది. ఫలితంగా డీహైడ్రేషన్ లక్షణాలను కలిగి కుక్కలు మరియు దూడలు చనిపోతుంటాయి.
Also Read: Groundnut Seeds: నేల మరియు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వేరుశనగ గింజలు.!
లక్షణాలు:- అతిధేయ శరీరంలోకి ప్రవేశించిన వైరస్ జీర్ణక్రియ వ్యవస్థను నాశనం చేయుట ద్వారా ఈ క్రింది లక్షణాలు వ్యక్తమవుతాయి. వైరస్ రోగి పాల ద్వారా పిల్లలకు చేరి అస్వస్థత కలుగజేస్తుంది. జ్వరం స్వల్పంగా పెరుగును లేదా సాధారణ స్థాయిలోనే ఉంటుంది. కుక్క మరియు దూడలలో తెల్లటి నీళ్ళతో కూడిన విరోచనాలు ఉంటాయి. కొన్ని సందర్భములలో రక్తం కూడా వస్తు ఉంటుంది.
కుక్కలలో వాంతులు మరియు విరోచనాలు సుమారుగా 7-10 రోజుల వరకు వుంటాయి. శరీరంలోని ద్రవములు వాంతులు, విరోచనాల రూపంలో బయటకు వెళ్ళిపోయి నిర్జలీకరణ స్థితి కలిగి, కుక్కలు 2-3 రోజులలో చనిపోతున్నాయి. శ్వాస సంబంధ ఇబ్బందులు (ముక్కు నుండి నీరు కారుట, కంటి నుండి నీరు కారుట) కూడా ఉంటాయి.
వ్యాధి నిర్ధారణ, చికిత్స:- వ్యాధి లక్షణాలు, వ్యాధి కారక చిహ్నాలు మరియు ఇతర పరీక్షల ఆధారంగా వ్యాధిని నిర్ధారించవచ్చు. VNT, CFT, ELISA, AGID, FAT etc. ఈ వ్యాధిని కెనైన్ డిస్టెంపర్, పార్వో వైరల్ వ్యాధితో సరి పోల్చుకోవాలి.
చికిత్స:- సల్ఫాడయజోల్, సక్సీనైల్ సల్ఫా డయాజోల్, సల్ఫా గ్వానిడిన్ లాంటి జీర్ణాశయ వ్యవస్థపై పని చేసే మంచి ఆంటిబయోటిక్ ఔషదాలు ఉపయోగించిన యెడల ఫలితం ఉంటుంది. శరీరం నుండి వెడలిపోయెను ద్రవాలను సెలైన్ రూపంలో సిరల ద్వారా ఇవ్వాలి. ఆంటి డయేరియల్, ఆంటి ఎమిటిక్ ఔషదాలు ఇవ్వాలి. విటమిన్స్, మినరల్స్ వంటివి ఇవ్వాలి. సులువుగా జీర్ణం అయ్యేటువంటి పోషక పదార్థాలు ఆహారంగా ఇవ్వాలి.కుక్కలలో ఈ వ్యాధి రాకుండా నివారణ టీకాలను మొదటి నెలలో మొదటి మోతాదును, తిరిగి 2వ నెలలో బూస్టర్ మోతాదును ఇచ్చి, ప్రతి సంవత్సరం ఈ వ్యాధి నిరోధక టీకాను ఇచ్చినట్లయితే ఈ వ్యాధి వ్యాప్తిని అరికట్టవచ్చు.
Also Read: Infectious Canine Hepatitis in Dogs: పెంపుడు కుక్కలలో కెన్లైన్ హెపటైటిస్ వ్యాధి ఎలా వస్తుంది.!