Chaff Cutter: పాడి రైతులు పశువులకు గడ్డిని అలాగే వేయడం పరిపాటి అయిపోయింది. అలా వేయడం వలన పశువులు పూర్తిగా తినకుండా చాలా భాగం అలాగే వదిలేస్తుంటాయి.దీనికి ఒకే ఒక ఉత్తమ పరిష్కారం గడ్డిని ముక్కలుగా కోయడం. అయితే, ఇలా చేయడం అధిక సమయం తీసుకుంటుంది. దీనికోసమే తయారు చేయబడిన యంత్ర పరికరము చెఫ్ కట్టర్. పశువుల దాణాను చాఫ్ కట్టర్ అనే యాంత్రిక పరికరంతో గడ్డిని లేదా ఎండుగడ్డిని ఇతర మేతతో కలిపి చిన్న ముక్కలుగా కత్తిరించి పశువులకు తినిపించ వచ్చు.
ఇది జంతువు యొక్క జీర్ణక్రియకు సహాయపడుతుంది. జంతువులు తమ ఆహారంలో ఏ భాగాన్ని వదిలిపెట్టకుండా తినేందుకు వీలవుతుంది. వ్యవసాయ ఉప-ఉత్పత్తులలో ఎండుగడ్డి ప్రధానమైనది. వివిధ పంటలు అనగా వారి, మొక్కజొన్న, జొన్న, సజ్జ పంటల నుండి ఎండుగడ్డి పుష్కలంగా వస్తుంది.ఇది పశువుల మెత్తగా, పాల ఉత్పత్తి పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
Also Read: వరి కలుపు ఇక సులువు
మొదట చాఫ్ కట్టర్లు ప్రాథమిక యంత్రాలుగా ఉపయోగించే వారు. పాడి రంగం వాణిజ్యపరంగా సాగుతుండడంతో ఇవి వాణిజ్య ప్రామాణిక యంత్రాలుగా అభివృద్ధి చెండుతున్నాయి. జంతువుల రకాన్ని బట్టి వీటిని వివిధ వేగాలతో నడపవచ్చు, అలాగే వివిధ పొడవులలో కత్తెరించవచ్చు. కొత్త చాఫ్ కట్టర్ యంత్రాలు పోర్టబుల్ ట్రాక్టర్ తో నడపవచ్చు. ఇక్కడ చాఫ్ కట్టర్ పొలంలోనే కత్తిరించవచ్చు.కత్తెరించిన దాణాను ట్రాక్టర్ ట్రాలీలలో నింపి వేరొక దగ్గరకు చేరావేయవచ్చు.ఈ యంత్రాలు చేతితో నడపవచ్చు, కరెంటు తో కూడా నడపవచ్చు. చేతితో నడిపే యంత్రాలలో హ్యాండీల్ సహాయంతో గుండ్రగా తిరిగేలా చేస్తే ఒక ఫ్లైవీల్ తిరుగుతుంది.
ఆ ఫ్లైవీల్ కి బ్లేడ్ లు అమర్చబడి ఉంటాయి. బ్లేడ్ ల సహాయంతో గడ్డిని ముక్కలు ముక్కలు చేయవచ్చు. అదే ట్రాక్టర్ తో నడిపే చెఫ్ కట్టర్ లు ట్రాక్టర్ యొక్క పి.టీ.ఓ షాఫ్ట్ తో అతికించుకోడానికి వీలుగా ఉంటుంది. దీనితో మానవ శ్రమను తగ్గించవచ్చు. చెఫ్ కటర్ ఉపయోగించడం వలన 30-70% గడ్డి వృదాను తగ్గించవచ్చు.పాల దిగుబడులు కూడా పెంచవచ్చును.దీని ధర తయారీ కంపెనీ బట్టి 25000/- నుండి 1.5 లక్షల వరకు ఉంది. మన దేశం లో చాలా కంపెనీలు వివిధ ప్రత్యేకతలతో చెఫ్ కట్టర్ లను రూపొందిస్తున్నాయి. కొన్నింటికి వ్యవసాయ మరియు పాడిశాఖలు సబ్సిడీలు కూడా అందిస్తున్నాయి.
Also Read: వెలగ సాగు మెళుకువలు