Catching Equipments for Hens: కొన్ని రకాల పరికరాలను కోళ్ళను పట్టుకోవటానికి ఉపయోగిస్తారు. కోళ్ళను బరువు తూచటానికి, చంపటానికి పరీక్షించటానికి మరియు చికిత్స చేయటానికి వాటిని పట్టుకోవలసి వుంటుంది. ఇలాంటి పరికరాలలో కాచింగ్ ప్రేవ్ ఎ(చట్రము), కాచింగ్ క్రేట్ (వెదురు బుట్ట), కాచింగ్ హుక్ వంటి వాట్ని కోళ్ళను పట్టుకోవటానికి ఉపయోగిస్తారు.
Also Read: Kitchen Garden: శరీరానికి సమతుల్య ఆహారం కోసం కిచెన్ గార్డెన్ తప్పనిసరి
1)పక్షి గూళ్ళు:- డీప్ లిట్టర్ సిస్టమ్ కోళ్ళు గ్రుడ్లను లిట్టర్ పైనే పెట్టవలసి వుంటుంది. అందువల్ల గ్రుడ్లుల పరిశుభ్రంగా వుంటాయి. ఒక వేళ గ్రుడ్లు పెట్టటానికి డీప్ లిట్టర్ సిస్టమ్లో పక్షి గూళ్ళను ఏర్పాటు చేసినట్లయితే ఈ సమస్యను అధిగమించవచ్చు. పక్షి గూళ్ళలో చాలా రకాల పక్షి గూళ్ళ అందుబాటులో వున్నాయి అవి..
2) ఇండివిజువల్ నెక్స్ట్:- ఒక ఇండివిజుల్ నెస్ట్ 5 గ్రుడ్లు పెట్టె కోళ్ళకు సరిపోతుంది.
3) కమ్యునిటి వెస్ట్స్:- వాణిజ్య సంబంధమైన గ్రుడ్లు పెట్టే కోళ్ళ ఫారమ్ లో వీటిని సాధారణంగా ఉపయోగిస్తారు.
4) రోల్ ఆఫ్ వెస్ట్స్:- ఇది శుభ్రమైన గ్రుడ్ల ఉత్పత్తికి ఉపయోగపడుతుంది. కాని దానిని సరిగ్గా అమర్చకపోతే గ్రుడ్లు పగిలిపోయే అవకాశం వుంది.
5) ఇంక్యూబేటర్:- గుడ్లను పొదిగించి పిల్లలను ఉత్పత్తి చేయటానికి ఉపయోగించే యంత్రం. హ్యాచరీలలో దీని కోడి పిల్లలను ఉత్పత్తి చేసి పెంపకదారులకు సరఫరా చేయడానికి వినియోగిస్తారు. సరైన ఇంక్యుబేటర్లలో గుడ్లు ఎక్కు నవృధా కాకుండా పిల్లలు ఎక్కువగా వస్తాయి.
6) రూస్టు (పర్చేస్):- ఈ గృహోపకరణము కోడి పిల్లలు 8 వారల వయస్సుకు ఎదిగినప్పుడు ఉపయోగపడున ఈ పరికరములు కోళ్ళ పాదాలు మరియు రెక్కలను శుభ్రంగా వుంచుటకు ఉపయోగిస్తారు.
7) రూస్టు తయారు చేయు విధానము:- ఇది 2 చదరపు అడుగులు వుండి గుండ్రంగా కట్టెలతో చేయవచ్చును అయితే పై భాగము గుండ్రంగాను క్రింది భాగము వెడల్పుగాను ఉండాలి. ఈ పరికరము కోళ్ళ గృహం పై, నేలపైన గోడల ప్ర క్కన 6 ఇంచుల ఎత్తుగా ఉంచాలి. అయితే అవి సులభంగా తీసి అంటు వ్యాధులు లేకుండా వుండుటకు క్రిమి రకాలు వెదజల్లుటకు అనుకూలంగా వుండవలెను. ఒక రూస్టుకు ఇంకొక రూస్టుకు మధ్యంతరం 8 ఇంచుల స్థలం వ ఎండాలి. ఈరూస్టులను కీటకముల నుండి కాపాడేందుకు సరిపడే రంగులతో లేపనం చేయ్యాలి.
8) షెల్ గ్రిట్ కంటేయినర్స్:- ఈ ఉపకరణములు కట్టెతో లేదా మెటల్తో చేయించి ఉపయోగించవచ్చును. వీ ట్ ద్వారా oytershells లేదా other ర్మాణమునకు కాల్సియం లభించును. grit పదార్ధములను ఉంచాలి.
9) బ్రూడర్స్:- ఇవి కోడి పిల్లలకు వెచ్చదనాన్ని కలిగించుటకు వాడెదరు. ఇవి వివిధ రకాలుగా ఉన్నాయి. కోడి పిల్లలను పెంచే విధానాన్ని బట్టి పెంచే కోడి పిల్లల సంఖ్యను బట్టి మరియు క్షేత్రం యొక్క ఆర్థిక పరిస్థితిని ట్టి బ్రూడర్లను ఎన్నుకొవాలి.
Also Read: Precautions for Bringing Baby Chicks Home: కోడి పిల్లలు తెచ్చే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.!