Castration with Blade: కాస్ట్రేషన్ అంటే మగ జంతువులలో వృషణాలను పని చేయకుండా చేయడం లేదా పూర్తిగా తీసివేయడం. ఈ పద్ధతిని సంతానోత్పత్తికి అవసరం లేని జంతువుల మీద జరుపుతారు. జంతువులు కాస్ట్రేట్ ఎందుకు చేస్తారు? రైతులు లేదా జీవులను పెంచే వారు జంతువులలో మేలు జాతి మగ జంతువుతో ఆడ జంతువుతో మాత్రమే కలపడానికి ఈ పద్దతి ఉపయోగపడుతుంది. ఫలితంగా మేలు లక్షణాలు ఉన్న మగ జంతువు ఆడ దానితో జతకట్టడానికి మరియు మేలు రకం పిల్లల ఉత్పత్తి చేయవచ్చు. లేకపోతే వచ్చే పిల్లల మంద ఆరోగ్యవంతంగా ఉండదు.

Blade Using for Castration
వృషణాలు తీయని మగ జంతువులు కూడా పోరాడగలవు కాబట్టి సంతానోత్పత్తికి ఉత్తమంగా లేని జంతువులను పోత చేయడం మంచిదని డాక్టర్లు సూచిస్తారు. జంతువులను ఎప్పుడు కాస్ట్రేట్ చేయాలి? జంతువులు చిన్న వయస్సులో ఉన్నప్పుడు కాస్ట్రేట్ చేయడానికి ఉత్తమ సమయంగా పరిగణించాలి. ఈ సమయంలో కాస్ట్రేషన్ చేసిన, ఆపరేషన్ చాలా సులభంగా, విజయవంతంగా అవుతుంది. చేసినపుడు శరీరం మీద గాయం చాలా త్వరగా నయం అవడానికి ఆస్కారం అవ్తుంది.
Also Read: Zinc Deficiency in Maize: మొక్కజొన్నలో జింక్ లోప నివారణ లో మెళుకువలు
కాస్ట్రేషన్ కోసం జంతువులను పట్టుకొను విధానం – నియంత్రించు పద్దతి.

Castration Method
Castration with Blade: మగ జంతువులలో కాస్ట్రేషన్ పద్దతి. దూడలు నిలబడి ఉన్నప్పుడు కూడా చేయవచ్చు కానీ జంతువులు ఆగవు కాబట్టి బాగా నిరోధించాల్సిన అవసరం ఉంటుంది. కత్తితో కాస్ట్రేషన్ చేసే పద్దతిలో చాలా పదునైన కత్తి, రేజర్ లేదా స్కాల్పెల్ ఉపయోగిస్తారు. కత్తి, రేజర్ లేదా స్కాల్పెల్ పదునుగా, శుభ్రంగా ఉందో లేదో తప్పక తనిఖీ చేసుకోవాలి. ఆల్కహాల్, అయోడిన్, డెటాల్ లేదా జెంటియన్ వైలెట్ వంటి శతివంతమిన సర్టిలైజర్స్ / క్రిమిసంహారక ద్రవాలతో బ్లేడ్‌ను శుభ్రం చేసుకోవాలి.

Castration with Blade
స్క్రోటమ్‌ను తుదపాలి, తరువాత చేతులను కూడా గోరువెచ్చని నీరు మరియు సబ్బును ఉపయోగించి శుభ్రపరచుకోవాలి. స్క్రోటమ్ దిగువన చివరను కత్తిరించాలి. కత్తిరించిన తరువాత స్క్రోటమ్ యొక్క చివర వృషణాన్ని గట్టిగా పిండన, అది బయటకు వస్తుంది.ప్రతి వృషణాన్ని వీలైనంత వరకు బయటకు లాగాలి. వృషనానికి ఉన్న తాడు వంటి భాగాల చుట్టూ చాలాసార్లు తింపాలి. కత్తిని మెల్లగా పైకి క్రిందికి గీస్తూ పశువులలో గేదెలలో త్రాడును పూర్తిగా కత్తిరించి వేయాలి. తెరిచి ఉన్న స్క్రోటమ్ లోపల వేళ్లను ఉంచకూడదు. గాయం మీద అయోడిన్, జెంటియన్ వైలెట్, డెటాల్ లేదా యాంటీబయాటిక్ పౌడర్ యొక్క టింక్చర్ పోసి తుడవాలి. ఈ పద్దతి చాలా హింసాత్మకం గా ఉంటుంది. జంతువులు చిత్ర హింసలకు అనుభవిస్తాయి. ఈ పద్దతిలో రక్తం పోవడం సహజం. సరిగ్గా చేయక పోవడం వలన ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం కూడా ఉంది. సంప్రదాయ పద్ధతిలో జంతువు ట్రామా ను అనుభవిస్తుంది. ప్రస్తుతం ఈ పద్ధతిని ఎక్కువ పాటించడం లేదు.
Also Read: Gaddi Sheep: గడ్డి గొర్రెల లక్షణాలు, ఆహారం, వ్యాధులు