పశుపోషణమన వ్యవసాయం

Castration in Bulls: దున్న మరియు ఎద్దులలో విత్తులు నొక్కు పద్ధతులు.!

1
Castration in Bulls
Castration in Bulls

Castration in Bulls: వృషణాలను శస్త్ర చికిత్స ద్వారా కాని లేదా రసాయనిక పదార్థాలను ఉపయోగించి కాని పునరుత్పత్తి కి ఉపయోగపడకుండా చేయు విధానమును క్యాస్టేషన్ అని అందురు.

Castration in Bulls

Castration in Bulls

Also Read: Bloodless Castration: రక్తం లేకుండా కాస్త్రేషన్ ఇలా చేయాలి

ఎద్దులు మరియు దున్నలలో విత్తులు నొక్కవలసిన అవసరం ?

  • విత్తు కొట్టిన తరువాత మగ జంతువులలో సాధుత్వ లక్షణాలు వస్తాయి. ఫలితంగా వీటిని తేలికగా లొంగ దీయవచ్చును.
  • మంచి లక్షణములు లేని పశువులు యొక్క పునరుత్పత్తికి ఉపయోగించ కుండా ఆపివేయవచ్చును.
  • యాజమాని మాట వినుటకు.
  • విత్తులు నొక్కిన పశువుల నుండి వచ్చిన మాంసం, ఉన్ని చాలా నాణ్యత కలిగి యుంటుంది.
  • మందలో ఉన్న పశువుల ఎదను గుర్తించే టీజర్ బుల్గా ఉపయోగించడానికి
  • ఆడ మగ పశువులను బ్రీడింగ్ కాలంలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒకే చోట ఉంచవచ్చు.
  • మాంసోత్పత్తి పశువులలో తొందరగా బరువు పెరుగటకు
  • మాంసం కొరకు పెంచు పశువులను చిన్నప్పుడే క్యాస్ట్రేషన్ చేస్తారు. పని చేయు పశువులకు 2-2.5 సంవత్సరముల వయస్సులో కాస్ట్రేషన్ చేస్తారు.

విత్తులు నొక్కు పద్ధతులు

అ) శస్త్ర చికిత్స చేసి పృషణములను తొలగించుట

ఆ) బర్డితో క్యాస్టేటర్ను ఉపయోగించు చేయు పద్ధతి

1. నాటు పద్దతి లో విత్తులు నొక్కుట – ఈ పద్ధతి నందు వృషణాలపై బలమును ఉపయోగించి వాటిని పగలగొట్టుట ద్వారా వీటిని పునరుత్పత్తికి పనికి రాకుండా చేస్తారు. ఈ పద్ధతిలో పశువులు చాలా రోజుల వరకు బాధపడి ఎటువంటి పనిచేయలేకుండా ఉంటాయి. ఈ పద్ధతి ద్వారా ఇన్ఫెక్షన్ కలిగే అవకాశాలు ఎక్కువ. ఈ పద్ధతిని ఈ కాలంలో ఎవ్వరు ఉపయోగించుట లేదు. ఇది అంతా మంచి పద్ధతి కాదు.

2) శస్త్ర చికిత్స చేసి పృషణములను తొలగించుట (ఈ పద్ధతిని ఎక్కువగా కుక్కలలో ఉపయోగిస్తారు. శస్త్ర చికిత్స ద్వారా పూర్తి వృషణాలను కాని, స్పెర్మాటిక్ కార్డ్ ని కాని తీసివేసి, కుట్లు వేసి నయం చేయు పద్ధతి. ఈ పద్ధతిని పెద్ద పశువులలో సహజంగా ఉపయోగించరు.

3. బర్డి జో క్యాస్టేటర్ను ఉపయోగించు చేయు పద్ధతి – ఈ పద్ధతిని ఎక్కువగా పని చేయు ఎద్దులలో ఉపయోగిస్తారు. ఈ పద్ధతి చేయుటకు ముందు బర్డిలో క్యాస్టేటర్ మరియు ఏదేని ఒక అంటి సెప్టిక్ ద్రావణములను దగ్గర పెట్టుకోవలసి యుంటుంది.

వేయు పద్ధతి:- ఎద్దులు లేదా దున్నలను మెత్తటి ప్రదేశంలో క్యాస్టింగ్ చేసి, నాలుగు కాళ్ళు గట్టిగా కట్టి వేయవలెను. వృషణములను బయటికి లాగి, చేతితో నిమిరి, స్క్రోటమ్ యొక్క చర్మంను టించర్ అయోడిన్ ద్రావణముతో శుభ్రపరచవలెను. తదుపరి ఏదైన ఒక వైపు వృషణమును పైకి నెట్టి, మరొక వైపున ఉన్న స్పెర్మాటిక్ కార్డు చర్మముతో గట్టిగా లాగి బర్డి జో క్యాస్టేటర్ దవడల మధ్య ఉంచాలి. జాగ్రత్తగా పరీశిలించి స్పెర్మాటిక్ కార్డు బర్డితో దవడల మధ్య ఉంది అని నిర్ధారించుకున్న తరువాత బర్డిజో క్యాస్ట్రేటర్ను గట్టిగా నొక్కి కొద్దిసేపు ఒత్తి పెట్టుకోవలెను. తరువాత బర్డి జోను తీసి, రెండొవ వైపు వృషణాలకు కూడా అలాగే చేయవలెను. క్యాస్టేషన్ చేసిన ప్రొటల్ చర్మం పై టించర్ అయోడిన్ ద్రావణమును పూయవలెను. పశువులకు నొప్పి ఉంటుంది కనుక ఏదేని ఒక అంటి అన్యాసిక్ (నొప్పులను తగ్గించేది) ఔషధములను ఇచ్చి పశువులను క్రింద నుండి పైకి లేవవలెను.

ఈ పద్ధతిలో తీసుకోవలసిన జాగ్రత్తలు:- స్పెర్మాటిక్ కార్డ్ నొక్కునప్పుడు పృషణాలు కాని, ఎపిడైడిమస్ను కాని, పురుషాంగమును కాని నొక్కకూడదు. రెండు వైపుల క్యాస్టేషన్ చేసిన చర్మ భాగాలు కలిసి పోకూడదు అంటే రెండు వైపులా సమాంతరంగా ఉండకూడదు. క్యాస్టేషన్ను చల్లటి పూట మాత్రమే చేయాలి. క్యాస్టేషన్ చేసిన వారం రోజుల వరకు పశువులు బురద, తేమ, ముళ్ళు వంటివి స్క్రోటమ్ భాగాలకు తగలకుండా చూసుకోవాలి. అవసరమును బట్టి 3-5 రోజులు ఏదేని ఒక అంటిబయోటిక్ను ఉపయోగించవచ్చును.

Also Read: Castration with Blade: మగ జంతువులలో కాస్ట్రేషన్ పద్దతి.

Leave Your Comments

Phytophthora Blight in Chilli: మిరప పంట లో నారు కుళ్ళుతెగులు యాజమాన్యం.!

Previous article

Weed Management in Tobacco: పొగాకు పంటలో అంతరకృషి మరియు కలుపు యాజమాన్యం

Next article

You may also like