Casting of Animals: పశువులను జాగ్రత్తగా క్రింద పడేసి కాళ్ళు కట్టి అదుపులో ఉంచడాన్ని Casting అని, పశువులు శరీర భాగాలు కదలకుండా ఉంచడాన్ని Restraining అంటారు
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
(1) పాడి పశువులను క్యాస్టింగ్ చేసే 12 గంటల ముందు నుండి ఎటువంటి ఆహారం కాని, నీరు కాని ఇవ్వకూడదు
(2) నెమరు వేయు పశువులకు ఎడమ ప్రక్కల రూమెన్ ఉంటుంది, కనుక కుడి ప్రక్కకు క్యాస్టింగ్ చేయ్యాలి
(3) నిండు చూలుతో వున్న పశువులను అత్యవసర సమయములో తప్ప, మిగతా సమయాలలో పడవేయరాదు
(4) పడ వేసిన పశువు క్రింద వున్న మోకును తక్షణమే లాగి తీసి వేయ్యాలి
(5) క్యాస్టింగ్ చేయవలసిన వృత్తకార గుంత పూర్తిగా ఇసుకతో నింపబడి ఉండాలి. పశువు తల క్రింద గడ్డి ఉంచాలి
(6) క్యాస్టింగ్ గుంతలో రాళ్ళు, రప్పలు, పదునైన వస్తువులు ఉండకూడదు.
Also Read: Disease in Turkey Rearing: టర్కీ కోళ్ల లో వచ్చే వ్యాధులు.!
Reuff Method (or) American Method:- ఈ పద్ధతిలో 3-4 అంగుళాల మందము, 40 అడుగుల పొడవు గల నూలు తాడు యొక్క చివర loop చేసి, ఆ loop ను ఎడమ కొమ్ముకు తగిలించి ‘S’ ఆకారంలో రెండు కొమ్ములకు చుట్టాలి. రెండవ చివరను ముందుకాళ్ళు ముందు భాగము అనగా మెడ క్రింది భాగంకు పశువు యొక్క ఎడమ వైపున హాఫ్ హిచ్స్ ముడి వచ్చునట్లు వేయ్యాలి. అదే విధంగా రెండవ హిచ్ ముందుకాళ్ళ వెనుక భాగమున ఛాతి ముందు పూయ్యాలి. తరువాత మూడవ హాఫ్ హిచ్ వెనుక కాళ్ళ ముందు భాగమున పొట్ట వెనుక భాగమున ఎడమ వైపున వచ్చునట్లుగా చేసి కొద్దిగా బిగించి పట్టుకోవాలి.
పశువుకు కొమ్ముల ముందు భాగమున ఒకరు, మెడ కుడి భాగాన ఒకరు, కుడి తొడ భాగాన ఒకరు తోక వెనుక భాగాన తొడను లాగుటకు ఒకరు మరియు ఎడమ భాగాన తోక ముడి వేయుటకు ఒకరు నిలుపడాలి. తోక వెనుక వున్న వ్యక్తి మాకును గట్టిగా లాగినచో ఎడమ తొడ దగ్గర వున్న వ్యక్తి క్రింద పడుతున్న పశువును కుడి వైపునకు పడునట్లుగా తొయ్యాలి. అదే సమయంలో కొమ్ముల ఎదుటనున్న వ్యక్తి పశువు మెడను ఎడమ వైపుకు తిప్పి క్రింద పడిన పశువు మెడను ఎడమవైపుకు తిప్పి పట్టుకొని ఉండగా తోక ముడి వేసి ఒకరు పట్టుకోవలి.
ఈ విధంగా పశువును సరియైన పద్ధతిలో పడవేయ్యాలి. తక్షణమే పశువు క్రింద వున్న మోకును లాగి వేయ్యాలి. తరువాత వెనుక కాళ్ళను మొట్ట మొదట కట్టాలి. తరువాత కుడి ముందు కాలు వెనుక కాళ్ళ క్రిందికి, ముందు ఎడమ కాళ్ళు, వెనుక కాళ్ళ పైకి వచ్చినట్లు నాలుగు కాళ్ళను కట్టి వేయ్యాలి. పశువు శ్వాస చక్కగా పీల్చునట్లు మెడ క్రింద దిండు ఉంచాలి. ఈ విధంగా కట్టిన పసువు పై చేయాల్సిన ఆపరేషన్ గాని, క్యాస్ట్రేషన్ గాని, తదితర పని అయిన తర్వాత మెల్లగా నాలుగు కాళ్ళకు కట్టిన త్రాడును విప్పి వేసి, పశువును వదిలి పెట్టవచ్చు.
Also Read: Paratuberculosis Disease in Cattle: పశువులలో జోన్స్ వ్యాధి లక్షణాలు.!