Caring for Baby Chicks : భారతదేశ ఆర్ధిక వ్యవస్థకు వ్యవసాయము మరియు అనుబంధ వ్యవసాయ రంగాలు మూల స్థంభంగా ఉన్నాయి. వ్యవసాయ రంగం, మన దేశంలో 2/3 వంతు జనాభాకు జీవనోపాధి కల్పించడమేకాక మన దేశ సంస్కృతికి, ప్రగతికి మరియు జీవన విధానానికి అద్దంపడుతుంది. మన దేశంలో పశుపోషణ, ఉద్యాన వనాలు, కోళ్ళు, చేపలు, పట్టుపురుగులు మరియు బాతుల పెంపకం మొదలగునవి వ్యవసాయంలో భాగంగా చేర్చబడి ఆదాయం పెంపొందించుకునే మార్గాలుగా గుర్తించబడ్డాయి.
వ్యవసాయంలో అనాధిగా రైతులకు అండదండగా నిలిచే పరిశ్రమగా పశుపోషణ ఉంది. ఈ పరిశ్రమలో ఆవులు, గేదెలు, పందులు, మేకలు, గొర్రెలు,ఇతరత్రా జంతువులు ఉంటాయి. అందులో కోళ్ల పెంపకంతో అధిక లాభాలు ఆర్జిస్తున్నారు. సహజంగా కోడి 8 నుండి 12 గుడ్లని పొదిగి పిల్లలను కాపాడుకుంటుంది. ఎక్కువ సంఖ్యలో ఉన్న గుడ్లను కృత్రిమంగా పొదిగించి, పిల్లలకు కొన్ని రోజుల వయసు వచ్చేంతవరకు సంరక్షించడాన్ని బ్రూడిరగ్ అంటారు. Caring for Baby Chicks
బ్రూడిరగ్ కోసం పిల్లలను ఫార్మ్ కి తీసుకొచ్చేలోపు చేయవలసిన పనులు ఏంటంటే.. బ్రూడిరగ్ కోసం ఉపయోగించే గదిని శుభ్రపరిచి గదిని డిస్‌ఇన్ఫెక్షన్ చేయాలి. బ్రూడిరగ్ సమయంలో ఉపయోగించే వివిద పరికరాలను ముందుగా డిటెర్జెంట్‌తో శుభ్రపరిచి, 2-3 సార్లు మరలా మంచి నీటితో కడిగి, ఎండలో ఆరబెట్టి తయారుగా వుంచుకోవాలి. బ్రూడర్ ని 2-3 రోజుల ముందుగా ఏర్పాటు చేసుకొని, ఏవైనా మరమత్తు ఉంటే సరిచూసుకోవాలి.బ్రూడర్‌కి కావాల్సినవి :
చిక్ గార్డ్
బల్బ్/హీట్ సోర్స్
హోవర్
న్యూస్ పాపేర్స్
వాటరర్ అండ్ ఫీడర్స్
బ్రూడర్ అమరిక
-
1.5 అడుగు ఎత్తు గల అత్తను లేదా ప్లాస్టిక్ రేకును చిక్ గార్డ్ గా వుపయోగించుకోవచ్చు.
-
చిక్‌గార్డ్ ని గుండ్రంగా అమర్చి, వచ్చే రోజుల్లో వ్యాసం పెంచుకునేందుకు వీలుగా కొంచం ఎక్కువ పెట్టుకోవాలి.
-
ధాన్యం పొట్టును / రంపపు పొట్టును / ఊకను గార్డ్ లోపల ఒక ఇంచు ఎత్తులో పరిచి దాని మీద న్యూస్ పేపర్స్ ని వేయాలి.
-
తర్వాత వేడి కోసం నిప్పు కుంపటిని గాని, గ్యాస్ బ్రూడర్ని కానీ, బల్బ్ ని కానీ అమార్చుకోవచ్చు.
-
హీట్ సోర్స్ నుండి వేడి సమానంగా వ్యాపించడానికి వెదురు లేదా అలుమినియమ్ తో చేసిన హోవేర్స్ ని వాడుకోవచ్చు .
-
ఫీడర్స్‌ని మరియు వాటరర్స్ ని ఒకదాని తర్వాత ఒకటి వృత్తాకారంగా అమర్చుకోవాలి.
-
న్యూస్ పేపర్ మీద మొదటి రోజు చిన్న రవ్వగా చేసిన మొక్క జొన్నలని వేయాలి.
-
కోడిపిల్లలని ఫార్మ్ కి తెచ్చిన రోజున చేయాల్సిన పనులు
-
మేరేక్స్ వ్యాధికి హేచరీలో వాక్సినేషన్ జరగని యెడల మొదటి రోజునే వాక్సినేషన్ చేయాలి.
-
కోడిపిల్లలను హేచరీ నుండి ఎటువంటి వత్తిడి లేకుండా ఫార్మ్ కి రవాణా చేయాలి, పిల్లలని జాగ్రత్తగా బయటకి తీశాక అనారోగ్యంతో ఉన్నవాటిని, అవిటివాటిని వేరు చేయాలి.
-
కోడిపిల్లలని లెక్కించుకోవాలి.
-
కోడిపిల్లల ముక్కుని బి కాంప్లెక్స్ కలిపిన నీటిలో ముంచి తీయాలి, ఇది పిల్లలకి నీరు తాగే అలవాటు చేస్తుంది.
-
కోడిపిల్లలని బ్రూడర్‌లోని న్యూస్ పేపర్‌పై వదిలిపెట్టే ముందు కొంతసేపు లైట్ లేదా బల్బ్‌ను వేసి వుంచటం వలన బ్రూడర్ వెచ్చగా మారి కోడి పిల్లలకి అనువుగా వుంటుంది.
-
ఉష్ణోగ్రత – కోడిపిల్లలు :
-
ఉష్ణోగ్రత తగినంతగా వున్నప్పుడు పిల్లలు బ్రూడర్ నిండుగా సర్దుకుంటాయి.
. ఉష్ణోగ్రత తగ్గినప్పుడు పిల్లలన్నీ బ్రూడర్ మద్యగా హీట్ సోర్స్ దగ్గరగా వచ్చి గుంపుగా చేరుతాయి.
. ఉష్ణోగ్రత పెరిగినప్పుడు పిల్లలన్నీ బ్రూడర్ అంచులకి చేరుకుంటాయి.
. కోడిపిల్లల యొక్క ప్రవర్తన బట్టి హీట్ సోర్స్ తీవ్రతను తగ్గించటం లేదా పెంచటం చేయవచ్చును.లేదా హోవర్ యొక్క ఎత్తును మార్చి లోపల వేడిని సరిచేసుకోవచ్చు.
. ప్రతి వారానికి 5 డిగ్రీ ఫారంహీట్ ఉష్ణోగ్రత బ్రూడర్‌లో తగ్గించాలి.
అవసరాలు :
. ప్రతి ఒక్క పిఐఎల్లకి ఒక వాట్ ఉష్ణోగ్రత అవసరం కనుక ప్రతి 300 పిల్లలకి మూడు వంద వాట్ల బల్బ్‌ని కానీ ఐదు అరవై వాట్ల బల్బ్‌ని కానీ వాడుకోవచ్చు.
. ప్రతి వంద కోడిపిల్లలకి 33 సెం.మీ పొడవుగల నాలుగు ఫీడెర్స్ మరియు 1 లీ. కెపాసిటీ గల వాటెరర్ అవసరం.
. రోజుకి రెండు సార్లు త్రాగే నీటిని మార్చుకోవాలి. వాటేరెర్స్ కింద వాటర్ ప్రూఫ్ షీట్‌ని వేసుకోవచ్చు.
. నీటిలో ఆంటీ స్ట్రెస్ మందులు కలిపి వాడుకోవచ్చు.
. ఫీడెర్స్‌ని ఉపయోగించినప్పుడు వాటిని సగానికి మాత్రమే నింపటం ద్వారా దాణా వ్యర్ధాన్ని తగ్గించవచ్చు.
లివాక్సినేషన్ మరియు మెడికేషన్ స్కెడ్యూల్:
డే 1: మేరేక్స్ వాక్సిన్ బీ గ్లూకోజు, ఎలెక్ట్రోలైట్ కలిపిన నీరు
డే 6-7 : ఆర్.డి ఎఫ్ 1/ లసోటా వాక్సిన్‌బీ కంటిలో లేదా ముక్కులో ఒక చుక్క
డే 11/12 : గంబోరో వాక్సిన్ 1 లేదా 2 చుక్కలు కంటిలో లేదా త్రాగే నీటిలో
డే 21 /22 : లసోటా బూస్టర్
డే 22/28 : యాంటీ కాక్సిజియల్ పొడి, ఒక లీటర్ త్రాగే నీటికి ఒక గ్రాము పొడి
డా. డి. దేవిక (ప్రిన్సిపల్), శ్రీ వేంకటేశ్వర అనిమల్ హజ్బండరీ పాలిటెక్నిక్
ఎట్చ్చెర్ల, శ్రీకాకుళం, ఫోన్: 8309011014