పశుపోషణ

Candidiasis in Cows: పశువులలో కాండిడియోసిస్ వ్యాధిని ఎలా నివారించాలి.!

2
Candidiasis Disease in Cows
Candidiasis Disease in Cows

Candidiasis in Cows: ఈ వ్యాధి కాండిడియా ప్రజాతికి చెందిన వివిధ రకాల జాతుల శిలీంధ్రాల వలన ఆవులు, గేదెలలో కలుగు ఒక జునోటిక్ వ్యాధి. ఈ శీలింధ్రాలు. సహజంగా శరీర ఉపరితలంపై మరియు వివిధ శరీర వ్యవస్థలలో సాధారణంగా ఉండి, అనుకూల పరిస్థితులు కలిగినప్పుడు వ్యాధి జనకంగా మారుతుంటాయి. ఈ వ్యాధి కారకం పశువుల పేడ ద్వారా బయటకు విడుదలవుతుంటుంది. కావున కలుషితమైన ఆహారం మరియు నీరుద్వారా ఈ వ్యాధి ఆరోగ్యంగా ఉన్న పశువులకు సోకుతుంటుంది.

శీలింధ్రపు వ్యాధులు కలుగుటకు దోహదపడు వివిధ అంశాలు: దీర్ఘకాలం అంటిబయోటిక్స్లో చికిత్స చేయడం, దీర్ఘకాలం పాటు స్థిరాయిడ్ ఔషదములను చికిత్సకు ఉపయోగించుట, విటమిన్ B-complex, vit-A లోపాలు,పశువులు పరిశుభ్రంగా లేనపుడు,ట్యూబర్ క్యూలోసిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులున్నప్పుడు, పోషక ఆహార లోపం కలిగినప్పుడు,క్యాన్సర్ వంటి కారణాలు ఫంగల్ వ్యాధులు ప్రబలుటకు దోహద పడతాయి.

Also Read: Typhoid Prevention: వర్షాకాలంలో వచ్చే ఈ వ్యాధి నుండి దూరంగా ఉండాలంటే.. ఇవి పాటించండి.!

Candidiasis Disease in Cows

Candidiasis Disease in Cows

లక్షణాలు:-  ఈ వ్యాధి చర్మం పై, క్లిషు పొరలపై మరియు అంతర శరీర వ్యవస్థలలో కలుగుతుంది. నాలుక పైన, దిగుళ్ళ పైన, లంగులపైన పిల్లటి పొడులతో కూడిన గాయాలు. నీర్చతో కూడిన విరోచనాలు, వాంతులు (దూడలు, కుక్కలు, పందులలో) గిట్టల మధ్య, లోపలి భాగాన, యోని రంధ్రంలో కూడా ఈ రకమైన గాయాలు వుండి తీవ్రమైన దురద వ్యక్తపరుస్తుంది. పాలిచ్చు పశువులలో పాల దిగుబడి తగ్గిపోతుంది.ఆకలి నశించిపోయి, నెమరు వేయకుండా, క్రమంగా క్రుశించిపోయి కొన్ని సార్లు మరణాలు సంభవిస్తుంటాయి.

చికిత్స:-

(1) Nystatin 5000-10,000 యునిట్లు kg weight.

(2) ketoconazol kg weight 10.mg చొప్పున నోటి ద్వారా 20-30 days ఉపయోగించవలసి ఉంటుంది.

వ్యాధి గ్రస్త పశువును మంద నుండి వేరుచేయాలి. పశువులకు సమతుల్యమైన ఆహారంను అందజేయాలి. అంటిబయోటిక్లు మరియు స్టిరాయిడ్ ఔషధాలు ఎక్కువ కాలం ఉపయోగించరాదు. బూజు పట్టిన ఆహారంను పశువులకు ఇవ్వకూడదు.

Also Read: Mosquito Coil Smoke: దోమల పోవడానికి కాల్చే మస్కిటో కాయిల్ పొగ పీలుస్తున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడుతున్నట్టే!

Leave Your Comments

Typhoid Prevention: వర్షాకాలంలో వచ్చే ఈ వ్యాధి నుండి దూరంగా ఉండాలంటే.. ఇవి పాటించండి.!

Previous article

PJTSAU Diploma 2022 – 23: వ్యవసాయ విశ్వవిద్యాలయంలో డిప్లోమా కోర్సులలో మిగిలిన సీట్ల భర్తీకై నోటిఫికేషన్.!

Next article

You may also like