Calf De- Horning: దూడలలో కొమ్ములను తొలగించుట:- దూడలలో కొమ్ములను తొలగించడాన్ని “De- Horning” అంటారు. ఈ క్రింది పద్ధతుల ద్వారా దూడలలో కొమ్ములను తొలగించవచ్చు.
రసాయనిక పద్ధతి (Chemical Method):- పొటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణమును చిక్కటి పేస్టుగా చేసి హార్న్ బడ్స్ పైన రుద్దాలి. ఈ విధంగా తిరిగి చేయుట వల్ల కొమ్ములు పెరగ కుండా ఉంటాయి. దీనిని బ్లడ్ లెస్ మెథడ్ అని అంటారు.
హాట్ ఐరన్ పద్ధతి (Hot Iron Method):- ఇందులో ఇనుప కడ్డీని ఏర్రగా కాల్చి కొమ్ము మొనలపై ” 3 or 5 సెకనులు” ఉంచాలి. హార్న్ సెల్స్ నాశనమై కొమ్ము పెరగకుండా ఉంటుంది. కాల్చేటప్పుడు ఐరన్ రాడ్ చర్మం కంటే లోతు పోకుండా పుర్రె ఎముకకు గాయం కాకుండా జాగ్రత్త వహించాలి. దీనిని కూడా బ్లడ్ లెస్ మెథడ్ (Blood less Method) అని అంటారు.
మోకానికల్ పద్ధతి (Mechanical method):- డి హార్నార్ లేదా ఎలాస్టేటర్ లేదా రబ్బర్ బ్యాండ్ వంటివి ఉపయోగించి Rubber band కొమ్ములను తొలగించుట. కొమ్ములు క్రింద ఉన్న చర్మపు ప్లాప్ను పొరలాగా లాగి కొమ్ము మొదలును రంపంతో కోసి కొమ్ములను తీసివేయవచ్చు లేదా Rubber bands కొమ్ముల మొదలులో చర్మంపైన గట్టిగా కట్టి ఉంచిన యెడల కొమ్ములకు రక్త సరఫరా జరగక కొమ్ములు ఊడిపోతుంది. ఈ పద్దతులనే మెకానికల్ పద్దతి అని అంటారు.
Also Read: Stiff Sickness in Cattles: ఆవులలో మూడు రోజుల అస్వస్థత వ్యాధి ఎలా వస్తుంది.!
దూడలలో కొమ్ములను తొలగించుట వలన కలుగు లాభాలు:
· దూడలు పెరిగేటప్పుడు కొమ్ములు పెరుగుట వలన పోట్లాడుకొనుటచే వాటికి గాయాలు అవుతాయి. కావున పుట్టినప్పటి నుంచే కొమ్ములను తొలగించుట వలన ఈ గాయాలు కాకుండా తప్పించగలo.
· పెరిగే వడ్డలకు లేదా పెద్దవైన ఆవులను సులువుగా Handing చేయుట ద్వారా అదుపులో పుంచుకోవచ్చు.
· పొడుగు కొమ్ములు ఉండుట వలన పశువులకు ఎక్కువ స్థలం అవసరమగును. కొమ్ములను తొలగించుట వలన Horn Cancer లాంటివి రాకుండా నివారించవచ్చు.
· ఈ విధంగా చేయుట వల్ల క్రమేణా పోట్లాడే తత్వాన్ని మందలో లేకుండా చేసుకోవచ్చు.
Also Read: De- Horning in Cattle: దూడలలో కొమ్ములను తొలగించుటలో మెళకువలు.!