పశుపోషణ

Backyard Poultry Farming: పెరటికోళ్ల పెంపకం.!

1
Backyard Poultry Farming in India
Backyard Poultry Farming in India

Backyard Poultry Farming: పెరట్లో సాధారణంగా నాటు కోళ్లను పెంచుకుంటారు. నాటుకోళ్లలో ఉత్పాదక శక్తి తక్కువ. పుంజులు 2.5-3.5కి, పెట్టలు 1.5 -1.8 కి. వరకు బరువు పెరుగుతాయి. సాలిన పెట్టలు 40-50 గుడ్లను మాత్రమే పెడతాయి. వీటిలో పొదిగే లక్షణం ఎక్కువ. కొక్కెర, మాశుచి వ్యాధులు సోకినప్పుడు 40-60 శాతం దాకా చనిపోతాయి. ఇంటి పరిసరాల్లోని, వంటింట్లోని ఆహార పదార్థాల్ని తిని పెరుగుతాయి గనుక వీటి మాంసం, గుడ్లలో ఎలాంటి పురుగు మందుల అవశేషాలు ఉండవు. అందుకే వీటికి డిమాండ్ పెరుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని నాటుకోళ్లను సంకరపరిచి పెరట్లో లాభసాటిగా పెంచుకునే కోళ్ల రకాలను అభివృద్ధి చేశారు.

రాజశ్రీ:- పశువైద్య కళాశాల తిరుపతి, రాజేంద్రనగర్ లో లభిస్తాయి. 160 రోజుల నుంచి గుడ్లు పెట్టడం మొదలెట్టి సాలిన 180 గుడ్లు పెడతాయి. గుడ్లు బరువు 53 గ్రా.

వనరాజు,గ్రామప్రియ, కృషిబ్రో:- ఈ మూడు రకాలు కోళ్లు హైదరాబాద్ లోని కోళ్ల ప్రాజెక్టులో లభిస్తాయి. వనరాజు కోళ్లు 130-150 రోజుల నుంచి గుడ్లు పెట్టడం మొదలెట్టి సాలిన 140-150 గుడ్లు పెడతాయి. గుడ్లు 55-63 గ్రా బరువుంటుంది. గ్రామప్రియ కోళ్లు 150 రోజుల వయసు నుంచి మొదలెట్టి సాలిన 160-180 గుడ్లు పెడతాయి. కృషిబ్రో రకం పెరట్లో పెంచటానికి అనువైన బ్రాయిలర్ కోడి రకం.

Also Read: Avian Encephalomyelitis in Poultry: కోళ్ళలో ఎవియన్ ఎన్సెఫలోమైలైటిస్ వ్యాధి ఎలా వస్తుంది.!

Backyard Poultry Farming

Backyard Poultry Farming

గిరిరాజు, స్వర్ణధార:- ఈ రెండు రకాల కోళ్లు కె. వి. ఎ., ఎఫ్. ఎస్. ఓ, బెంగళూర్ వారి వద్ద లభిస్తాయి. 150 రోజుల వయసు నుంచి గుడ్లు పెట్టడం ప్రారంభించ సాలీన గిరిరాజు రకం 160-170 స్వర్ణధార రకం 180-190 గుడ్లు పెడతాయి. ఇజత్ నగర్ లోని సెంట్రల్ ఏవియేషన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు క్వారినిర్ బిక్, క్వారిశ్యాము, హిట్ క్వారి కోళ్ల రకాలను అభివృద్ధి చేశారు.

అభివృద్ధి చేసిన పెరటికోళ్లు ఎక్కువ బరువు తుగతాయి. ఆకర్షణియంగా ఉంటాయి. గుడ్లు ఉత్పత్తి, వ్యాధి నిరోధికశక్తి ఎక్కువ. సాలిన 160-180 గుడ్లు పెడతాయి. 3.5 నుంచి 4.5కిలోల బరువు తుగతాయి. ఐదు, ఐదున్నర మాసాల వయసు నుంచి గుడ్లు పెట్టడం ప్రారంభిస్తాయి. ఈ కోళ్లు గుడ్లును పొదగలేవు గనుక దేశీయ కోళ్లతో లేదా ఇంక్యూబేటర్ తో పొదిగించాలి.

వ్యాధులు:- ఆరుబయట తిరిగే కోళ్లలో అంతర పరాన్నజీవుల నివారణకు ప్రతి 2 నెలలకోసారి డీవార్మింగ్ మందులు వాడాలి. ఒక రోజు వయసు కోడిపిల్లకు మెరెక్స్ టీకా, 7 వ రోజు ఆర్. డి. టీకాను వేయాలి. ప్రతికోడికి 3-4 గ్రా. చొప్పున సున్నపురాయి పొడి లేదా అల్చిప్పల పొడి అందిస్తే తగినంత కాల్షియం లభించడంతో తోలు గుడ్లు పెట్టావు. పేలు నివారణకు బుటాక్స్ మందునీళ్లు షెడ్లో పెట్టాలి.

Also Read: Avian Leukosis Complex in Poultry: కోళ్ళలో ఎవియన్ ల్యూకోసిస్ కాంప్లెక్స్ వ్యాధిని ఇలా నివారించండి.!

Leave Your Comments

Minister Niranjan Reddy: మంత్రి నిరంజన్ రెడ్డితో బ్రిటీష్ డిప్యూటీ హై కమీషనర్ భేటీ.!!

Previous article

Fruit Plants Planting Methods: పండ్ల మొక్కలు నాటే విధానం – పద్ధతులు.!

Next article

You may also like