పశుపోషణమన వ్యవసాయం

Avian Leukosis Complex in Poultry: కోళ్ళలో ఎవియన్ ల్యూకోసిస్ కాంప్లెక్స్ వ్యాధిని ఇలా నివారించండి.!

0
Avian Leukosis Complex in Poultry
Avian Leukosis Complex in Poultry

Avian Leukosis Complex in Poultry: లక్షణాలు – వ్యాధి బారిన పడిన పక్షులు బద్ధకంగా, నీరసంగా ఉండి, కుంబ్ పాలిపోయి ఉంటుంది. కోళ్ళు రోజు రోజుకు బలహీన పడిపోతూ చివరికి చనిపోతూ ఉంటాయి. అంతర్గత అవయవాలలో కలుగు మార్పులను అనుసరించి ఈ వ్యాధిని ఈ క్రింది విధంగా విభజించవచ్చు.

Lymphomatosis and Myeloblastosis:- కోళ్ళ యొక్క కుంబ్ పాలిపోయి మరియు సైనోటిక్గా మారి ఉంటుంది. కాలేయం మరియు ప్లీహము, బర్సా మరియు మూత్ర పిండాల పరిమాణం పెరిగి ఉంటుంది. కాలేయం పైన గడ్డలుంటాయి. డయేరియా ఉంటుంది. రక్తము గడ్డ కట్టడము వలన ఫెధర్ ఫాలికల్స్ క్రింద హిమరేజెస్ను గమనించవచ్చు.

Erythroblastosis:- ఈ దశలో కూడా లక్షణాలు లింఫోమాటోసిస్ను పోలి ఉంటుంది. అనీమియా లక్షణాలుండుట వలన కోళ్ళు పాలిపోయినట్టుగా ఉంటాయి.

Nephroblastoma:- ఇది చాలా అరుదుగా కోళ్ళలో వస్తుంటుంది. ఇందులో స్కియాటిక్ నరాలు దెబ్బతినడం వలన పక్షవాతం లక్షణాలు గమనించవచ్చు.

Fibrosarcoma:- ఈ దశ కూడా అరుదుగా కనిపిస్తుంది. అంతర్గత అవయవాల నిర్మాణం పూర్తిగా దెబ్బతిని, అల్సర్స్ ఏర్పడి ఉంటాయి. సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ మూలంగా టాక్సిమియా, హిమరేజ్ వంటి లక్షణాలతో పక్షులు కొన్ని రోజులకే చనిపోతుంటాయి.

Avian Leucosis Complex in Poultry

Avian Leucosis Complex in Poultry

Also Read: Marek’s Disease in Poultry: కోళ్ళలో మారెక్స్ వ్యాధి లక్షణాలు ఇలా గుర్తించండి.!

Osteopetrosls:- దీనిని థిక్ లెగ్ డిసీజ్ (Thick leg disease) లేదా మార్బల్ బోన్ డిసీజ్ (Marble bone disease) అని కూడా అంటారు. వింగ్ మరియు కాళ్ళ ఎముకలలోని డయాఫైసియల్ మరియు ఎపిఫైసియల్ కార్టిలేజ్లోని కణాలు సక్రమంగా పెరగకపోవడం వలన ఎముకలు (బోని గ్రోత్) మందముగా పెరిగినట్టు కనిపిస్తుంటాయి.

లింఫోమాటోసిస్లో కాలేయ పరిమాణం పెరిగి, వాటి ఉపరితలము పైన గడ్డలను కలిగి ఉంటుంది. ప్లీహము Ping Pong ball మాదిరిగా పెరిగి ఉంటుంది. అండాశయం క్యాలి ఫ్లవర్లాగా మారి ఉంటుంది. ఎరిత్రో బ్లాస్టోసిస్లో పింకిష్ గ్రే గడ్డలను పిండాలలో గమనించవచ్చు. ఫైబ్రోసార్కోమాటో శరీరం మొత్తం గడ్డలను గమనించవచ్చు. కొన్ని సందర్భాలలో ఇవి అల్సరేటెడ్గా మారి ఉంటాయి. ఆస్టియోఫెట్రోసిస్లో మామూలు ఎముకలు నునుపుగా మెత్తగా తయారై ఉంటాయి..

వ్యాధి చరిత్ర, లక్షణాలు, వ్యాధి కారక చిహ్నముల ఆధారంగా ఈ వ్యాధిని కొంత వరకు నిర్ధారించవచ్చు. శవ పరీక్ష మరియు హిస్టా ఫాథాలాజికల్ మార్పుల ఆధారంగా ఈ వ్యాధిని సులువుగా నిర్ధారించవచ్చు. నాన్ ప్రొడ్యూజర్ టెస్ట్ (NP), ఫ్లోరోసెంట్ అంటీబాడి టెక్నిక్, సీరమ్ స్యూటిలైజేషన్ టెస్ట్, ఆర్ జెల్ ప్రిసిపిటేషన్ టెస్ట్, ELISA వంటి ప్రయోగశాల పరీక్షల ఆధారంగా ఈ వ్యాధిని ఖచ్చితంగా నిర్ధారించవచ్చు. ఈ వ్యాధిని మారెక్స్ వ్యాధితో పాల్చుకొని సరిచూసుకోవలసి ఉంటుంది.

ఈ వ్యాధికి సరియైన చికిత్స లేదు. సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఏదీని ఒక అంటీ బయోటిక్ పౌడర్ను నీటి ద్వారా కోళ్ళకు అందించవలసి ఉంటుంది.

నివారణ:- వ్యాధితో వున్న కోళ్ళను మరియు అంతకు ముందు వ్యాధి వచ్చి తగ్గిన వాటిని వేరు వేయాలి. చనిపోయిన కోళ్ళను సరియైన పద్ధతిలో పూడ్చిపెట్టాలి. ఈ వ్యాధికి ఇప్పటివరకు ఎటువంటి టీకాను కనిపెట్టలేదు.

Also Read: Turkey Bird Farming: టర్కీ కోళ్ళ పెంపకంలో మెళుకువలు.!

Leave Your Comments

Dairy Animals: పాడి పశువుల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.!

Previous article

Bucket Sprayer: బకెట్ స్ప్రేయరు ఎలా పనిచేస్తుంది.!

Next article

You may also like