Animal Lover: 14 ఏళ్ల ప్రజ్ఞాశ్రీ ఉగాండాలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో 9వ తరగతి చదువుతోంది. చాలా జంతువులను చిన్న వయస్సులోనే దత్తత తీసుకోని అలనా పాలన చూసుకుంటుంది. ఈ చిన్నారి ఏ కార్యక్రమం జరిగినా.. ఏ సందర్భమైనా.. స్కూల్ నుంచి లీడర్ల వరకు అందరి ప్రశంసలు అందుకుంటోంది. అకడమిక్ గా తనకు గణితం, సైన్స్ అంటే చాలా ఇష్టమని.. అలాగే సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటానని.. సవాళ్లను స్వీకరిస్తానని చెబుతోంది ప్రజ్ఞాశ్రీ.
ప్రజ్ఞాశ్రీ (Pragna Sree Story).. ఖాళీ సమయాల్లో వివిధ దేశాలకు వెళుతుంది. పాఠశాల స్థాయిలో జరిగే ఫుట్‌బాల్ మరియు బాస్కెట్‌బాల్ వంటి జట్లలో చురుకైన పాత్ర పోషిస్తుంది.చెస్ మరియు క్యారమ్స్ ఆడతానని అంటుంది శ్రీ. తన కెరీర్‌లో అత్యున్నత స్థానానికి చేరుకోవడానికి ఎప్పటికప్పుడు సరికొత్త విషయాలను నేర్చుకోవాలని ఎంతో ఉత్సుకతతో ఉంటానని చెప్పింది. ఆమె ప్రకృతిలో అందమైన వస్తువులను చూసినప్పుడల్లా ఫోటోలు తీసుకోవడం నాకు చాలా ఇష్టం.
ఈ చిచ్చర పిడుగు చిన్నతనంలోనే జంతువులపై ప్రేమ పెంచుకుంది. ఇంట్లో ఒక తాబేలు, మూడు కుక్కలను పెంచుకుంటుంది. అలాగే జూలో ఏనుగు, సింహం పిల్లలను దత్తత తీసుకున్నారు. ఏనుగుకు ప్రగ్యా, తాబేలుకు మధు మరియు సింహానికి శ్రీ అనే పేర్లు కూడా పెట్టారు. లయన్ క్లబ్‌ను కూడా దత్తత తీసుకున్నారు. ఇవి జీవితంలో మరిచిపోలేనివని చెప్తుంది ఆ చిన్నారి.
కాగా.. ప్రజ్ఞ చేస్తున్న పనులకు ఆ దేశ అధ్యక్షుడు యొవేరి కటుగా ముసవేనిని ఆకట్టుకున్నాయి.అయితే భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉగాండ పర్యటన చేపట్టారు. ఈ క్రమంలోప్రజ్ఞకి అరుదైన అవకాశం లభించింది. ప్రధాని మోదీకి పూలగుచ్ఛం అందించి ఆహ్వానం పలకాలంటూ ప్రజ్ఞని ఆ దేశ అధ్యక్షుడు ముసవేని కోరారు. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొల్పే ఆ కార్యక్రమంలో ఉగాండ జాతీయ గీతం ఆలపించి ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ప్రజ్ఞా. ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ఫొటో దిగిన చిన్నారి ఇది మరపురాని క్షణం, గర్వించదగిన క్షణం అంటూ ఆమె తన బ్లాగ్‌లో రాసింది. ఇక ఆమెను రాష్ట్రపతి కూడా ప్రశంసించారు.
Also Read: బాగా చదివితే పందులు గిఫ్ట్స్
ఇటీవల సేవా కార్యక్రమాలు అందిస్తూ 18 ఏళ్ల ప్రవాస భారతీయురాలైన గడ్డం మేఘనా నామినేటెడ్ ఎంపీగా న్యూజీలాండ్ చట్టసభకు ఎంపికైంది. ఈ తరుణంలో మరిన్ని దేశాల్లో ప్రవాస భారతీయులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలనే ఆకాంక్ష ఇండియన్లలో కనిపిస్తోంది.అదేవిధంగా ఆ దేశంలో అంటువ్యాధి సమయంలో స్టేట్ హౌస్‌లో జరిగిన కార్యక్రమాలలో నృత్య ప్రదర్శనలో వచ్చిన బహుమతి, తన వ్యక్తిగత పొదుపు మొత్తాన్ని జంతు సంరక్షణకు విరాళంగా ఇచ్చింది. ప్రజ్ఞాశ్రీ నిధిని నేరుగా ఉగాండా అధ్యక్షుడికి అందించినందుకు ప్రశంసించారు. రోటరీ ఇంటర్నేషనల్ ఆఫ్రికా పీస్ కాన్సర్ట్ నిర్వహించిన నిధుల సేకరణ కార్యక్రమంలో ప్రజ్ఞాశ్రీ కూడా పాల్గొన్నారు.
Also Read: దీని ధర తెలిస్తే షాక్ అవుతారు..