పశుపోషణమన వ్యవసాయం

Age Determination in Cows: పాడి పశువుల వయస్సు నిర్ధారించుట.!

2
Age Determination in Cows
Age Determination in Cows

Age Determination in Cows: పొడి పశువుల వయస్సును ఎందుకు నిర్ధారించాలి?

  • పశువుల కొనుగోలుకు మరియు కొనుగోలు సమయంలో ధరను నిర్ధారించుటకు,
  • పాడి పశువులకు ఇన్సూరెన్స్ చేయించుటకు,
  • పాడి పశువుల బ్రీడింగ్ కొరకు,
  • పాడి పశువుల పని సామర్థ్యం తెలుసుకొనుటకు,
  • కొన్ని సందర్భాలలో పాడి పశువుల వయస్సును బట్టి ” మందు” తగు మోతాదులో ఇవ్వవలసి యుంటుంది.
Age Determination in Cows

Age Determination in Cows

Also Read: Actinomycosis Disease in Cows: ఆవులలో వచ్చే దవడవాపు వ్యాధియాజమాన్యం.!

పొడి పశువులలో వయస్సును తెలుసుకొను పద్ధతులు –

Physical Appearence: పశువుల చర్మం నునుపుగా మరియు నిగనిగలాడుతూ వున్నచో దాని వయస్సు తక్కువగా వున్నట్లు తెలుసుకోగలము. పాడి పశువుల వయస్సు పెరిగే కొలది వాటి చర్మం గరుకుగాను, ముడతలు పడి వాటి వయస్సు ఎక్కువగా వున్నట్లు కనిపిస్తుంటుంది.

Horn Ringsను బట్టి: కొమ్ము మీద ఉన్నటు వంటి వలయాలను బట్టి కూడా పాడి పశువుల వయస్సును నిర్ణయించగలం. దీనికి ఈ క్రింది ఫార్ములాను ఉపయోగించవలసి యుంటుంది.

Muzzle Pritonetry: ఈ పద్దతి ద్వారా వయస్సును నిర్ధారించవచ్చు ముట్టె యొక్క సైజును రంగులోని మార్పులని బట్టి నిర్ణయించవచ్చు.

దంతాలను బట్టి (Teeths): దంతాలను బట్టి ఈ క్రింది రకాల దంతాల ద్వారా నిర్ధారించవచ్చు.

Incissors: ఇందులో Central, Medial, lateral మరియు Corners అను నాలుగు రకాల దంతాలు ఇరు వైపులా దవడలో వుంటాయి.

Canines: ఇవి చీల్చే దంతాలు. ఇవి పాడి పశువులలో వుండవు.

Molars & Pre Molars:- ఇవి నమిలే దంతాలు. పాడి పశువులలో పాల దంతాలు రాను రాను ఊడిపోయి, వాటి స్థానంలో శాశ్వత దంతాలు ఏర్పడును.

Incissors & Centrals:- 1 1/2 -2 సంవత్సరాల వయస్సులో పాల పండ్లు ఊడి శాశ్వత దంతాలు వచ్చును.

Medials:- 22 1/2 సంవత్సరాల వయస్సులో పాల పండ్లు ఉండి శాశ్వత దంతాలు వచ్చును.

Laterals:- 3 సంవత్సరాల వయస్సులో పాల పండ్లు ఊడి శాశ్వత దంతాలు వచ్చును.

Corners:- 3 1/2 4 సంవత్సరాల వయస్సులో పాల పండ్లు ఊడి శాశ్వత దంతాలు వచ్చును.

Pre Molars: మొదటి జత 2-2 1/2 సంవత్సరాల లోపు పాల దంతాలు ఊడి శాశ్వత దంతాలు వచ్చును. రెండవ జత 2 1/2-3 1/2 సంవత్సరాలలోపు పాల దంతాలు ఊడి శాశ్వత దంతాలు వచ్చును.

Molars: మొదటి జత 5-6 Months వయస్సులో పాల దంతాలు ఊడి శాశ్వత దంతాలు వచ్చును. రెండవ జత 1 1 1/2 సంవత్సరాల వయస్సులో పాల దంతాలు ఊడి శాశ్వత దంతాలు వచ్చును. మూడవ జత 2 – 2 1/2 సంవత్సరాల వయస్సులో పాల దంతాలు ఊడి శాశ్వత దంతాలు వచ్చును.

సాధారణంగా Incissors ను బట్టి వయస్సును నిర్ధారించుదురు. పశువుకు 4-5 సంవత్సరాల లోపల అన్ని శాశ్వత దంతాలు వస్తాయి. దీనిని ” Full Mouth” పశువు అంటారు. 11-12 సంవత్సరాల వయస్సులో దంతాలలో చాలా మార్పులు జరుగుటను బట్టి పండ్ల పై table surface అండాకృతి నుండి చతురస్రాకారంగా మారును. తర్వాత రానురాను వదులుగా అయ్యి రాలిపోవును. దంతాలన్నియు రాలి పోయిన పశువును “Gummers” అని అంటారు.

Also Read: Haemorrhagic Septicemia Disease in Buffalo: గేదెలలో వచ్చే గొంతువాపు వ్యాధి యాజమాన్యం

Leave Your Comments

Banana Harvesting: అరటి గెలలను కోసిన తరువాత తీసుకోవలసిన జాగ్రత్తలు.!

Previous article

Colibacillosis in Cattle Symptoms: ఆవులలో వచ్చే కోలిబాసిల్లో సిస్ వ్యాధి నివారణ చర్యలు.!

Next article

You may also like