African Swine Fever – లక్షణాలను ఇలా గుర్తు పట్టండి: ఇది పందుల్లో కలుగు అత్యంత ప్రాణాంతకమైన అంటు వ్యాధి. ఈ వ్యాధి లక్షణాలు స్వైన్ ఫీవర్ వ్యాధిని పోలినప్పటికి వ్యాధి తీవ్రత మరింత అధికంగా ఉంటుంది. ఈ వ్యాధిని 1957 వ సంవత్సరంలో ఆఫ్రికా దేశంలో మొట్ట మొదటి సారిగా కనుగొన్నారు. ప్రస్తుతం ఈ వ్యాధి అన్ని దేశాలలోని పందులలో ప్రబలుతుంది. వ్యాధి కారకం: ఇది ఇరిడో విరిడే కుటుంబానికి చెందిన ఇరిడో వైరస్ వలన కలుగుతుంది. అడవి మరియు సాధారణ పందులు. అడవి పందుల్లో ఈ వ్యాధి (carrier) క్యారియర్ దశలో ఉంటుంది.ముక్కు నుండి, కంటి నుండి, గర్భాశయం నుండి కారే స్రావాలతో కలుషితమైన ఆహారం తీసుకున్నప్పుడు, పిడుదుల ద్వారా, అంటువ్యాధిలా ఒక పంది నుండి మరొక పంది కి వ్యాపిస్తుంటుంది.
వ్యాధి వ్యాప్తి చెందు విధానం:- పై మార్గాల ద్వారా వైరస్ టాన్సిల్స్ మరియు జీర్ణాశయంలోని లింఫ్ గ్రంథుల్లో చేరి, తరువాత రక్తంలో చేరి పైరిమియాగా మారుతుంది. ఈ వైరస్ ప్రధానంగా రక్తనాళాలలో ఉండే ఎండోథీలియం కణాలను నాశనం చేయుట వలన, రక్త నాళాలు తెగి, అంతర్గత అవయవాల్లో రక్తస్రావం. జరగడం, నీరు చేరడం వంటి లక్షణాలు కలుగుతాయి. ఫలితంగా ఇన్ఫెక్షన్స్ కలగడం జరుగుతుంటుంది.
లక్షణాలు:- ఈ వ్యాధిలో ఇంక్యుబేషన్ పీరియడ్ 2 నుండి 4 రోజుల వరకు ఉంటుంది. మార్పిడిటీ 100% వుండి, మోర్టాలిటీ 50-100% వరకు నమోదవుతూ ఉంటుంది. తీవ్రమైన జ్వరం, ఆహారం తీసుకోకపోవడం, నడవలేక పోవుట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, దగ్గు, కంటి నుండి మరియు ముక్కు నుండి నీరు కారుతూ ఉండడం, కొన్ని సందర్భాలలో వాంతులు మరియు విరోచనాలు వంటి లక్షణాలు ఉంటాయి.
వ్యాధి లక్షణాలు బయటపడిన తరువాత 4 నుండి 7 రోజుల్లో పందులు చనిపోతుంటాయి.వర్మం క్రింద ఎర్రగా కందిపోయిన మచ్చలను చూడవచ్చు. ఇది ఎక్కువగా చెవులు, కాళ్ల అంచులు, పొట్ట క్రింది భాగాలలో చూడవచ్చు. ఊపిరితిత్తులలో నీరు చేరి, న్యూమోనియా లీషను న్ను చూడవచ్చు. మిగిలిన అన్ని అంతర అవయవాలలో హిమరేజస్ మరియు ఎడిమాని చూడవచ్చు.
రైతు తెలిపే వ్యాధి చరిత్ర ఆధారంగా, పైన వివరించిన వ్యాధి లక్షణాలు మరియు వ్యాధి కారక చిహ్నముల ఆధారంగా, ఈ క్రింది ప్రయోగశాల పరీక్షల ఆధారంగా ఈ వ్యాధిని నిర్ధారించవచ్చు. TELISA, FAT, AGID. ఈ వ్యాధిని హాక్ కలరా (స్వైన్ ఫీవర్) మరియు స్వైన్ ఎరిసిపెటస్ వ్యాధులతో సరిపాల్చుకోవలసి ఉంటుంది.
చికిత్స:- ఈ వ్యాధికి ఎటువంటి చికిత్స లేదు. వ్యాధి లక్షణములకు అంటి పైరెటిక్స్, అంటీ ఎమిటిక్స్, అంటి డైయేరియల్స్ మరియు సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఏదేని ఒక అంటి బయోటిక్తో ప్రయత్నం వేయవచ్చు. ఫలితం తక్కువగా ఉంటుంది.
నివారణ:- వ్యాధి వచ్చిన వందులను వేరు చేసి వద చేయుట ఉత్తమం. కొత్తగా కొనుగోలు చేసిన పందులను వెంటనే మందలోకి కలపరాదు.పందుల ఫారాలలోకి మనుషులు, వాహానములు, ఇతర పశువుల రాకపోకలను నియంత్రించాలి. బాహ్య పరాన్న జీవులను ఎప్పటికప్పుడు నిర్మూలిస్తూ ఉండాలి.ఈ వ్యాధికి పూర్తి స్థాయిలో పనిచేసే టీకా లేదు.
Also Read: Japanese Encephalitis in Pigs: పందుల లో జపనీస్-బి ఎన్ సెఫలైటిస్ వ్యాధి ని ఇలా నయం చెయ్యండి.!