పశుపోషణ

African gall Sickness in Cattles: పశువులలో వచ్చే ఆనాప్లాస్మోసిస్ వ్యాధి ని ఇలా నయం చెయ్యండి.!

0
African gall Sickness
African gall Sickness

African gall Sickness in Cattles: పశువులలో రికేన్షియల్ పరాన్నజీవుల వలన కలుగు అతి ముఖ్యమైన వ్యాధి. ఈ వ్యాధిలో జ్వరం, తీవ్రమైన రక్తహీనత మరియు కండరాల బలహీనత ఉంటుంది.ఇది అనాప్లాస్మా మార్జినేల్ అనే రీకెట్సియల్ పరాన్నజీవి వలన కలుగుతుంది. ఇవి ఎర్రరక్తకణంలో ఇన్ూజేన్ బాడి దశలో ఉంటుంది. ఇవి బైనరీ ఫిజన్ పద్ధతిలో సమ విభజన చెందుతాయి.

విదేశి మరియు సంకర జాతి పశువులు, గొర్రెలు ఈ వ్యాధి బారిన ఎక్కువగా పడుతుంటాయి. కొన్ని సందర్భాలలో ఈ వ్యాధి మేకలు, ఒంటె, జింకలు వంటి పశువులలో కూడా కలుగుతుంది.

వ్యాధి వచ్చు మార్గం :- టబానస్, స్టామాక్సిస్ మరియు దోమ కాటు వలన, డీ హర్నింగ్, కాస్ట్రేషేన్, వాక్సినేషన్ మరియు చెవులకు ఇన్సూరెన్స్ రింగులు వేసినప్పుడు అయ్యే గాయాల ద్వారా,తల్లి నుండి బిడ్డకు మాయ ద్వారా ఈ వ్యాధి ఆరోగ్యంగా ఉన్న పశువులకు వ్యాపిస్తుంటుంది. వ్యాధి కారకం ప్రధానంగా రక్తకణంలో ఉండుట వలన, వాటిని తెల్ల రక్త కణాలు ఫాగోసైటోసిస్ చేయుట వలన ఎర్ర రక్తకణాల సంఖ్య తగ్గిపోవడం ఫలితంగా రక్తహీనత కలగడం, జాండీస్ లక్షణాలు వంటివి జరుగుతుంటుంది.

African gall Sickness in Cattle

African gall Sickness in Cattle

Also Read: Managing Bird Damage in Crops: వివిధ పంటలలో పక్షుల వలన కలిగే నష్టం మరియు వాటి యాజమాన్యం.!

వ్యాధి లక్షణాలు :- ఈ వ్యాధి అతి తీవ్రమైన దశ నుండి సాధారణ దశ వరకు ఉంటుంది. తీవ్రమైన దశలో జ్వరం, ముక్కు నుండి నీరు కారుతుండడం, కంటి నుండి నీరు కారుతుండడం, ఆకలి లేకపోవుట, డిస్స్నియా వలన రేల్స్ శబ్దాలు, రుమినల్ ఏటిని (అర్రల పొట్ట పూర్తిగా కదలక పోవుట), చర్మం పొడి బారడం, డీహైడ్రేషన్ లక్షణాలు, పాలిపోయిన కంటి పొరలు, కండరాల వణుకు, లింఫ్ గ్రంథుల వాపు, పళ్ళు కొరకడం వంటి లక్షణాలు ఈ వ్యాధిలో ప్రధానంగా ఉంటాయి.అన్ని అంతర్గత శరీర భాగాలలో జాండీస్ వర్ణకం పేరుకుపోవటం వలన పసుపు రంగులో కనిపిస్తుంటాయి. కాలేయం పరిమాణం పెరిగి యుంటుంది. పెరికార్డియపు పొరలలో హిమోరేజెస్ ఉంటుంది.

చికిత్స: వ్యాధి చరిత్ర, వ్యాధి లక్షణాలు, వ్యాధి కారక చిహ్నములు మరియు రక్తపు స్మియర్ను తీసుకొని జీమ్సా లేదా లీష్మన్స్ వర్ణకంతో స్టెయిన్ చేసి వ్యాధి కారకాన్ని గుర్తించవచ్చు. ఈ వ్యాధిని బేబిసియా, థైలేరియా మరియు లెప్టోస్పైరా వంటి వ్యాధులతో సరిపోల్చుకొని చూసుకోవలసి ఉంటుంది.వ్యాధికారకాన్ని నిర్మూలించుటకు టెట్రాసైక్లిన్ అంటిబయోటిక్ ఔషధాలను కి.లో బరుపుకు 10-15 మి.గ్రా. చొప్పున కండరాలలోకి లేదా సిరలలోకి 3-5 రోజులు ఇచ్చినట్లైతే మంచి ఫలితం ఉంటుంది. బెర్నిల్ ఔషధమును కూడా ఇవ్వవచ్చు. వీటితో పాటు లివర్ ఎక్స్ట్రాక్ట్స్, హిమాటానికి డ్రగ్స్, మినరల్ మిక్షర్స్ వంటి ఇచ్చినట్లైతే పశువులు త్వరగా కోలుకుంటాయి.బాహ్య పరాన్న జీవులను ఎప్పటికప్పుడు నిర్మూలిస్తుండాలి. వ్యాధి బారిన పడిన పశువులను మంద నుండి వేరు చెయ్యాలి.

Also Read: Toxoplasmosis in Cattles: పశువులు మరియు గేదెలలో టాక్సోప్లాస్మోసిస్ వ్యాధి ఎలా వస్తుంది.!

Also Watch:

Must Watch:

Leave Your Comments

Managing Bird Damage in Crops: వివిధ పంటలలో పక్షుల వలన కలిగే నష్టం మరియు వాటి యాజమాన్యం.!

Previous article

Sprayers Used in Agriculture: పంటలలో ఉపయోగించే వివిధ రకాల స్ప్రేయర్లు.!

Next article

You may also like