పశుపోషణ

Goat Rearing: మేకల పెంపకం లో రైతులకు మెళుకువలు.!

0
Goats
Goats

Goat Rearing: మన రాష్ట్రంలో చిన్న, సన్నకారు రైతులు, పేదలు ముఖ్యంగా గ్రామీణవాసులు ఎక్కువగా మేకల పెంపకాన్ని చేపడుతున్నారు. మేకలు మాంసాన్నివ్వడమే కాకుండా ఎరువును కూడా ఇస్తున్నాయి. మేకలు అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకుంటాయి. ఏ ప్రాంతంలోనైనా మేకలను పెంచి మంచి ఆదాయాన్ని పొందవచ్చు. మేక మాంసానికి రాష్ట్రంలో మంచి రాకీ ఉండడం వలన, నిరుద్యోగులు, విద్యావంతులు కూడా మేకల పెంపకంపై ఆసక్తి చూపుతున్నారు. అయితే మేకల పెంపకంలో మంచి మెళకువలు, యాజమాన్య పద్ధతులు పాటించి శాస్త్రీయంగా పెంచినట్లయితే మంచి లాభాలను పొందవచ్చు.

Goat Rearing

Goat Rearing

మేకల ఎంపిక: తమ ప్రాంతానికి అనువైన, జాతి లక్షణాలుగల మేకలను ఎంపిక చేసుకోవాలి.మేకల మందను అభివృద్ధి చేయడానికి జాతి లక్షణాలు గల మేక పోతులను ఎంపిక చేయాలి.ఈతకు రెండు పిల్లలను ఈనే మేక జాతులను ఎంపిక. చేసుకోవాలి. * మేకలను కొనేటప్పుడు జాతి లక్షణాలను నిర్ధారణచేసుకున్న తర్వాత కొనాలి. మేకలను కొనేముందు వాటి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకోవాలి. అదేవిధంగా వాటికిచ్చిన వ్యాధి నిరోధక టీకాల వివరాలను తెలుసుకోవాలి. మేకలను కొనేటప్పుడు స్వయంగా పరిశీలించిన తర్వాత కొనాలి.

ప్రాముఖ్యత: మేకలను అనావృష్టి ప్రాంతాలలోను, వ్యవసాయానికి పనికిరాని బీడు భూములు, బంజరు భూములు, గుట్టలు,చిట్టడవులు మొ||గు ప్రాంతాలలో మేపుకోవచ్చు. » తక్కువ ఖర్చుతో మేకల పెంపకాన్ని చేపట్టవచ్చు. వ్యాధినిరోధకశక్తి మేకలలో ఎక్కువగా వుంటుంది.అన్ని ప్రాంతాలలో కూడ మేకల పెంపకాన్ని చేపట్టవచ్చు.బీడుభూములు, బంజరు భూములు, ముళ్ళ పొదలు, గుట్టలలో పెరిగే తుమ్మ చెట్ల ఆకులను కూడా మేపుకోవచ్చు. మేకల పెంపకాన్ని ఎవరైనా చేపట్టవచ్చు. అయితే శాస్త్రీయంగా కొన్ని మెళకువలు పాటించినట్లయితే మంచి ఆదాయాన్ని పొందవచ్చు.

Herd of Goats

Herd of Goats

మేకల రవాణా:మేకలను సంతలో తీసుకున్న తర్వాత రవాణా చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.రవాణాలో ఎక్కువ సమయం తీసుకున్నట్లయితే మధ్యలో అవి మేకలకు కావలసినంత మేత, మంచినీటిని ఇవ్వాలి. మేకలను వాహనాలలో ఎక్కించేటపుడు, దింపేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

గృహవసతి: మేకల పాకలను నీరు నిల్వని ఎత్తైన ప్రదేశాలలో నిర్మించాలి. • గాలి, వెలుతురు పాకలలోకి ధారాళంగా ప్రసరించేటట్లు ఉండాలి.తక్కువ ఖర్చుతో పాకలను నిర్మించుకోవాలి. పరిసరాలలో దొరికే ముడి సామాగ్రిని పాకల నిర్మాణానికి ఉపయోగించినట్లయితే ఖర్చును తగ్గించవచ్చు.మేకలకు సౌకర్యవంతంగా ఉండేటట్లు పాకలలో నీటి తొట్లను, దాణా తొట్లను ఏర్పాటు చేసుకోవాలి.

Also Read: Prevent Ring Worm in Goats : మేకలలో వచ్చే తామర వ్యాధి ని ఇలా నివారించండి.!

మేకలను వర్షాకాలంలో వర్షపు గాడ్పుల నుండి చలికాలంలో చలి తీవ్రత నుండి, చలి గాడ్పుల నుండి, ఎండాకాలంలో ఎండ వేడిమి, అధిక ఉష్ణోగ్రత బారి నుండి రక్షించేటట్లు కాలానుగుణంగా మేకలకు సౌకర్యవంతంగా ఉండేటట్లు ఏర్పాటు చేసుకోవాలి. పాకల చుట్టూ నీడనిచ్చే చెట్లను పెంచాలి.పాకల పైకప్పు భాగాన్ని తాటాకులతోగాని, సిమెంట్ రేకులతో గాని కప్పాలి. పాకలచుట్టు ఇనుప కంచెలను ఏర్పాటు చేసుకున్నట్లయితే మేకలను తోడేళ్ళు, కుక్కలబారి నుండి రక్షించవచ్చు. » మేకల సంఖ్యను బట్టి మేకలకు సౌకర్యవంతంగా ఉండేటట్లు పాకలను నిర్మించుకోవాలి.ఒక మేకపోతుకు 2 చ.మీ. ఆడ మేకకు 1 చ.మీ. మేక పిల్లకు 0.5 చ.మీ. స్థలం చొప్పున మేకల సంఖ్యను బట్టి పాకలను నిర్మించాలి.

మేత: మేకల శరీర బరువును బట్టి మేతను అందించాలి.పాకలలో ఉంచి పెంచినట్లయితే మిశ్రమదాణా, పచ్చిగడ్డిని మేతగా అందించాలి. సైలేజి (మాగుడు గడ్డి / పాతరగడ్డి)ని కూడా మేపవచ్చు.అందుబాటులో ఉన్న ముడి పదార్థాలను ఉపయోగించి దాణాను తయారు చేసుకున్నట్లయితే ఖర్చు తగ్గడమే కాకుండా నాణ్యమైన దాణాను మేకలకు ఇవ్వవచ్చు.మిశ్రమ దాణాను చేయడానికి మొక్కజొన్న గింజలు, జొన్నలు, వేరుశనగ చెక్క,గోధుమ తవుడు, వరి తవుడు, ఖనిజలవణ మిశ్రమం, సాధారణ ఉప్పు మొదలగు వాటిని ఉపయోగించి దాణాను తయారు చేసుకోవాలి.చూడి మేకలకు, విత్తనపు మేకలకు దాణాను అదనంగా ఇవ్వాలి.

మేకల పెంపకదారులు సంవత్సరం పొడవునా పచ్చిగడ్డి కొరకు బహువార్షిక పశుగ్రాసాలైన హైబ్రిడ్ నేపియర్ బాజ్రా రకాలైన ఎ.పి. బి.యన్.1, కో-4 మొదలగు రకాలను సాగు చేసుకోవాలి.పప్పుజాతి పశుగ్రాసాలైన లూసర్న్, బర్సీమ్ మొదలగు వాటిని సాగు చేయాలి. సాధారణంగా పప్పుజాతి పశుగ్రాసాలలో మాంసకృత్తులు అధికంగా ఉంటాయి. కాబట్టి మేకలకు పప్పుజాతి పశుగ్రాసాలను కూడా మేపాలి.

-Rakesh Jhadi
Ph.D. Research Scholar
Department of Agronomy
Bidhan Chandra Krishi Viswavidhyalaya
Contact no:9505410171

Also Read: Sore Mouth in Goats: మేకలలో ఆర్ఫ్ వ్యాధి ఎలా వస్తుంది.! 

Also Watch:

 

Leave Your Comments

How to Improve Immunity: రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి పాటించాల్సిన నియమాలు!

Previous article

Chilli Cultivation: మిరప నాటే రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.!

Next article

You may also like