పశుపోషణ

పశుపోషణలో ఖర్చుల తగ్గింపుకు 10 సూత్రాలు..

0

పాడి పశువుల పోషణ కోసం పాల ఉత్పత్తి పెంపుదలకై అయ్యే ఖర్చుల్లో సింహాభాగం దాణా, మేతలదే. సుమారు 70% ఖర్చు పాడి పశుపోషణకే ఈ ఖర్చు తగ్గితేనే, పాడి రైతుకు పాల ఉత్పత్తి, పాడి పశువుల పెంపకం లాభసాటిగా కనిపించే అవకాశం ఉంటుంది. ఈ దిశగా 10 సూత్రాల ఆచరణ కొంత మేరకు పాడి రైతుకు ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ సూచనలు చేయబడినవి.
పాడి పశువుల ఎంపిక:
జాతి లక్షణాల మేరకు పాడిపశువుల సామర్థ్యం వ్యక్తం కానిచో అది ఖర్చుకు దారి తీస్తుంది. పాల ఉత్పాదకత, సంతులిత ఆహారం తినగల స్థోమత, మార్కెట్ కు అనుగుణంగా పాల ఉత్పత్తి, యాజమాన్య పద్ధతుల ఆచరణనుసరించి పాడిపశువుల ఎంపిక చేసుకోవాలి.
పశుపోషణ ఖర్చు:
పాడిపశువు ఉత్పత్తి సామర్థ్యం రికార్డు పరిశీలన, ప్రణాళిక బద్ధంగా పశుగ్రాసాల పెంపకం, వీలైన చోట ఇతర ప్రభుత్వ పథకాల సహకారం తీసుకోవడం, అనుభవపూర్వక ఖర్చుల ప్రణాళిక పశుపోషణ ఖర్చుల వాస్తవిక రూపాన్ని మన ముందు ఉంచుతుంది.
పశు పోషకాల పరీక్ష:
సంతులిత ఆహారం అందేలా గ్రాసాల వ్యర్థాన్ని అరికట్టేలా పశుపోషకాల అంచనా వేయాలి. పశువుల ఆరోగ్య పరిస్థితి, ఉత్పాదకతలను అనుసరిస్తూ పశుదాణా మేపు చేపట్టాలి.
పశుదాణా ప్రత్యామ్నాయాలు:
స్థానికంగా లభించే వనరులతో దాణా తయారీ పశుదాణా ప్రత్యామ్నాయాలైన అజోల్లా లాంటి ఆహారాల మేత, పశువు ఆరోగ్యం, పాలఉత్పత్తికి సహకరించేలా పోషకాలు అందేలా ప్రత్యామ్నాయాలను వాడాలి.
దాణాను సుపోషకం చేయడం:
దాణాతో బాటు లవణ మిశ్రమాల వాడకం, గ్రోవైఫ్ ఫోర్ట్, అమినో పవర్ లాంటి దాణా అనుబంధాల వాడకం, పశువు సామర్థ్యాన్ని 20 – 50% పెంచగలవు.
దాణా వ్యర్థాన్ని తగ్గించడం:
ఎండుగడ్డి, గింజలు నేలపై వేసి మేపరాదు. వ్యర్థం తగ్గేలా పశుగ్రాస కత్తిరింపు యంత్రాల వాడకం చేపట్టాలి. పశుగ్రాస మేంజర్లను నిర్మించి దానితో పశుగ్రాసం వేసి తినిపించే పద్ధతి మంచిది.
పశుపోషణలో ప్రోటీన్ జోడింపు:
దాణాలో క్రూడ్ ప్రోటీన్ స్థాయిని గమనించి అనువైన దాణా ను ఎన్నుకోవాలి. పశువుల పాల ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి దాణాను ఎన్నుకోవాలి.
దాణాతో బాటు లవణ మిశ్రమాల మేపు:
ఫాస్ఫరస్ లాంటి ఎంతో ఖరీదైన లవణం చవకగా లభించే మొక్కజొన్నతో లభించేలా చేయవచ్చు. కాల్షియం అధికంగాను భాస్వరం తక్కువగానూ, వీలైనంత వరకు మినరల్ మ్యాపింగ్ మేరకు తయారైన లవణ మిశ్రమాల వాడకం పశువులకు కావాల్సిన లవణాలనందిస్తుంది.
యాజమాన్య పద్ధతుల ఆచరణ:
మంచినీటి లభ్యత, పరిశుభ్రత, దాణా ప్రతిరోజూ నిర్ధారిత సమయంలోనే అందించడం మేలుజాతి పశుగ్రాసాల పెంపకం ఇవన్నీ యాజమాన్య పద్ధతుల క్రిందికి వస్తాయి.
పశుగ్రాసాల గురించి అవగాహన:
కో1, కో2 ఇలా ఎన్నో పశుగ్రాసాలు గతంలో ఆచరణ పొందగా నేడు సూపర్ నేపియర్ షుగర్ గ్రేజ్ లాంటి గ్రాసాలు అందుబాటులో వచ్చాయి. లూసెర్న్ లాంటి గ్రాసాలు ఎంతో పోషకాలు కలిగి ఉన్నాయి. ఇలాంటి గ్రాసాల గురించిన వివరాలను పశుగ్రాస శిక్షణా సంస్థ, హైదరాబాద్ లేదా NDR లాంటి సంస్థల నుండి ఎప్పటికప్పుడు తెలుసుకుంటే ఎంతో లాభసాటిగా ఉంటుంది.
మేలుజాతి పశుగ్రాసాలు పాల ఉత్పత్తికి ముఖ్యం పాడి రైతులు ఈ దిశగా పశుగ్రాసాల పెంపు అజోల్లా, సైలేజీ లాంటివి వాడటం శ్రేయదాయకం.

                                                                                     మధుసూదనరావు ఉపసంచాలకులు

                                                                                            విజయ డెయిరీ, ఆదిలాబాద్

                                                                                                            951506093.

Leave Your Comments

మామిడి మాగవేసే పద్ధతులు..

Previous article

విశాఖ కాఫీ తోటల్లో అంతర పంటగా మిరియాల సాగు..బహు బాగు

Next article

You may also like