గత వానాకాలం , యాసంగి వరి, గత వానాకాలం పత్తి క్రాప్ బుకింగ్ వివరాలను క్లస్టర్ వారీగా సమీక్షించి, ఈ వానాకాలం సీజన్ కు సంబంధించిన క్రాప్ బుకింగ్ పై రంగారెడ్డి కలెక్టరేట్ నుండి రాష్ట్రంలోని డీఏఓలు, ఏడీఓలు, వ్యవసాయ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, హాజరైన వ్యవసాయ కార్యదర్శి రఘునందన్ రావు తదితరులు
వ్యవసాయమే ఈ రాష్ట్ర భవిష్యత్
- ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇది అత్యంత ప్రాధాన్యతా మరియు ప్రీతిపాత్రమైన రంగం
- వ్యవసాయ శాఖ నుండి పంటల సాగు సమాచారం (క్రాప్ బుకింగ్) పకడ్భంధీగా ఉండాలి
- క్షేత్రస్థాయి సమాచారాన్ని బట్టి పంటల ఉత్పత్తి , ఎరువులు, రసాయనాలు మరియు విత్తనాల విషయంలో ఒక అంచనాతో పాటు పంటల మార్కెటింగ్ కు సంబంధించి ప్రభుత్వం ఒక అంచనాకు రాగలుగుతుంది .. అందుకే దేశంలో మొదటిసారి ప్రతి ఎకరాలో పంట వివరాలను నమోదు చేయాలని కేసీఆర్ నిర్ణయించారు .. పంటల నమోదులో ముఖ్యమంత్రి గారు ఆశించిన మేరకు పనితీరు కనబరచాలి .. లేనియొడల ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది
- ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక ఏఈఓ ఉన్నారు .. దాని పరిధిలో వెయ్యి నుండి 1200 మంది రైతులు ఉంటారు
- అధికారులు ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో రైతుల పంట పొలాలను సందర్శించి పంటలను రికార్డు చేయాలి .. ఈ విషయంలో అలసత్వాన్ని సహించం
- జూన్ రెండవవారం నుండి మొదలుపెడితే ఆగస్ట్ చివర సెప్టెంబరు మొదటివారం వరకు పంటల నమోదుకు సమయం ఉంటుంది
- గతంలో కన్నా మరింత మెరుగ్గా ఈసారి క్రాప్ బుకింగ్ ఉండాలి
- వ్యవసాయ శాఖలో ఎక్కువ మంది యువత ఏఓ, ఏఈఓలుగా ఉన్నారు .. ప్రభుత్వ పథకాల అమలులో మీ పనితీరు అందరికీ ఆదర్శంగా నిలవాలి
- కంది, పెసర వంటి అంతరపంటల నమోదు విషయంలో అధికారులు ఎలాంటి అలక్ష్యం ప్రదర్శించవద్దు .. పొరపాట్లకు తావివ్వవద్దు
- వీలైనంత ఎక్కువ సమయం క్షేత్రస్థాయి పర్యటనకు ప్రాధాన్యం ఇవ్వాలి
- క్షేత్రస్థాయిలో ఎలాంటి సమస్యలు ఉన్నా పై అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి
- క్రాప్ బుకింగ్ ప్రారంభమైన తరువాత క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహించి పంటల నమోదును పరిశీలిస్తాం
- కరోనా బారిన పడి దాదాపు 15 మంది వ్యవసాయ శాఖ ఉద్యోగులు మరణించారు .. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తూ విచారం వ్యక్తం చేస్తున్నాను
- ఈ నెల 15 నుండి రైతుబంధు నిధులు రైతుల ఖాతాలలో జమకానున్నాయి .. వ్యవసాయ శాఖాపరమైన తప్పిదాలతో రైతుబంధు నిధులు ఏ ఒక్క రైతుకు దక్కకుండా ఉండవద్దు
- గత వానాకాలం , యాసంగి వరి, గత వానాకాలం పత్తి క్రాప్ బుకింగ్ వివరాలను క్లస్టర్ వారీగా సమీక్షించి, ఈ వానాకాలం సీజన్ కు సంబంధించిన క్రాప్ బుకింగ్ పై రంగారెడ్డి కలెక్టరేట్ నుండి రాష్ట్రంలోని డీఏఓలు, ఏడీఓలు, వ్యవసాయ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, హాజరైన వ్యవసాయ కార్యదర్శి రఘునందన్ రావు తదితరులు
Leave Your Comments