ఆంధ్రప్రదేశ్ఆంధ్రా వ్యవసాయంవార్తలు

భారీగా ఏపీ వ్యవసాయ బడ్జెట్ కేటాయింపులు

0

Ap Agriculture Budget :

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. వార్షిక బడ్జెట్‌తో పాటు రూ. 43,402 కోట్లతో ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్‌ను కూడా ప్రవేశపెట్టింది సర్కార్. రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి అచ్చెన్నాయుడు అగ్రికల్చర్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ప్రసంగించిన అచ్చెన్నాయుడు.. ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయరంగం వెన్నెముకగా పేర్కొన్నారు. రైతు అభ్యున్నతే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా మంత్రి పేర్కొన్నారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులను పంపిణీ చేస్తామని ప్రకటించారు. వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామని.. రైతులకు ఆధునిక పనిముట్లు, రాయితీపై విత్తనాలు సరఫరా చేస్తామని మంత్రి తెలిపారు.
వడ్డీ లేని రుణాలు, భూసార పరీక్షలకు ప్రాధాన్యమిస్తామని అచ్చెన్నాయుడు చెప్పారు. రిమోట్ సెన్సింగ్ సాంకేతికతతో భూసార పరీక్షలు నిర్వహిస్తామన్నారు. అలాగే మట్టి నమూనాల కోసం ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తామని అసెంబ్లీ వేదిక వ్యవసాయ మంత్రి ప్రకటించారు. సాగుకు సూక్ష్మ పోషకాలు అందిస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం.. వ్యవసాయ రంగానికి నిర్ధిష్ట ప్రణాళిక అవసరం అన్నారు మంత్రి. పెట్టుబడి సాయం పెంచి నెల రోజుల్లోనే అందించామని చెప్పారు వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధే.. లక్ష్యంగా వ్యవసాయ బడ్జెట్‌ రూపొందించామని మంత్రి తెలిపారు. వ్యవసాయం ఆధారంగా 62% మంది జీవిస్తున్నారని.. 2047 టార్గెట్‌తో తమ ప్రభుత్వం ముందుకెళ్తోందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
ఏపీ వ్యవసాయ బడ్జెట్ కేటాయింపులు
➡️ వ్యవసాయశాఖకు రూ.8,564 కోట్లు –
➡️ అన్నదాత సుఖీభవ రూ.4,500 కోట్లు –
➡️ ఉద్యానశాఖకు రూ.3,469 కోట్లు –
➡️ వ్యవసాయ యాంత్రీకరణకు రూ.187.68 కోట్లు –
➡️ వడ్డీ లేని రుణాలకు రూ.628 కోట్లు –
➡️ రైతు సేవా కేంద్రాలకు రూ.26.92 కోట్లు –
➡️ ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్ రూ.44.03 –
➡️ పంటల బీమాకు రూ.1,023 కోట్లు –
➡️ పట్టు పరిశ్రమలకు రూ.108 కోట్లు –
➡️ వ్యవసాయ మార్కెటింగ్ రూ.314.80 కోట్లు –
➡️ సహకార శాఖకు రూ.308.26 కోట్లు –
➡️ పొలం పిలుస్తోంది కార్యక్రమానికి రూ.11.31 కోట్లు –
➡️ రాయితీ విత్తనాలకు రూ.240 కోట్లు –
➡️ ఎరువుల సరఫరాకు రూ.40 కోట్లు –
➡️ ప్రకృతి వ్యవసాయానికి రూ.422.96 కోట్లు –
➡️ డిజిటల్ వ్యవసాయం కోసం రూ.44.77 కోట్లు –
➡️ ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీకి రూ.507 కోట్లు –
➡️ఉద్యాన వర్సిటీకి రూ.102.22 కోట్లు –
➡️ ఎస్వీ పశు విశ్వవిద్యాలయానికి రూ.171.72 కోట్లు –
➡️ మత్స్య విశ్వవిద్యాలయానికి రూ.38 కోట్లు –
➡️ పశుసంవర్థకశాఖకు రూ.1095.71 కోట్లు –
➡️ మత్స్యరంగ అభివృద్ధికి రూ.521.34 కోట్లు –
➡️ వ్యవసాయ ఉచిత విద్యుత్ కు రూ.7,241.30 కోట్లు –
➡️ ఉపాధి హామీ అనుసంధానానికి రూ.5,150 కోట్లు –
➡️ ఎన్టీఆర్ జలసిరికి రూ.50 కోట్లు –
➡️ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వహణకు రూ.14,637.03 కోట్లు
Leave Your Comments

పాలకూర సాగులో అధిక దిగుబడి సాధించాలంటే..

Previous article

పురుగుమందులు సమర్థంగా పనిచేయాలంటే…

Next article

You may also like