ఒకప్పుడు పాలెగాళ్ళ పదఘట్టనలో నలిగి కుంగి కృసించిన సీమ అనంతపురం. ఫాక్షనిస్టుల పడగనీడలో మానవత్వం మరచి పరస్పర హననం దశాబ్దాలుగా కొనసాగిన కన్నీటి సీమ. కాని నేడక్కడ శవాల దిబ్బలపై మొలిచిన కదలీఫలాలు, అనారుపూలవెలుగులు మొత్తం పరిస్తితులనే మార్చివేసాయి. కరోనా కష్టకాలంలో ప్రపంచమంతా కన్నీటీతో నిండిపోగా అనంత రైతు దేశానికి ఫలాలనందించే అన్నదాతగా పేరుపొందాడు. సాగురంగంలో వారి కష్టార్జితాన్ని ప్రత్యేక కిసాన్ రైలు వచ్చి కదనకుతూ హలంతో తీసుకువెళ్ళింది ప్రపంచానికి పంచడానికి. రాజస్థాన్ లోని జైసల్మీర్ జిల్లాలోని ధార్ ఎడారి కన్నా దారుణంగా అతి తక్కువ వర్ష పాతంతో క్షామానికి ప్రతిరూపంగా నిల్చిన ఆ జిల్లా రైతులు నేడు చరిత్ర తిరగరాసేందుకు సమాయత్తమయ్యారు.
భూమీకీ పచ్చాని రంగేసినట్లు అనే హృదయాన్ని తాకే కలేకూరి ప్రసాద్ విరచిత పాట విన్నప్పు డు కలిగే అనుభూతి ఎంగొప్పదో మనకు ఈజిల్లాలో పర్యటిస్తున్న సమయంలో గోచరిస్తుంది.
ప్రకృతితో అనునిత్యం పోరాడే ఇక్కడి రైతులు తరతరాలుగా తక్కువ నీటితో సాగయ్యే వేరుశెనగ పంటే ప్రథాన ఆథారంగా సాగురంగంలో కొనసాగుతున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వేరుశనగ అధికంగా పండించే జిల్లాగా అనంత పేరుపొందింది. క్రమేణా సాగునీటి ఎద్దడి నుండి బయటకు వచ్చి ఆధునిక వ్యవసాయ పద్దతుల్లోకి మారుతూ మెరుగైన నీటి యాజమాన్యంద్వారా పండ్లతోటల సాగుకు కృషి ముమ్మరమైంది. బిందు, తుంపరల సేద్యంద్వారా ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేసుకొని లక్షకు పైగా హెక్టార్లలో ఉద్యాన సాగుకు ఉపక్రమించారు. గత దశాబ్దకాలంగా అనంత నుంచి ఏటాపది లక్షల మెట్రిక్ టన్నుల పండ్ల ఉత్పత్తి జరుగుతుందంటే మామూలు విషయంకాదు వైశాల్యంలో అతిపెద్దదైన అనంతపురంలో 63 రెవిన్యూ మండలాలు ఉండగా పదకొండు వ్యవసాయడివిజన్లు ఉన్నాయి.
వరుణ దేవుడు శీతకన్ను వేసి వానలు కురవక పోవడంతో పాటు అనంత పై పాలకుల నిర్లక్ష్యపు ధోరణి ఈ జిల్లాను ఎడారిగా మార్చివేసింది. జిల్లా రైతాంగానికి తుంగభద్ర జలాలే ప్రథాన నీటివనరు. ప్రతి ఏటా తుంగభద్రజలాశయంనుండి 25 నుండి 30 టిఎంసిల నీరు విడుదలై కొంతవరకు బీడుబారిన భూముల దాహార్తి ని తీర్చడం జరుగుతుంది. పూడిక వలన తుంగభద్ర జలాశయంలో నీటి నిల్వ తగ్గిపోతుండటంతో ఆకాస్త ప్రవాహం తగ్గి పోయి రైతులు అవస్ధలకు గురవుతున్నారు.
వేరుశనగకు తరగని ప్రాథాన్యత:
వర్షాభావాన్ని, నీటి ఎద్దడిని తట్టుకొని నిలిచేది వేరుశెనగ పంట. ఎర్రగరప నేలలు వేరుశెనగ సాగుకు అనుకూలమైనవి ప్రతిఏటా 7 నుంచి 8 లక్షల హెక్టార్లలో వేరుశెనగ సాగుచేస్తూఉన్నారు ఇక్కడి రైతులు మొక్కజొన్న, జొన్న, రాగులు, కొర్రలు సంప్రదాయంగా పండిస్తూ వస్తున్నారు. ఇటీవల ఉద్యాన పంటలపై మక్కువ చూపిస్తున్నారు కంది,పెసర, శనగ, సోయాచిక్కుడు,ఉలవలు,ప్రొద్దు తిరుగుడు పంటల సాగుకూడా చేపడుతున్నారు. పరిమితంగా చెరకు పంటనూ గిట్టుబాటు ధర ఉండటంతో ఆముదపు పంటను సాగుచేసే రైతాంగం నదీతీర ఆయకట్టు కింద పత్తిని సాగుచేసి మంచి ఆదాయాన్ని పొందుతున్నారు.పెద్దవడుగూరు ప్రాంతం మంచి నాణ్యమైన పత్తి ఉత్పత్తికి కీలకమైనదిగా భావించడం జరుగుతున్నది. కదిరి,హిందూపురం,పెనుగొండ తదితర ప్రాంతాలలో మామిడి విస్తరంగా సాగవుతున్నది. జి.9 రకం అరటి ప్రాచుర్యంలోకి రావడం గిట్టుబాటు ధర మార్కెట్ అవకాశాలు అధికంగా ఉండంతో నీటి అవకాశాలున్న చోట విస్తృ తంగా అరటి సాగవుతోంది.
చీనీ, బత్తాయి,ద్రాక్ష,జామ,సపోట,దానిమ్మ,రేగు,బొప్పాయి,సీతాఫలం,ఉసిరి లాంటి ఫలాలు చేమంతి,కనకాంబరం, మల్లె,వంటి పూలపంటలను ఆధునిక నీటి, సస్యయాజమాన్యం ద్వారా సాగు చేస్తున్నారు.
పెరుగుతున్న దానిమ్మ సాగు :
అనంత రైతులు తమ ప్రాంతంలో ఉన్న పరిమిత నీటి వనరులను ఒడిసి పట్టి, సాగు చేస్తున్న వినూత్నమైన పంట దానిమ్మ. ఈ పంట లోగణనీయమైన ప్రగతిని సాధిస్తూ దిగుబడులలో మహారాష్ట్ర తో పోటీ పడుతున్నారు.అనంత కష్టాలు అధిగమించి సాగు ను కొనసాగించేందుకు దోహద పడుతున్న మరో పంట పట్టుపురుగుల పెంపు. హిందూపూరం,పెనుగొండ,ధర్మవరం రైతులు పట్టు పరిశ్రమ కు పట్టుగా నిలుస్తున్నారు.కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు బెంగుళూరు లోని కేంద్ర సిల్కు బోర్డ్ లు రాయితీల రూపంలోనూ మార్కెట్ భద్రత కల్పించడం వలన రైతులు మలబారు సాగుకు ఆసక్తి చూపిస్తున్నారు.
జిల్లాలో ముఖ్యమైన నదులు,పెన్నా, చిత్రావతి,వేదవతి, పాపాఘ్ని,స్వర్ణముఖి,తడకలూరు వంటి ఆరుప్రధాన నదులు పంటభూములను పునీతం చేస్తున్నాయి జిల్లా మధ్యలో ఎత్తైన పలకరాళ్ళు పెద్దనాపరాళ్ళతో మెలికలు తిరిగిన పీఠభూమి కఠిన శిలావ్రుతం గా ఉంటుంది. సముద్రమట్టానికి 2600 అడగుల ఎత్తులో పర్వతమయమైన ఈ జిల్లాలో సాగు పరిస్ధితులు కూడా అంతకఠినంగా ఉంటాయి.జిల్లాలోని యాడికి అతిపెద్ద జౌళి పట్టుపరిశ్రమలకు నిలయంగా ఉంది .
ఈ జిల్లాలో మే-సెప్టెంబర్లో బలంగా వీచే గాలులనుండి పవన విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్నారు. ఈరంగంలో ఉత్తమఫలితాలు కనిపించడంతో ఇదొక పరిశ్రమగా రూపుదిద్దుకుంది ప్రత్యామ్నాయ ఇందన వనరుగా ఇది జిల్లా రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చడం లో కీలక పొత్రవహిస్తున్నది.
అనంత రైతును ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు మరింత విస్త్రుతంగా పధకాలు రచించి వాటిని ఆచరణలోకి తీసుకు రావలసి ఉంటుంది. బిందు తుంపరల సేద్యానికి అవసరమైన నిధులు మరిన్ని అందజేసి ఆదుకోవలసిఉంది. ఈమధ్య వచ్చిన తుపాను, అంతకుముందు కురిసిన భారీ వర్షాలకు వేరశనగ పంట బాగా దెబ్బతిన్నది.. రైతులకు సకాలంలో ఆర్ధిక సహాయం అందించి ఆదుకోవాలి..అదేవిధంగా ఉద్యాన పంటల పరిస్థితి ఉంది. పెండింగ్ లో ఉన్న చిన్న పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తయి నీటి సరఫరా బాగుంటే రాళ్ళ సీమలో రతనాలు పండిస్తారు రైతులు.
వరుణ దేవుడు శీతకన్ను వేసి వానలు కురవక పోవడంతో పాటు అనంత పై పాలకుల నిర్లక్ష్యపు ధోరణి ఈ జిల్లాను ఎడారిగా మార్చివేసింది.జిల్లా రైతాంగానికి తుంగభద్ర జలాలే ప్రథాన నీటివనరు ప్రతి ఏటా తుంగభద్రజలాశయంనుండి ఇరవై ఐదునుండి ముపై టిఎంసిల నీరు విడుదలై కొంతవరకు బీడుబారిన భూముల దాహార్తి ని తీర్చడం జరుగుతుంది..పూడిక వలన తుంగభద్ర జలాశయంలో నీటి నిల్వ తగ్గిపోతుండటంతో ఆకాస్త ప్రవాహం తగ్గి పోయి రైతులు అవస్ధలకు గురవుతున్నారు.
జిల్లాలో ముఖ్యమైన నదులు, పెన్నా. చిత్రావతి,వేదవతి,పాపాఘ్ని, స్వర్ణముఖి, తడకలూరు వంటి ఆరుప్రధాన నదులు పంటభూములను పునీతం చేస్తున్నాయి.జిల్లా మధ్యలో ఎత్తైన పలకరాళ్ళు పెద్దనాపరాళ్ళతో మెలికలు తిరిగిన పీఠభూమి కఠిన శీలవృతంగా ఉంటుంది.. సముద్రమట్టానికి 2600 అడగుల ఎత్తులో పర్వతమయమైన ఈజిల్లాలో సాగు పరిస్ధితులు కూడా అంతకఠినంగా ఉంటాయి. జిల్లాలోని యాడికి, అతిపెద్ద జౌళి పట్టుపరిశ్రమలకు నిలయంగా ఉన్నాయి.
అనంతపురం జిల్లాలో మొత్తం నాలుగు వందల చెరువులు ఉన్నాయి. పెద్ద,చిన్న కుంటలు ఉన్నాయి. వీటి ద్వారా ఆయకట్టు అభివ్రద్ది చేయాలనే అభి లాష ఉన్నా వర్షపాతం తగినంతగా లేకపోవడంతో సాధ్యపడటం లేదు. బుక్కపట్నం,ధర్మవరం, శింగనమల, బుక్కరాయసముద్రం చెరువులు అత్యథిక ఆయకట్టు కలిగిన చెరువులు. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కు 13 మార్కెట్ కమిటీలు ఉన్నాయి. ఇందులో అనేక కమిటీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్న దాఖలాలు లేవు. జిల్లాలో పాడి పరిశ్రమ ఇప్పుడిప్పుడే ప్రగతి పధంలోకి అడుగిడుతున్నది..