ఉద్యానశోభమన వ్యవసాయం

Aloe vera Cultivation: కలబంద సాగులో మెళుకువలు.!

1
Aloe vera
Aloe vera

Aloe vera Cultivation: ఆకుల్లో ఉండే జిగురు పదార్థం నుండి మూసాంబరం తయారు చేస్తారు. ఇది అనేక ఔషదాల తయారీలో ఉపయోగపడుతుంది. ఆకుల మధ్యలో నుండి లభించే ‘జెల్’ అనేక సౌందర్య సాధనాల తయారీలో ఉపయోగపడుతుంది.

నేలలు: అన్ని రకాల భూముల్లో సాగుచేయవచ్చు. ఉదజని సూచిక 8.5 వరకు ఉండవచ్చు.

వాతావరణం: అన్ని రకాల భూముల్లో సాగుచేయవచ్చు. వర్షపాతం 35-40 సెం.మీ నుండి 150-200

సెం.మీ వరకు ఉండవచ్చు.

విత్తేసమయం: జూన్-జులైలో నాటుకుంటే మంచిది.

ప్రవర్ధనం:- పేరు పిలకలు లేదా వేరుకుమ్ము కత్తిరింపుల ద్వారా ప్రవర్థనం చేయాలి.

నాటటం:- కనీసం 15-20 సెం.మీ పొడవున్న పిలకలను 60-45 సెం.మీ. దూరం పాటించి నాటాలి. వెంటనే నీరివ్వాలి.

Aloe vera Cultivation

Aloe vera Cultivation

Also Read: Casting of Animals: ఆవులు మరియు గేదెలను ఎలా నియంత్రించాలి.!

ఎరువులు: సుమారుగా ఎకరాకు 5 టన్నుల పశువుల ఎరువు ఆఖరి దుక్కిలో వేయాలి. దీనితో పాటు నత్రజని, భాస్వరం మరియు పొతష్ వేసుకోవాలి. వర్మీ కంపోస్తును (2 టన్నులు/ఎకరాకు) వేసినప్పుడు అధిక దిగుబడి వచ్చినట్లు పరిశోధనలలో వెల్లడైంది. అజోస్పైరిల్లం వంటి జీవన ఎరువులు కూడ వాడుకోవచ్చు.

అంతరకృషి: సంవత్సరానికి 4-5 సార్లు కలుపు తీయాలి. వాణిజ్యపరంగా సాగు చేసినచో వేసవిలో

కనీసం 20 రోజులకు ఒకసారి నీరివ్వాలి.

సస్యరక్షణ: అంతగా అవసరంలేదు.

కోత: నాటిన 8-10 నెలలకు కోతకొస్తుంది. ముదిరిన ఆకులను మాత్రమే కోయాలి. ప్రతి 3 నెలలకు ఒక కోత తీసుకోవచ్చు.

దిగుబడి: ఎకరాకు రూ.15,000-20,000 ఖర్చు రూ. 40,000 మొత్తం ఆదాయం. తద్వారా 15,000-20,000 నికర ఆదాయం లభిస్తుంది. దీని ఆకుల నుండి జెల్ తయారు చేయగల్గిన ఎడల ఇంకా ఎక్కువ ఆదాయం పొందవచ్చు. సమీపంలో ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ మరియు సరియైన బైబ్యాక్ సదుపాయం ఉన్న రైతులు మాత్రమే దీనిని సాగు చేసుకోవాలి లేనియెడల మార్కెటింగ్ సమస్య తలెత్తుతుంది.

ఉపయోగాలు:

కలబందను రుచికరమైన చల్లదనమునిచ్చే పానీయముగాను, విరేచనకారిగా, స్టౌల్యాన్ని తగ్గించేదిగా, త్వాన్ని కలిగించేదిగా, ఔషదాలలోను, గర్భాశాయ వ్యాధులలోను, ఉపయోగిస్తారు. చర్మరోగాలు, దంతవ్యాధులు, అభిఘాతము, అగ్నిదగ్గ వ్రణాలు. కఫ వికారములోను, దగ్గు, ఉదరశూల, అర్శస్సు, మొదలగు వ్యాధులలో వాడతారు.

ప్రస్తుతము పశ్చిమ దేశాలలో కలబందను చల్లని పానీయముగా తయారు చేసుకొని సంవత్సరము పొడగునా ఉపయోగిస్తున్నారు. అరబ్బు దేశాలలోను, పాకిస్తాన్లోను, దీనిని కాన్మెటిక్ గాను, ముసాంబర రూపంలోను ఉపయోగిస్తున్నరు. మనదేశంలో ఆయుర్వేద ఔశధాలలో విరివిగా వాడుతున్నారు.

పురాతనకాలం నుండి గృహవైద్యంగా, మధ్యలో నుండు గుజ్జును, గ్రీష్మతాపము తగ్గించడానికి చెక్కరతో తినడం. కండ్లకలకలోను, చెవిపోటులోను, వడదెబ్బలయుందును విరివిగా వాడేవారు.

Also Read: Paratuberculosis Disease in Cattle: పశువులలో జోన్స్ వ్యాధి లక్షణాలు.!

Leave Your Comments

Casting of Animals: ఆవులు మరియు గేదెలను ఎలా నియంత్రించాలి.!

Previous article

Pigment Methods in Pomegranate: దానిమ్మలో కాయరంగు పెంచే పద్ధతులు.!

Next article

You may also like