Alasanda అలసందలు మన రాష్ట్రంలో వర్షాధారంగా వర్షాలు ఆలస్యమైనప్పుడు, పంటల సరళిలో మిగులు తేమను ఉపయోగించుకొని పండిస్తుంటారు. అలసందలు ఎక్కువగా వేడిమితో కూడిన వాతావరణంలో 20-30 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు కల్గి వుండినచో బాగా వచ్చును. అధిక వర్షపాతాన్ని మరియు చలిని తట్టుకోదు.
నేలలు : అలనందలు వివిధ నేలలలో వండే గుణమున్నప్పటికి, తేమను పట్టి ఉండె గుణము కలిగి మురుగు నీరు నిల్వని మధ్యస్థ, చల్కా నేలలు, ఎర్ర భూములు మరియు నల్లరేగడి భూములు అనుకూలం.
అనువైన సమయం: అలసందలు వర్షాధారంగా ఖరీఫ్లో, మిగులు తేమ ఆధారంగా లేట్ ఖరీఫ్, నీటి పారుదల క్రింద రబీలో మరియు వేసవిలో కూడా పండిస్తారు. ఖరీఫ్ జూలై; ఖరీఫ్లో లో ఆలస్యంగా విత్తినప్పుడు సెప్టెంబర్, రబీలో నీటిపారుదల క్రింద అక్టోబర్-నవంబర్ లో విత్తుకోవచ్చు, వేసవిలో ఫిబ్రవరిలో విత్తుకోవచ్చు.
విత్తన మోతాదు/ఎకరానికి: విత్తనం లేదా పచ్చికాయ కోత కోసం విత్తినప్పుడు 8-10 కిలోలు, పశుగ్రాసం లేదా, పచ్చిరొట్టకై విత్తినప్పుడు 12-14 కిలోల విత్తనం వాడాలి.
కలుపు యాజమాన్యం: పెండిమిథాలిన్ 30% ఎకరాకు 1.3 నుండి 1.6 లీటర్లు. 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన వెంటనే గాని లేదా మరుసటి రోజు గాని పిచికారి చేయాలి.
అంతరకృషి: విత్తిన 25-30 రోజుల వరకు కలుపు లేకుండా చూడాలి, అవసరాన్ని బట్టి సాళ్ళ మధ్య నాగలి తో కలుపు నివారించాలి. మొక్కల మధ్య కలుపును మనుషుల ద్వారా తీయించాలి.
నీటి యాజమాన్యం: ఖరీఫ్ లో సాధారణంగా వర్షాధారంగా వండిస్తారు, తర్వాత మిగులు తేమ ఆధారంగా పండిస్తారు. రబీలో నీటి పారుదల క్రింద కీలక దశలో 3-4 తడులిచ్చి పండించవచ్చు. బెట్టను బాగా తట్టుకునే పంట అయినప్పటికీ దాదాపుగా 250-300 పెట్టించి మి.మీ, నీరు అవసరముంటుంది. కీలక దశలైన మొగ్గ, పిందె, కాయ దశలలో నీరు అందించాలి. తప్పనిసరి పరిస్థితులలో బెట్ట పరిస్థితులు నెలకొన్నచో 2 శాతం యూరియా లేదా 2% డి.ఎ.పి ద్రావణం పిచికారి చేసినచో ఉపయోగకరం.