Yarsagumba Mushroom: రైతులు వర్షాకాలం మొదలు అవ్వగానే పుట్టగొడుగుల సాగు చేస్తారు. మనం చూసిన పుట్టగొడుగులు కిలో 250-300 రూపాయలు ఉంటుంది. పుట్టగొడుగుల సాగులో రైతులకి మంచి లాభాలు వస్తున్నాయి. రైతులు పండించే పుట్టగొడులో అని రకాల పుట్టగొడుగులని తిన్నలేము, కొన్ని మాత్రమే తిన్నాడనికి వస్తాయి. మరి కొన్ని వాటిలో విషం ఉంటుంది, వాటిని తిన్నలేము. అయితే మన దేశంలో ఇప్పుడు పండిస్తున్న పుట్టగొడుగులతో కోటీశ్వరులు అవ్వచ్చు. ఒక కిలో పుట్టగొడుగులు 20 లక్షల రూపాయలకి అమ్ముకోవచ్చు. కానీ వీటిని పండించాలి అంటే ఇంటిలోనే ల్యాబ్‌ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ పుట్టగొడుగుల పేరే యార్సగుంబా పుట్టగొడుగులు .
యార్సగుంబా పుట్టగొడుగులు లేదా వార్మ్వుడ్ లేదా హిమాలయన్ వయాగ్రా అని అంటారు. ఈ పుట్టగొడుగులో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఈ పుట్టగొడుగులు కాన్సర్ చికిత్సకు వాడుతారు. మన దేశంలోనే కాదు ప్రపంచం మొత్తం ఈ పుట్టగొడుగులకి మంచి డిమాండ్ ఉంది. యార్సగుంబా పుట్టగొడుగులు పురుగులా కనిపించడం వల్ల వీటిని వార్మ్వుడ్ అని పిలుస్తారు.
Also Read: Intercropping: తక్కువ భూమిలో ఎక్కువ పంటలని పండించడం ఎలా.. ?
యార్సగుంబా పుట్టగొడుగులు 3500 మీటర్ల ఎత్తులో సాగు చెయ్యాలి. మన దేశంలో హిమాలయ పర్వతాలలో ఈ పుట్టగొడుగులు సాగు చేస్తారు.మన దేశంలో ఉత్తరాఖండ్‌లోని చమోలి, పితోరాఘర్ ,బాగేశ్వర్ జిల్లాలలో కూడా సాగు చేస్తున్నారు. చైనా, నేపాల్, భూటాన్, టిబెట్లలో కూడా సాగు చేస్తున్నారు.
ఇంటిలో ఈ పుట్టగొడుగులు సాగు చెయ్యాలి అనుకున్న వారు ల్యాబ్ ఏర్పాటు చేసుకోవాలి. ఈ ల్యాబ్ పెట్టుకోవడానికి 20-25 లక్షలు ఖర్చు అవ్వుతుంది. ల్యాబ్‌లో ఉష్ణోగ్రత, తేమను అదుపులో ఉంచుకోవాలి. ల్యాబ్‌లో ఏసీని కచ్చితంగా పెట్టుకోవాలి. ఇలా ఏర్పాటు చేసుకొని ఈ పుట్టగొడుగులని సాగు చేస్తే సంవత్సరానికి 6 సార్లు పెంచుకోవచ్చు.
ఈ పుట్టగొడుగులో విటమిన్లు, ప్రోటీన్లు, పోషకాలు ఎక్కువగా ఉంటుంది. రోగ నిరోధక శక్తి కూడా పెంచుతుంది. యార్సగుంబా పుట్టగొడుగులకు మన దేశంతో పాటు ఇతర దేశంలో కూడా భారీ డిమాండ్ ఉంది. వీటిని సాగు చేస్తూ రైతులు కోటీశ్వరులు అవుతున్నారు.
Also Read: Eco-friendly Houses: వ్యవసాయ వ్యర్ధాలతో ఎకో ఫ్రెండ్లీ ఇళ్ల నిర్మాణం.!