Saffron: వ్యవసాయంలో రొటీన్ పద్దతిని వీడి పంట మార్పిడి జరిగినప్పుడే ఆ రైతు ఆర్ధికంగా ముందుకు సాగగలడు. వ్యవసాయం అంటే కేవలం వరి, గోధుమ, మిర్చి పంటలే కాదు. వాణిజ్యపరంగా డిమాండ్లో ఉన్న పంటలను ఎంచుకుని సాగు చేస్తే మంచి ఫలితాలు చూడవచ్చు. ప్రస్తుతం కొందరు రైతులు విభిన్న సాగు చేస్తూ అధిక ఆదాయాన్ని పొందుతున్నారు. కుంకుమ పువ్వు సాగు చేస్తూ లక్షలు సంపాదిస్తున్న రైతులు ఉన్నారు.
కుంకుమ పువ్వు కిలో లక్ష రూపాయలు పలుకుతుందంటే దాని డిమాండ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. నిజానికి కుంకుమను మన దేశంలో అధిక ప్రాధాన్యత ఇస్తారు. హిందూ సంప్రదాయంలో దీని ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది. కుంకుమ పువ్వు సుగంధ ద్రవ్యము మాత్రమే కాదు ఇది ఆరోగ్యాన్ని కూడా కాపాడే ఔషధంగా చూడవచ్చు. అయితే కుంకుమను సాగు చేయడం కూడా కష్టంతో కూడుకున్నదే. దీన్ని ఎక్కువగా శీతల ప్రదేశాల్లో పండిస్తారు. కుంకుమలో ఉండే ఎర్రకేసరాలు కిలో తయారు చేయాలంటే రెండు లక్షల పూలు అవసరం పడతాయి. కాగా ఈ కేసరాలు రుచికి కొద్దిగా చేదుగా, తియ్యగా ఉంటాయి.
Also Read: ఎండు పూల తయారీ – ప్రయోజనాలు
ఇకపోతే దీని దిగుబడి చాలా తక్కువగా ఉంటుంది. విశేషం ఏంటంటే ఈ పంటను సాగు చేస్తున్న సమయంలో వ్యవసాయక్షేత్రంలో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. కానీ చేతికొచ్చిన తర్వాత పరిమాణంలో తక్కువగా కనిపిస్తుంది. ఉదాహరణకు ఒకటిన్నర చదరపు అడుగులలో సాగు చేస్తే 50 గ్రాముల కుంకుమ మాత్రమే చేతికి వస్తుంది.. అదే సమయంలో ఒక కిలో కుంకుమ పువ్వు రావాలంటే ఎక్కువ భూమిలో సాగు చేయాల్సి ఉంటుంది.
ముఖ్యమైన విషయం ఏంటంటే.. దీని విత్తనాలను 15 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే విత్తాలి. అయితే ప్రతి సంవత్సరం పువ్వులు పూస్తాయి. 15 సంవత్సరాల తరువాత మళ్ళీ పంటను తొలగించాలి. ఒక పువ్వులో మూడు పోగులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. అందుకే ఒక కిలో కుంకుమ పువ్వు తయారు కావాలంటే చాలా పువ్వులు అవసరం పడతాయి . దాదాపు లక్షన్నర పువ్వులు కలిస్తే ఒక కిలో కుంకుమ పువ్వు తయారు అవుతుంది. ఆయర్వేదం నుంచి వంటలు వండటం వరకు.. కుంకుమ పువ్వు అనేది అనేక సందర్భాల్లో ఉపయోగించే వంటకం. రక్తాన్ని శుభ్రపరచడం నుంచి లో బ్లెడ్ ప్రెషర్ ను తగ్గించడం వరకు కుంకుమ పువ్వు సహాయపడుతుంది.
Also Read: భారతదేశంలో అత్యంత లాభదాయకమైన పంటలు