మన వ్యవసాయంవ్యవసాయ పంటలువ్యవసాయ వాణిజ్యం

High Yield Chilli Varieties: మిరపలో అధిక దిగుబడికి అనువైన రకాలు మరియు వాటి లక్షణాలు.!

2
Chilli Varieties
Chilli Varieties

High Yield Chilli Varieties: జి-3: ఈ రకo 1962లో విడుదల చేశారు. యన్.పి. 46 ఎ నుండి రూపొందించబడిన రకము. మొక్కలు గుబురుగా లేత ఆకుపచ్చరంగుతో ఉంటాయి. కణుపుల వద్ద నీలి రంగు కలిగి ఉంటుంది. కాయలు 5-6 సెం.మీ. పొడవుతో, చివర మొనతేలి కొంచెం వంకరగా ఉంటాయి. వర్షాధార పంటగా అన్ని జిల్లాలో సాగుకు అనుకూలం. వర్షాధారం క్రింద హెక్టారుకు 15-18 క్వింటాళ్ళు దిగుబడి ఇస్తుంది.

జి-4 : ఈ రకo 1968లో తోహియన్ నుండి రూపొందించబడింది. మొక్కలు ఎత్తుగా పెరుగుతాయి. ఆకులు కోలగా, ముదురు ఆకుపచ్చరంగులో ఉంటాయి. కాయలు సన్నగా, పొడవుగా 7-8 సెం.మీ. పొడవుతో చివర మొనతేలి ఉంటాయి. కాయలో విత్తన శాతము 33. వైరసు తట్టుకుంటుంది. పచ్చిమిర్చి, ఎండుమిర్చికి అన్ని జిల్లాలో నీటి వసతి సాగుకు సిఫారసు చేయబడింది. ఈ రకాన్ని “భాగ్యలక్ష్మి” పేరిట జాతీయ స్థాయిలో భారత ప్రభుత్వం విడుదల చేసిoది. దిగుబడి 40-45

జి -5: ఈ రకము 1972లో విడుదల చేశారు. జీ 2 మరియు బి 71 రకముల సంకరముద్వారా రూపొందించబడిన రకము. మొక్కలు ఎత్తుగా, వెడల్పు ఆకులతో ఉంటుంది. కాయ లావుగా, పొట్టిగా 3-3.5 సెం.మీ. పొడవు ఉంటుంది. కాయలో విత్తనశాతం 45. నీటి వసతిన సాగుకు నెల్లూరు, చిత్తూరు, విశాఖపట్టణం జిల్లాలకు అనుకూలo. “ఆంధ్రజ్యోతి” పేరిట |జాతీయ వంగడము 1977లో విడుదల చేశారు.

High Yield Chilli Varieties

High Yield Chilli Varieties

Also Read: Crop Protection in Chilli: మిరప సాగులో సస్యరక్షణ చర్యలు.!

సింధూర్: ఈ రకము 1977లో విడుదల చేశారు. యల్.ఐ.సి, 44 నుండి రూపొందించిన రకo. మొక్కలు గుబురుగా ఎత్తుగా పెరుగుతాయి. కాయలు లావుగా, పొడవుగా 7-8 సెం.మీ పొడవుతో కాయచివర మొద్దుబారి ఉంటాయి. పచ్చిమర్చికి ఎండుమిర్చికి, బజ్జి మిర్చికి ఎక్కువగా వాడుకలో ఉన్న రకము, వైరస్ తెగులును ఎంత మాత్రం తట్టుకోలేదు. వేసవి సాగు అనుకూలమైన రకము. నీటి వసతి అన్ని జిల్లాలలో సాగుకు అనుకూలమైన రకము, దిగుబడి 50-55 క్వి/హె..

యల్.సి.ఎ · 235: ఈ రకము 1985లో విడుదల చేశారు. జి 4 మరియు ఎల్లో యాంథర్ మ్యుటెంట్ అను రెండు రకoలను సంకరపరచి రూపొందించబడిన రకము, మొక్కలు గుబురుగా, పొట్టిగా, ముదురు ఆకుపచ్చ రంగుతో ఉంటాయి. కాయలు 5-6 సెం.మీ పొడవుతో ఉంటాయి. ఘాటైన రకము. తెల్లనల్లి, వైరస్ తెగులు తట్టుకుంటుంది. వర్షాధార పంటగా, నీటివసతిన అన్ని జిల్లాలలో సాగుకు అనుకూలమైన రకము. “భాస్కర్” అను పేరుతో జాతీయ స్థాయిలో విడుదల చేశారు. దిగుబడి 50-60 క్వి/హె.

యల్.సి.ఎ – 206: ఈ రకము 1991లో విడుదల చేశారు. జి 3 మరియు హంటాకా అను రెండు రకములను సంకరపరచి రూపొందిందిన రకము, మొక్కలు ఎత్తుగా, లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి. కాయలు 6-7 సెం.మీ పొడవుతో | సననగా ఉంటాయి. కాయ నాణ్యత ఎక్కువ. నిలువ ఉంచిన కాయలు నల్లబడవు. వైరస్ తట్టుకొనలేదు. వర్షాధార పంటగా, నీటి వసతిన అన్ని జిల్లాలలో సాగుకు సిఫారసు చేశారు. దిగుబడి 45-50 క్వి/హె. “ప్రకాష్” అను పేరిట జాతీయ స్థాయిలో విడుదల చేశారు.

యల్.సి.ఎ – 305: ఈ రకము 1993లో విడుదల చేశారు. ఈ రకము యల్.సి.ఎ. 235 కంటే కాయ సైజు వృద్ధి పరచి రూపొందించిన రకము. మొక్కలు గుబురుగా, పొట్టిగా, లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి. కాయలు 8-8.5 సెం.మీ పొడవుతో లావుగా ఉంటాయి. పచ్చిమిర్చికి అనువైన రకము. వైరస్ తెగులును తట్టు కుంటుంది. నీటి వసతిన తేలికపాటి నేలల్లో సాగుకు సిఫారసు చేశారు. దిగుబడి 50-60 క్వి/హె.

Also Read: Phytophthora Blight in Chilli: మిరప పంట లో నారు కుళ్ళుతెగులు యాజమాన్యం.!

Leave Your Comments

Rainfall Impact on Crops: పంటల మీద వర్షపాత ప్రభావం ఎలా ఉంటుంది.!

Previous article

12th Grand Nursery Mela: 12వ గ్రాండ్ నర్సరీ మేళాను ప్రారంభించిన తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు.!

Next article

You may also like