ఆరోగ్యం / జీవన విధానంవ్యవసాయ వాణిజ్యం

మునగలో విశిష్టత

0
Drumstick Cultivation
Drumstick Farming Techniques

మునక్కాయల నిత్యం మనం తినే ఆహారమే అయితే మునక్కాయలే  కాకుండా ఆకులోను అద్బుతమైన అర్యోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అని పరిశోదనల్లో వెల్లడైంది. మునగాకులో విటమిన్లు ఏ ,సి  పుష్కలంగా ఉంటాయి . అలాగే కాల్షియమ్ ,ఫాస్ఫరస్ ,ఐరన్ కూడా మునగాకులో పుష్కలంగా ఉంటాయి. మునగాకులో  విటమిన్స్ ,ఎమినో యాసిడ్స్ ,మినరల్స్ సమృద్దిగా ఉంటాయి . క్యారెట్లు తింటే మాత్రమే వచ్చే విటమిన్ ఏ పది రెట్లు అధికంగా మునగాకు ద్వారా పొందొచ్చు . కళ్ళ సంభందించిన వ్యాధులకు మునగాకును వాడతారు. ఆకులు ముఖ్యంగా  పొటాషియం ,కాల్షియం , ఇనుము ,విటమిన్లు A మరియు D అత్యవసర అమైనో ఆమ్లాలు ,అలాగే  బి  కేరోటిన్  ,విటమిన్ సి మరియు  ప్లేవనోయిడ్స్  వంటి  అమైనో ఆమ్లాలు ఉంటాయి.

మునగాకుల్లో తక్కువ కేలోరి  కలిగి మరియు ఊబకాయం సమస్యతో బాధపడేవారికి ఉపయోగించవచ్చు. మునగ గింజలతో పీచు జీర్ణ సమస్యలు నివారించేందుకు పెద్ద ప్రేగు కాన్సర్ నివారిస్తుంది. పరిశోధనలో పక్వానికి రాని గింజలలో  పీచు 46.78% ఫైబర్ మరియు 20.66% ప్రోటీన్ పదార్దాలు ఉంటాయి. మునగ  గింజలలో 30% అమైనో ఆమ్లం కలిగి ఉంటాయి. ఆకులు 44% మరియు పువ్వులు 31 % శాతం ఉంటాయి. మునగలో కాల్షియం పెరుగుదలకు ఉపయోగపడుతుంది. మోరింగా పౌడర్ ఐరన్ టాబ్లెట్ లకు ప్రత్యమ్నాయంగా ఉపయోగించవచ్చు. అందువలన రక్త హీనతకు మునగ చాలా మేలు చేస్తుంది. పరిశోధనల ద్వారా తెలిసినది ఏమిటంటే మునగ సీడ్ ఆయిల్ లో 76 % PUFA  కలిగి ఉంటాయి. ఆలీవ్ నూనె ప్రత్యామ్నాయంగా    ఉపయోగించవచ్చు . ప్రాసెస్ అయినప్పుడు వారి పోషక లక్షణాలను కోల్పోతాయి .ముడి విత్తన పిండిలో ,మొలకెత్తిన గింజలలో కాని పులియ బెట్టిన వాటిలో పోషకాలు అధికంగా ఉంటాయి. ఫైటోట్ మరియు ఇతర పోషాకాల వ్యతిరేకత  పోషకాలు లభ్యతను తగ్గిస్తుంది కాబట్టి అన్నిటికంటే ఉడికించడం చాలా ఉత్తమైన పద్ధతి దీని ద్వారా పోషాకాలు అధికంగా లభ్యమవుతాయి . చిన్న పిల్లలకు మునగాకు పొడి చాక్లెట్స్ మరియు స్వీట్స్ లో కలిపి ఇవ్వవచ్చు (20%) మునగాకు నీడలో ఎండబెట్టడం మంచిది ,ఈ పద్ధతి వల్ల పోషకాలు నష్టపోవు .

  • గర్బిణీలు ,బాలింతలకు ఇస్తే వారికి అవసరం అయిన కాల్షియం ,ఐరన్ ,విటమిన్లు పుష్కలంగా లబిస్తాయి .తల్లులతో పాటు ,పాలు తాగే పిల్లలు కూడా అర్యోగ్యంగా ఉంటారు.
  • పాలిచ్చే తల్లులకు మునగాకును కూరగా వండి పెడితే రక్తహీనత నివారించవచ్చు .
  • ముఖ్యంగా కాల్షియం లోపాన్ని ఎదుర్కునే మహిళలకు వరప్రదాయిని అలాంటి వారు విరివిగా మునగాకును ఎదో ఒక రూపంగా ఉపయోగిస్తూ ఉంటే వారిలో కాల్షియం పెరుగుతుంది.

మునగాకు పొడి తయారీ :-

మునగాకు పొడి తయారీ కోసం ,ముందుగా మునగాకును కొమ్మలతో పాటు తుంచి శుభ్రం చేసుకొని నీడలో ఆరబెట్టాలి. నీడలో అర బెట్టినా మునగాకును గాలి దూరని డబ్బాలో నిల్వ చేసుకోవచ్చు. ఇంకో విదమైన పద్ధతిలో మునగాకును ఒవెన్ లో  50 డిగ్రీల సెంటీగ్రేడులో ఉంచి అందులోని తేమని తీసివెయ్యాలి. ఇలా చెయ్యడం వల్ల గాలి దూరని డబ్బాలో నిల్వ చేసుకోవచ్చు .తాజా మునగాకు కన్నా పొడిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. పోషాకార లోపంతో బాధపడుతున్న చిన్న పిల్లలు ,మహిళలకు పోషకాహారం లోపాలు తగ్గించడంలో దోహదపడుతుంది. మునగాకు పొడిని తయారుచేసుకొని రోజుకు 1 – 2  చెంచాలు పొడిని వాడుకోవచ్చు. మునగాకు కన్నా పాలకూర లో ఇనుము అధికంగా ఉంటుంది. క్యారేట్ లో కన్నా విటమిన్ “ ఏ “ అధికంగా ఉంటుంది, బత్తాయి పండులో కన్నా విటమిన్ ” సి” అధికంగా ఉంటుంది. చౌకగా లభించే మునగాకు వల్ల రక్తహీనత మరియు ఎముకుల సమస్యలు నివారించడానికి దోహదపడుతుంది.

మోరింగా సీడ్ ఆయిల్ జుట్టును ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించడానికి  మరియు శుభ్రంగా ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. మొరింగలో  ప్రోటీన్  కూడా ఉంటుంది , అంటే చర్మ కణాలను దెబ్బ తినకుండా కాపాడటంలో ఇది సహాయపడుతుంది. ఇది ఎలిమెంటల్ లను కలిగి ఉంటుంది ,ఇది చర్మం కాంతివంతంగా మరియు జుట్టును కూడా పెంచుతుంది.

మొరింగాలోని యాంటి బయోటిక్ మరియు యాంటీ  బాక్టీరియల్ లక్షణాలు వివిధ వ్యాధి కారకాల పెరుగుదలను  నిరోధించడంలో సహాయపడతాయి మరియు దీనిలోని అధిక విటమిన్ “బి “ కంటెంట్ జీర్ణక్రియకు సహాయపడుతుంది.

మోరింగాలో కాల్షియం మరియు  ఫాస్ఫరస్  కూడా ఉన్నాయి , ఇవి ఎముకలను అర్యోగ్యంగా మరియు బలంగా ఉంచడంలో సహాయపడతాయి. దాని antibacterial లక్షణాలతో పాటు మోరింగా సారం  ఆర్ద రైటీస్ వంటి పరిస్థితులకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది మరియు దెబ్బ తిన్న ఎముకలను కూడా నయం చేయవచ్చు . మొరింగ శరీరం మరింత ఇనుమును గ్రహించడానికి సహాయపడుతుంది , అందుచే ఎర్ర రక్త కణాల సంఖ్య పెరుగుతుంది , రక్త హీనత మరియు sickle సెల్ వ్యాధికి చికిత్స మరియు నివారించడంలో మొక్కల సారం చాలా సహాయకారిగా ఉంటుందని భావిస్తున్నారు.

Leave Your Comments

సమగ్ర యాజమాన్య పద్దతుల ద్వారా కొబ్బరిని ఆశించే కొమ్ము పురుగు – నివారణ

Previous article

అంతర పంటల వైపు రైతు చూపు ? ప్రయోజనాలేంటి ?

Next article

You may also like