Tunikaku Collection: వేసవి వచ్చిందంటే చాలు గ్రామాల్లో ప్రజలు తునికి ఆకు సేకరణ ప్రారంభిస్తారు. కరోనా ప్రభావం వల్ల గత మూడేళ్ళుగా తునికాకు సేకరణ ఆశించిన రీతిలో సాగలేదు. అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితులు మెరుగుపడడంతో తునికాకు సేకరణకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. వేసవిలో, ముఖ్యంగా గిరిజన మరియు ఇతర ప్రజలకు అలాగే ప్రభుత్వానికి కూడా ఆదాయం తెచ్చిపెడుతుంది ఈ తునికాకు సేకరణ. తునికి ఆకుని బీడీల తయారీలో వాడుతారు. ఈ వృత్తి పైన తెలంగాణ వ్యాప్తంగా చాల మంది ప్రజలు ఉపాధి పొందుతున్నారు.
తునికి ఆకును అడవిలో నుండి సేకరించిన తర్వాత, వాటిని కట్టలుగా కట్టి ఎండలో ఎండబెడతారు. ఒక్కో కట్టకు 50 ఆకుల చొప్పున ఉంచి కడతారు. ఆకు నాణ్యతను బట్టి ప్రభుత్వం వీటి ధర నిర్ణయిస్తుంది. ఒక్కో కట్టకు 2.05 నుండి 2.50 వరకు చెల్లిస్తుంది. ఇలా 50 ఆకుల చొప్పున ఉండే కట్టలు 1000 కలిపితే దాన్ని స్టాండర్డ్ బ్యాగ్ అంటారు. ప్రతి ఏడాది ప్రభుత్వ అటవీ శాఖ దాదాపు 2-3 లక్షల స్టాండర్డ్ బ్యాగులను సేకరిస్తుంది. దీంతో సీజన్ మొత్తం మీద ఒక్కో కుటుంబానికి దాదాపు 20 నుండి 30 వేల వరకు ఆదాయం సమకూరుతుందని అంచనా. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో తునికాకు సేకరణ క్రమంగా తగ్గుకుంటూ వస్తుంది, ఇందుకు కారణం గిరిజనులు మరియు ఇతర ప్రజలు ఎక్కువ కూలి దొరికే పనులపై ఆసక్తి చూపడమే. ఈ తునికాకు సేకరణ ఎక్కువగా ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ మరియు నిజామాబాద్ జిల్లాల్లో జరుగుతుంది.
Also Read: Broccoli Health Benefits: వేసవిలో తప్పక తినాల్సిన కూరగాయల్లో ఇది ఒకటి.!

Tunikaku Collection
కేవలం తునికి ఆకుతోనే కాకుండా, వాటి పళ్లతో (తునికి పండ్లు) కూడా చాలా వరకు లాభాలున్నాయి. ఈ తునికి పండ్లలో విటమిన్ ఎ మరియు సి అలాగే మాంగనీస్ కూడా లభిస్తుంది. వీటిలో ఇతర యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి, ఇవి క్యాన్సర్ మరియు స్ట్రోక్ సహా అనేక తీవ్రమైన ఆరోగ్య పరిస్థితుల ప్రమాదాలను నివారించడంలో సహాయపడతాయి.
తునికి పండ్లలో: కేలరీలు: 118, ప్రోటీన్: 1 గ్రాము, కొవ్వు: 0 గ్రాములు, కార్బోహైడ్రేట్లు: 31 గ్రాములు, ఫైబర్: 6 గ్రాములు, చక్కెరలు: 21 గ్రాములు లభిస్తాయి. ఈ తునికి పండ్లు కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి, అలాగే ఇవి మధుమేహ రోగులగు ఎన్నో ప్రయోజనాలు చేకూర్చి, సంబంధిత అనారోగ్య సమస్యలు రాకుండా నివారించడంలో తోడ్పడతాయి.
Also Read: Arjuna Tree Medicinal Uses: అర్జున చెట్టు వల్ల కలిగే అద్భుతమైన ఔషధ ఉపయోగాలు తెలుసా?
Also Watch:
Also Read: