మన వ్యవసాయంవ్యవసాయ వాణిజ్యం

Tobacco Cultivation Techniques: ఆరోగ్యవంతమైన పొగాకు నారు పెంపకంలో మెళుకువలు.!

2
Tobacco Cultivation Techniques
Tobacco Cultivation Techniques

Tobacco Cultivation Techniques: అరోగ్యవంతమైన నారు మొక్కలు పొగాకు పంట అధిక దిగుబడికి, నాణ్యతకు ప్రథమ సోపానము. కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ గత 6 దశాబ్దాలుగా ఆరోగ్యవంతమైన నారు మడులను పెంచడానికి, నాణ్యత గల పొగాకును పండించడానికి కృషి చేస్తూ, మేలైన యాజమాన్య పద్ధతులను కనుగొని, వ్యవసాయంలో ఖర్చు తగ్గించడానికి అనువైన సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించింది. ఈ పద్ధతులను పాటించడం ద్వారా తక్కువ ఖర్చుతో రైతులు నాణ్యమైన పొగాకు నారును ఉత్పత్తి చేయవచ్చును.

Tobacco Cultivation Techniques

Tobacco Cultivation Techniques

Also Read: Topping and De-suckering in Tobacco: పొగాకు సాగు లో తలలు నరకటం, పిలకలు తీసివేయటం కలిగే ఉపయోగాలు

నారుమడి పెంపకంలో మెళకువలు

  • నారుమడిని పెంచుటకు ఒండ్రు కలిగి ఇసుక వున్న ఏటవాలుగా మురుగు నీరు పోయే స్థలమును

ఎన్నుకోవాలి.

  • నారుమడి స్థలమును ప్రతి సంవత్సరము మార్చాలి.
  • తొలకరించగానే నారుమడిని లోతుగా దుక్కి దున్న వలెను. నారుమడిని బాగా మెత్తగా కలియదున్నాలి.
  • భూమిలోని చీడ పీడలను నిర్మూలించుటకు నారుమడి పెంచే స్థలములో నెమ్మదిగా కాలే వరి వూకను చదరపు మీటరకు 6 కిలోలు చొప్పున పరచి కాల్చి శుద్ధి చేయవలెను
  • నారుమళ్ళు 10మీ. పొడవు, 1.22 మీ. వెడల్పు, 15 సెం.మీ. ఎత్తు కలిగి, మళ్ళ మధ్య 50 సెం.మీ. కాలువ వుండునట్లుగా చేసుకోవాలి..
  • నారుమడి చుట్టూ పొగాకు విత్తనములు చెల్లుటకు రెండు వారములు ముందుగా ఆముదపు గింజలు నాటాలి, ఆముదపు మొక్కలను పెంచిన యెడల పొగాకు లద్దె పురుగులు ఆముదపు ఆకులపై గ్రుడ్లు పెట్టుటవలన వాటిని ఏరివేయవచ్చు. ముందుగా ఆముదపు మొక్కలను లద్దె పురుగులు ఆశించుటవలన నారుమళ్ళపై ఈ పురుగు ఉదృతి తగ్గును.
  • విత్తనము చెల్లుటకు 15-20 రోజుల ముందుగా బాగా చీకిన పశువుల ఎరువును 10 చ.మీ. నారుమడికి 25 కిలోల చొప్పున చెల్లి పై మట్టితో బాగా కలపాలి.
  • విత్తనములు చల్లుటకు ముందు ప్రతి 10 చ.మీ. మడిపై 100 గ్రాముల అమ్మోనియం సల్ఫేట్, 300 గ్రాముల సూపర్ ఫాస్పేట్, 100 గ్రాముల సల్ఫేట్ ఆఫ్ పొటాష్ రసాయనిక ఎరువులను (హెక్టారుకు 10 కిలోల నత్రజని, 50 కిలోల బాస్వరం, 50 కిలోల పొటాష్) నారుమడికి వేసి నేలలో బాగా కలపాలి.
  • మెగ్నీషియం ధాతువు లోపం వున్న భూములతో 100 గ్రాముల డోలమట్ను 10 చ.మీ. నారుమడికి (హెక్టారుకు 1.5 కిలోల మెగ్నీషియం) పశువుల ఎరువుతో కలిపి ముందుగా వేయవలెను.

Also Read: Nutrient Management in Tobacco: పొగాకు పంటలో ఎరువుల యాజమాన్యం.!

Leave Your Comments

Vibriosis Disease in Cows: ఆవులలో వచ్చే విబ్రియోసిస్ వ్యాధి యాజమాన్యం.!

Previous article

Catching Equipments for Hens: కోళ్ళను పట్టుకోనే పరికరాలు.!

Next article

You may also like