Simarouba: నానాటికి పెరుగుతున్న జనాభా, వారి సహజ వనరుల ఉపయోగం భూమి పైన రాభోయే తరాల మనుగడ ప్రశ్నర్థకంగా మారుతుంది. నేటి తరం జనాభా ఆధారపడ్డ వానరులలో డీసెల్ మరియు పెట్రోల్ ముఖ్యమైనవి. పద్ధతి ప్రకారం వాడకపోవడం, ప్రతిఒక్కరికి అత్యవసరంగా ఉన్నందున వీటి పరిమాణం తగ్గుతుండడం కలవర పెడుతున్న విషయం.దీనికోసం కొత్త చమురు వనరులను అన్వేషించాల్సిన అవసరం పెరుగుతున్నది. దానితో పాటుగా ప్రస్తుతం ఉన్న వాటికి ప్రత్యామ్న్యాయం కూడా వెతకవలసిన అవసరం ఉంది.
సిమరూబా గ్లాకా అనే అడవి వృక్షం దీనికి మంచి ప్రత్యామ్న్యాయంగా ఎదురుపడుతుంది. ఇది వేగంగా పెరిగే వృక్షం, వివిధ రకాల వాతావరణ పరిస్థితులలను తట్టుకుని ఆశాజనకమైన దిగుబడులు ఇవ్వగలదు. ఉష్ణమండలాలు జీవవైవిధ్యానికి మూలాధారం. ఇక్కడ సారవంతమైన నేలలతో కూడిన ఉష్ణమండల ప్రాంతాలు, మంచి వర్షపాతం నమోదు చేస్తాయి. ఈ ప్రాంతాలలో వ్యవసాయం మంచి లాభాలు ఇస్తుంది.
మంచి వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ ఇక్కడ వర్షపాతం నిలకడగా ఉండకపోవడం వలన పంటల సాగు చాలా లాభదాయకం కాదు మరియు ఈ ప్రాంతాల్లోని వ్యవసాయదారులకు తరచుగా నష్టాలు వస్తుంటాయి. వ్యవసాయం స్థిరంగా లేకపోవడం వలన ఈ ప్రాంతాలలో వ్యవసాయం చేసే రైతులతో పాటు భూమిలేని వ్యవసాయ కూలీలు భూమిని బీడుగా వదిలి జీవనోపాధి కోసం పట్టణాలకు వలసలు వెలుతున్నారు.
Also Read: టమాట నాటేటప్పుడు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఈ సమస్యను తగ్గించడానికి అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. వాటిలో, అస్థిరమైన, తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాలలో తక్కువ పెట్టుబడితో బాగా పెరిగే, స్థిరమైన దిగుబడులు ఇచ్చే పంటలను పండించడం కోసం సాంకేతికత అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో సిమరూబా గ్లాకా లేదా ప్యారడైజ్ ట్రీ లేదా లక్ష్మి తరు లేదా ఎసిటునో అనేక రకాల ప్రతికూల పర్యావరణ పరిస్థితులలో బాగా పెరిగే బహుళార్ధసాధక చెట్టు.
సిమరూబా గ్లాకా, మధ్య మరియు దక్షిణ అమెరికా అడవులకు చెందినది. నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ 1960లో మహారాష్ట్రలోని అమరావతిలో ప్రవేశపెట్టింది.బయోడీజిల్ కోసం సిమరూబా గ్లాకా ఉపయోగపడ్తుందని,భవిష్యత్తులో బయో-డీజిల్ పరిశ్రమకు ప్రత్యామ్నాయ వనరుగా ఉపయోగించని పరిశోధనలో తెలిపారు.బంజరు భూములలో పెరిగే ఈ వృక్షాన్ని గ్రామ స్థాయిలో పెంచడం వలన వేలాది మంది రైతులు, చేతివృత్తులు, వడ్రంగులు, ఫార్మసిస్ట్‌లు మరియు ఇతరులకు ఉపాధిని కలిగించవచ్చు.
దీని విత్తనాల నుండి బయోడీజిల్,పండ్ల గుజ్జు నుండి ఇథనాల్, పండ్ల గుజ్జు, నూనె-కేక్, ఆకులు, కొమ్మల నుండి బయోగ్యాస్ ఉత్పత్తి చేయవచ్చు. దీని సాగు భారతదేశంలో ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, రాజస్థాన్ మరియు గుజరాత్ వంటి ఇతర రాష్ట్రాల్లో ప్లాంటేషన్ ప్రారంభ దశలో ఉంది.
ఈ చెట్టు సముద్ర మట్టం నుండి 1000 మీటర్ల ఎత్తు ఉండి, బాగా నీటి పారుదల ఉన్న అన్ని రకాల నేలల్లో,ఉదజని సూచీ pH 5.5-8.0 మధ్య ఉంటె పెరుగుతుంది. మెరుగైన పెరుగుదలకు,1.0 మీటర్ల లోతున్న నేలలు అనుకూలం. ఇది 500 మిమీ- 4000 మిమీ వార్షిక వర్షపాతం ఉన్న ప్రాంతాలలో పెంచబడుతుంది. మంచి ఎదుగుదల, ఉత్పాదకత కోసం మంచి లోమీ నేలలు , ఎర్రని నెలలు అనుకూలం.
ఈ పంట ఏడాదిలో 6-8 నెలలవరకు నీటి ఎద్దడిని తట్టుకోగలదు. దీనిలో మంచి పోషక విలువలు, నీటికి తక్కువ అవసరం బయోమాస్ ఉత్పత్తినకి అత్యంత అనుకూలంగా ఉంటుంది. సిమరూబాతో కూరగాయల అంతరపంటగా వేసిన పరిమాణం మరియు నాణ్యతను మెరుగుగా ఉంటుంది.సిమరూబా గ్లాకా సరైన యాజమాన్యం పాటించడం వలన నీటిపారుదలతో 3 టన్నుల కన్నా ఎక్కువ జీవ ఇంధనాన్ని ఇస్తుంది. ఇది వ్యవసాయ పంట నుండి అసాధారణమైనది.
Also Read: తక్కువ సమయంలో అధిక దిగుబడి సాధిస్తున్న రైతు